మంచి మాటలు, Manchi Matalu In Telugu, Sukthulu

మంచి మాటలు, Manchi Matalu In Telugu, Sukthulu

Manchi Matalu In Telugu, Sukthulu, Manchi Matalu Telugu Quotations

Best Manchi Matalu In Telugu, Sukthulu, Koteshans, Quotes, golden words Manchi Matalu, Neethi Manchi Matalu, Images, Manchi Matalu In Telugu Quotes Text, Telugu Good Words, Wallpapers, Telugu Sayings, Teachings Good Words.

మంచి మాటలు తెలుగులో, తెలుగు మంచి సూక్తులు

మంచి మాటలు తెలుగు, సూక్తులు, కొటేషన్స్. గొప్ప వ్యక్తులు చెప్పిన మంచి మాటలు తెలుగులో, మనలో స్ఫూర్తిని నింపే, నిజ జీవితాన్ని తెలియజేసే మంచి మాటలు, సూక్తులు. మోటివేషనల్, స్ఫూర్తినిచ్చే మాటలు టెక్స్ట్ రూపంలో మీకోసం,

ఇమేజెస్ ( Images ) కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి 👉 Manchi Matalu Best Images

Telugu Manchi Matalu | Sukthulu


చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయానికి దారులు
- స్వామి వివేకానంద

అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి
- మక్సీం గోర్కీ

సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లూ వాటంతటవే వస్తాయి.
- స్వామి వివేకానంద

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు, మీ అభివృద్ధికి అవే ఆటంకాలు
- సుభాష్‌ చంద్రబోస్‌

విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు
- ఆస్కార్‌ వైల్డ్‌

ఆనందం వస్తువుల్లో లేదు, అది మనసులో ఉంది
- ఎమర్సన్‌

శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే
- గౌతమ బుద్ధుడు

సమస్యకు పరిష్కారం, ప్రశ్నకు సమాధానం, దుఃఖం తర్వాత సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం కచ్చితంగా ఉంటుంది

మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే.. విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి.

నీ పని నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇతరుల పని ఇంకా కష్టంగా ఉంటుంది అని నీకు తెలియనప్పుడు!

మనసు ఆనందంగా ఉంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది
- గౌతమ బుద్ధుడు

సూర్యుణ్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది
- స్వామి వివేకానంద

ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు
మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం
- రామకృష్ణ పరమహంస

సంకల్పబలం ఉన్నవారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోగలరు.
-నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌

నాణేలు శబ్దం చేస్తాయి. కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి. -షేక్‌స్పియర్‌

ఇతరుల మెదళ్లనూ పనిచేయించ గలవాడే నిజమైన మేధావి
-సుభాష్‌ చంద్రబోస్‌

శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే
- భగత్‌సింగ్‌

మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం
- డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌

పొగిడితే మందహాసం చేసి..తిడితే మౌనం వహించేవాడే ఉత్తముడు
-మహాత్మా గాంధీ

పదే పదే ప్రార్థించడం కన్నా.. పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న
-మదర్‌ థెరెసా

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు.
-అబ్రహాం లింకన్‌

పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది.
మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది
- చాణక్యుడు

పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి
-అబ్దుల్‌ కలాం

మందలో ఒకరిలా ఉండకు.. వందలో ఒకరిలా ఉండేందుకు ప్రయత్నించు
-స్వామి వివేకానంద

ఈ ప్రపంచం బాధ పడేది చెడ్డవారి హింసవల్ల కాదు, మంచివారి మౌనం వల్ల
- నెపోలియన్‌

కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు
-మహాత్మా గాంధీ

ఇతరులపై గెలిచినవాడు బలవంతుడు. తనను తాను గెలిచిన వాడు శక్తిమంతుడు
-బ్రూస్‌లీ

వేరేవారి తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు.
- చాణక్యుడు

ఉత్సాహంతో శ్రమించాలి. అలసటను ఆనందంగా అనుభవించాలి
- స్వామి వివేకానంద

అందరూ గొప్పసేవలు చేయలేకపోవచ్ఛు కానీ
చేసేది చిన్న సేవే అయినా గొప్పగా ఉండాలి
- మదర్‌ థెరెసా

ప్రపంచం మారాలని కోరుకోవడం కాదు.. ముందు మనం మారాలి
- టాల్‌స్టాయ్‌

తల్లి మేలు కోరని చెడ్డ కుమారుడు ఉండవచ్చు. కానీ కుమారుడి మేలు కోరని చెడ్డ తల్లి ఉండదు
-శంకరాచార్య

