Bruce Lee Quotes In Telugu • బ్రూస్ లీ సూక్తులు

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu, Bruce Lee Inspirational Telugu Quotations

Bruce Lee Quotes In Telugu, Best Motivational Bruce Lee Sayings In Telugu. Martial Arts Hero Bruce Lee Quotes in Telugu That Inspires us. Bruce Lee Philosophy Sayings, Teachings In Telugu Best Images, Wallpapers, Share on Whatsapp.

బ్రూస్ లీ కోట్స్ తెలుగులో, ( బ్రూస్ లీ సూక్తులు )

మార్షల్ ఆర్ట్స్ ధీరుడు బ్రూస్ లీ చెప్పిన కొటేషన్స్ తెలుగులో, బ్రూస్ లీ 1940 నవంబర్ 27వ తేదీన అమెరికా లోని  శాన్ ఫ్రాన్సిస్కొ లో జన్మించాడు.  బ్రూస్ లీ ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు ఎలాంటి వాడైనా సరే ఒక్క దెబ్బతో మట్టికరిపించగల ధీరుడు. కుంఫు, కరాటే నేర్చుకునే వారికి ఆరాధ్యదైవం బ్రూస్ లీ. బ్రూస్ లీ సినీ పరిశ్రమలో హీరోగా చాల సినిమాలు చేశాడు.

మనలో స్ఫూర్తిని నింపే బ్రూస్ లీ సూక్తులు తెలుగులో.

Bruce Lee Quotes In Telugu - Images

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Quotes In Telugu

Bruce Lee Telugu Quotations - Text

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే, అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
- బ్రూస్‌లీ

ఇతరులపై గెలిచినవాడు బలవంతుడు. తనను తాను గెలిచిన వాడు శక్తిమంతుడు.
-బ్రూస్‌లీ

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు.
- బ్రూస్‌లీ

ఒప్పుకొనే ధైర్యముంటే, తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే.
-బ్రూస్‌లీ

పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ. మనం అవకాశాలను సృష్టించుకోవాలి..
-బ్రూస్‌లీ

ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు వంటిది.
- బ్రూస్‌లీ

పరిస్థితుల్ని చూసి పారిపోకూడదు, ఎదురు నిలబడినప్పుడు, సమస్య ఏదైనా చిన్నబోతుంది.
- బ్రూస్‌లీ

నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే, సమయాన్ని వృథా చేయొద్దు. ఎందుకంటే, జీవితాన్ని నిర్దేశించేది సమయమే.
- బ్రూస్‌లీ

గెలవగలనని నమ్మకం లేనివాడు, మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు.
- బ్రూస్‌లీ

జీవితం దాని గమనంలో మనకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
- బ్రూస్‌లీ

విజేత అయిన ప్రతి వ్యక్తి వెనకా కష్టం ఉంటుంది, కష్టం విజయంతోనే ముగుస్తుంది.
- బ్రూస్‌లీ

మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు, అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
- బ్రూస్‌లీ

విజయం సాధించాలనే మీ సంకల్పమే అన్నింటికన్నా ముఖ్యం, అనుక్షణం దీన్ని గుర్తు చేసుకోవడమే విజయ రహస్యం.
- బ్రూస్‌లీ

విజయం ప్రయాణమేగానీ, గమ్యం కాదు.
- బ