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు.
కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు
- బ్రూస్‌లీ

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
-అబ్రహం లింకన్‌

లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే.. నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది
-గౌతమ బుద్ధుడు

ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే
- నెల్సన్‌ మండేలా

ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ.. మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుంది
- చాణక్యుడు

మనకు ఒకరు సేవ చేసేకంటే.. మనం ఇతరులకు సేవ చేయడమే ఉన్నతమైంది
-మదర్‌ థెరెసా

కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు, అయితే ఎప్పుడో కానీ సరైన కారణం ఉండదు
-బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌


మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు
- మహాత్మా గాందీ

ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు
-గౌతమ బుద్ధుడు

మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ.. ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేం
- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి..
ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి
- మహాత్మా గాంధీ

ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పు గుర్తు చేసుకో..
ఇక ఎప్పటికీ ఆ తప్పు పునరావృతం కాదు
- ఆస్కార్‌ వైల్డ్‌

గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు. అవి లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు
-చిలకమర్తి లక్ష్మీ నరసింహం

కింద పడ్డానని ఆగిపోకు.. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే
- అబ్దుల్‌ కలాం

ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించు
-మదర్‌ థెరెసా

నీ కోసం.. చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా.. కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న
-రామకృష్ణ పరమహంస

ముఖం మీద చిరునవ్వు లేకపోతే, అందమైన దుస్తులు వేసుకున్నా.. ముస్తాబు పూర్తి కానట్లే
-మహాత్మా గాంధీ

హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే..
హృదయాన్నే అనుసరించండి
- స్వామి వివేకానంద

విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు
-మహాత్మా గాంధీ

కోపం మాటల్లో ఉండాలి. మనసులో కాదు.
ప్రేమ మాటల్లోనే కాదు. మనసులోనూ ఉండాలి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

కుటుంబం కోసం త్యాగం చేసే వాడు ఉన్నతుడైతే, దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడవుతాడు
- మహాత్మా గాంధీ

ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే!
-బి.ఆర్‌.అంబేడ్కర్‌

మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా.. అది గెలుపే అవుతుంది
- అబ్దుల్‌ కలాం

ఆత్మవిశ్వాసం మనిషికి అసలైన ఆభరణం
- స్వామి వివేకానంద

ఒక అమ్మ.. వందమంది ఉపాధ్యాయులతో సమానం
-రామకృష్ణ పరమహంస

అసత్యంతో సాధించిన విజయం కంటే,
సత్యంతో సాధించిన పరాజయమే మేలు
- మహాత్మా గాంధీ

మానవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది పుస్తకమే
- మాక్సింగోర్కీ

తన తప్పునకు ప్రతివారూ పెట్టుకొనే అందమైన పేరు.. అనుభవం.
-ఆస్కార్‌ వైల్డ్‌

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుకా ఓ అవకాశం దాగి ఉంటుంది
- ఐన్‌స్టీన్‌

ఇతరుల్ని ఓడించడం సులువే కానీ వారి మనసులను గెలవడం కష్టం
- అబ్దుల్‌ కలాం

నీది కాదని తెలిసిన దాన్ని కూడా నీదనుకోవడం నిజంగా నేరం
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

చదవదగిన గ్రంథమెప్పుడూ కొనదగిందే
- జాన్‌ రస్కిన్‌

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది.
కానీ మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది
- రామకృష్ణ పరమహంస

స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి
- లెనిన్‌

తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు
- గౌతమ బుద్ధుడు

మంచి దేశాన్ని నిర్మించాలంటే, ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య

శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం.
- అబ్రహం లింకన్‌

ఎదుటి వారిపై అసూయ పడుతున్నామంటే
అది మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి
- అబ్రహం లింకన్‌

దృఢమైన మనసున్న వారికి అంధకారంలోనూ కాంతిరేఖ కనిపిస్తుంది
- సోక్రటీస్‌

ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డు లేని పడవలాంటి వాడు
- మహాత్మాగాంధీ

దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసును ఎవరూ పాడు చేయలేరు
-స్వామి వివేకానంద

ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు
- అబ్రహం లింకన్‌

అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది
- మదర్‌ థెరిస్సా

విజయం.. మేధావిని వినయవంతుణ్ని చేస్తుంది,
అవివేకిని అహంభావిగా మారుస్తుంది
- స్వామి వివేకానంద

వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు
-గౌతమ బుద్ధుడు

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాదిగా మారాలి
- సాథె

మంచి పనులకు పునాది క్రమశిక్షణే, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది
-సర్వేపల్లి రాధాకృష్ణన్‌

చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి. అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి
- శంకరాచార్యులు

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ అదుపులో ఉంచుకొని మాట్లాడు
- రామకృష్ణ పరమహంస

కొద్దిపాటి నిర్లక్ష్యమే కొండంత సమస్యకు దారి తీస్తుంది
- ఫ్రాంక్లిన్‌

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే...
మనలోనూ అది పెరుగుతుంది
- రామకృష్ణ పరమహంస

కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతం అవుతుంది
-పైథాగరస్‌

ప్రవర్తన అనేది తెల్లకాగితం లాంటిది..
ఒక్కసారి దాని మీద మరక పడితే, మళ్లీ తెలుపు కావడం కష్టం
- ఫ్రాంక్లిన్‌

ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది
- రూసో

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం
- గాంధీజీ

ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు
- ఎమర్సన్‌

చరిత్ర చదవడమే కాదు.. సృష్టించాలి
-నెహ్రూ

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది
- రామకృష్ణ పరమహంస

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం..
కృషితో మనం సంపాదించుకొనేదే శాశ్వతం
-మహాత్మాగాంధీ

విజ్ఞానమనేది చెప్పే సమాధానంలోనే కాదు...అడిగే పశ్నలోనూ ఉంటుంది
- సర్‌ సి.వి.రామన్‌

వినడంలో మనిషి తొందర పడాలి. మాట్లాడటంలో కాదు.
-జేమ్స్‌ జ్యూడిత్‌

మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్ధు. ఎందుకంటే మీరు రెండోసారి ఓడిపోవచ్చు.
- అబ్దుల్‌ కలాం

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు
-అరిస్టాటిల్‌

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది
-రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి
-మహాత్మా గాంధీ

ఒప్పుకొనే ధైర్యముంటే, తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే
-బ్రూస్‌లీ

అపజయాలను ఖాతరు చేయకండి. వెయ్యిసార్లు విఫలమైనా మరోసారి విజయం కోసం ప్రయత్నించాలి
- సుభాష్‌ చంద్రబోస్‌

తప్పును సరిదిద్దకపోతే అది మరింత ఆపదను తెచ్చిపెడుతుంది
- స్వామి వివేకానంద

ఫలితం గురించి ఆలోచించకుండా
పని పూర్తి చేయడమే మనిషి పని
- చాణక్యుడు

దుఃఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

వెయ్యిసార్లు అపజయం ఎదురైనా గెలవాలనే కాంక్షను వదలొద్దు
- సుభాష్‌ చంద్రబోస్‌

దేశ స్వేచ్ఛని కాపాడుకోవడమనేది ప్రతి పౌరుడి బాధ్యత
- సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

స్పష్టత లేకుండా మాట్లాడటంకన్నా మౌనమే మిన్న
- సోక్రటీస్‌

మనకు పట్టుదల ఉండాలి, అన్నింటికంటే మించి మన మీద మనకు విశ్వాసం ఉండాలి.
- మేరీ క్యూరీ

ఘన విజయాలు సాధించడానికి అంకిత భావంతో పనిచేయండి
- అబ్దుల్‌ కలాం

మనిషి ఎంత గొప్పవాడైతే..అంత కఠినమైన పరీక్షలు దాటాల్సి ఉంటుంది
-స్వామి వివేకానంద

నీ విజయాన్ని అడ్డుకునేది వేరెవరో కాదు..
నీలోని ప్రతికూల ఆలోచనలే
- అబ్దుల్‌కలాం

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మూర్ఖుడి చేతిలో పుస్తకం.. అంధుడి చేతిలో అద్దం లాంటిది.
-చాణక్యుడు

గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి
- అంబేడ్కర్‌

వేలాది వ్యర్థమైన మాటల కన్నా... శాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు
-గౌతమ బుద్ధుడు

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే
- లింకన్‌

మనస్ఫూర్తిగా పనిచేయనివారు.. జీవితంలో విజయాన్ని సాధించలేరు
- అబ్దుల్‌ కలాం

మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే
- స్వామి వివేకానంద

గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
- మహాత్మా గాంధీ

మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది
- అంబేడ్కర్‌

మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు.
- గాంధీజీ

కోరికలు మితంగా ఉంటే.. బాధలూ పరిమితంగానే ఉంటాయి
- రమణ మహర్షి

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
- అబ్రహం లింకన్‌

మండిన కొవ్వొత్తి మనది కానట్లే...
గడచిన కాలమూ తిరిగిరాదు
- అంబేడ్కర్‌

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు. మీ అభివృద్ధికి అవే ఆటంకాలు
-నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌

ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు, దాన్ని జయించిన వాడు
-నెల్సన్‌ మండేలా

తక్కువ సంపాదించే వారి కన్నా..
తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి
- మహాత్మా గాంధీ

అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు..ఒక్క నిజాన్ని తప్ప
- గౌతమ బుద్ధుడు

ఇతరుల దు:ఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు
- అరిస్టాటిల్‌

పదునైన ఆయుధం కంటే క్షణ కాలంలో
వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం
- రామకృష్ణ పరమహంస

ఎంత ఎక్కువకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
- అంబేడ్కర్‌

కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి.
- అబ్దుల్‌ కలాం

అన్నదానం ఆకలిని తీరిస్తే.. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది
-సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి
-మహాత్మాగాంధీ

అందం అనేది నడవడికలో ఉంటుంది.. ఆడంబరాల్లో కాదు
-మహాత్మా గాంధీ

మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు
- గౌతమ బుద్ధుడు

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు..హృదయంలో ఉంటుంది.
- మహాత్మా గాంధీ

ప్రయత్నం చేసి ఓడిపో.. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

బయట కనిపించే మురికి గుంతల కన్నా..
మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మనిషి మంచిదనం మాత్రం నాలుగుదిక్కులకూ వ్యాపిస్తుంది.
- చాణక్యుడు

మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే!
- స్వామి వివేకానంద

జీవితంలో... ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో.. కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో..
ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది
- గౌతమ బుద్ధుడు

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనకా ఓ అవకాశం దాగి ఉంటుంది.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది
- అబ్దుల్‌కలాం

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా
మౌనంగా ఉండటమే మిన్న
- రమణ మహర్షి

నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.
- స్వామి వివేకానంద

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే.. శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం
-మదర్‌ థెరిసా

కష్టాలను చూసి పారిపోయే వారి కంటే.. వాటిని ఎదుర్కొనే వారే విజయం సాధించగలరు.
-మహాత్మా గాంధీ

డబ్బు లేనివాడు కాదు..
జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు
-స్వామి వివేకానంద

శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే
- భగత్‌సింగ్‌

శాంతంగా ఉండే వారి మనసు స్వర్గంలాంటిది
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే
ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి
- స్వామి వివేకానంద

ప్రతి మనిషికీ మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి ఉండదు
- మదర్‌ థెరిసా

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయం దక్కదు
- అబ్రహం లింకన్‌

మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి
-గౌతమ బుద్ధుడు

వినడానికి కటువుగా ఉన్నా.. మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్లదు
- భగవద్గీత

మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి.
ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే!
- స్వామి వివేకానంద

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతారు
- అరిస్టాటిల్‌

ఆశ, ధైర్యం ఎప్పటికీ కోల్పోవద్దు, మీ ముందున్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే విజయం మిమ్మల్ని వరిస్తుంది
- సర్‌ సి.వి.రామన్‌

పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ... మనం అవకాశాలను సృష్టించుకోవాలి
-బ్రూస్‌లీ

సాయం చేస్తే మరిచిపో.. సాయం పొందితే గుర్తుంచుకో
- గాంధీజీ

కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
- స్వామి వివేకానంద

మొదటి విజయం సాధించిన తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. రెండో ప్రయత్నంలో ఓడిపోతే.. నీ గెలుపు గాలివాటంగా వచ్చిందనుకుంటారు.
- అబ్దుల్‌ కలాం

విజయం అంటే.. నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడం!
- అబ్దుల్‌ కలాం

స్తుతించే వారి కంటే.. కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా మంచిని పొందగలం.
- మహాత్మా గాంధీ

ఏ ప్రాణినీ చంపకూడదు, ఆ ప్రాణిలోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి, దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతి మనిషి మంచివాడే
- వేమన

చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే
పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు
- జవహర్‌ లాల్‌ నెహ్రూ

అపజయాలు తప్పులు కావు... అవి భవిష్యత్తు పాఠాలు
- అబ్దుల్‌ కలాం

ఏదైనా తనంతట తాను నీ దరిచేరదు..
ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది
-శ్రీశ్రీ

కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే
- గౌతమ బుద్ధుడు

చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు
- ప్లేటో

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది
- రమణ మహర్షి

మనం ఎలా ఆలోచిస్తే... అలానే ఉంటాం
- గౌతమ బుద్ధుడు

మన ప్రవర్తనకు మూలం... కోరిక, భావోద్వేగం, జ్ఞానం
-ప్లేటో

ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే
- లింకన్‌

చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది
- రమణ మహర్షి

విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే... గమ్యం కాదు
- అబ్దుల్‌ కలాం

మనిషికి అసలైన సిరిసంపదలు... సంతోషం, తృప్తి
- సోక్రటీస్‌

విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాలు
- స్వామి వివేకానంద

మండిన కొవ్వొత్తి లాగే... గడిచిన కాలమూ తిరిగిరాదు.
- అంబేడ్కర్‌

మనుషుల్ని గాయపరచడం ఎంత తప్పో, మనసుల్ని గాయపరచడమూ అంతే తప్పు
- సోక్రటీస్‌

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు
- లింకన్‌

నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు.. ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు
- గౌతమ బుద్ధుడు

నువ్వు రోజూ అబద్ధం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది
- శ్రీశ్రీ

మనస్ఫూర్తిగా పనిచేయలేనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
- అబ్దుల్‌ కలాం

నీవు సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే... నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు
- అరిస్టాటిల్‌

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది, అలాగే మహానుభావులుగా
మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి
- గాంధీజీ

ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి
- స్వామి వివేకానంద

విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది.
- చాణక్యుడు

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది.
- అబ్దుల్‌ కలాం

ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు
ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు
- గౌతమ బుద్ధుడు
ఏ అర్హత మనకుంటే అదే లభిస్తుంది
- స్వామి వివేకానంద

విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది.
- అబ్దుల్‌ కలాం

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనమే మిన్న
- రమణ మహర్షి

చేసేది చిన్న పనైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది
- స్వామి వివేకానంద

వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో,
కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు
- స్వామి వివేకానంద

నువ్వు యుద్ధం గెలిచేంత వరకూ ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది
- అరిస్టాటిల్‌

విలువైన మాటలు చెప్పేవాళ్లు దొరకడం మన అదృష్టం, అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం
- స్వామి వివేకానంద

ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు
- గాంధీజీ

సాధించాలనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది
- సోక్రటీస్‌

సరిదిద్దకుండా వదిలేసిన తప్పుల్ని మించిన ఆపదలు మరేమీ ఉండవు
- స్వామి వివేకానంద

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే
- అబ్రహాం లింకన్‌

మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.
- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం, వివేకంతో మాత్రమే అది సాధ్యం
- స్వామి వివేకానంద

గొప్ప పనులు చెయ్యడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడమే
- స్టీవ్‌ జాబ్స్‌

ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్యపుస్తకం
- గాంధీజీ

మనిషి తన చేతలతోనే గొప్పవాడు అవుతాడుగానీ జన్మతః కాదు
- చాణక్యుడు

మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది
- గాంధీజీ

అదృష్టం కావాలంటే ఎదురుచూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి
- రూజ్‌వెల్ట్‌

విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు.. నిన్ను నువ్వు గెలవడం
- గౌతమ బుద్ధుడు

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి...
- గాంధీజీ

చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలోఆత్మీయత ఉంటుంది
- రూజ్‌వెల్ట్‌

చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు
- అబ్దుల్‌ కలాం

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు
- ప్లేటో

ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారిపోక తప్పదు
- హెలెన్‌ కెల్లర్‌

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు
- చేగువేరా

ఓర్పు లేని మనిషి. నూనె లేని దీపంలాంటి వాడు

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ కనబరచాలి

అసలు పనిచేయకుండా బద్ధకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు
- స్వామి వివేకానంద

ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు
- అంబేడ్కర్‌

అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు
- స్వామి వివేకానంద

ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి.
- గౌతమ బుద్ధుడు

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు
- చెగువేరా

ఇతరుల మెదళ్లనూ పనిచేయించగలవాడే మేధావి
- సుభాష్‌ చంద్రబోస్‌

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు
- అంబేడ్కర్‌

మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
- మహాత్మాగాంధీ

ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీని వల్ల ఫలితమేంటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలుపెట్టొద్ధు...
- చాణక్యుడు

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది
- బ్రూస్‌లీ

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి, సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

మీరు చేసిన పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి
- ఐన్‌స్టీన్‌

అవసరమైతేనే మాట్లాడు.. లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు
- గౌతమ బుద్ధుడు

నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది
- స్వామి వివేకానంద

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
-మహాత్మా గాంధీ

భయం నీకు చేరువవుతుంటే, దానిపై యుద్ధం ప్రకటించు
- చాణక్య

దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు.
- గౌతమబుద్ధుడు

కన్నీటి చుక్క కారిస్తే కాదు..
చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు
-శ్రీశ్రీ

గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి
- వినోబాభావే

Post a Comment

Previous Post Next Post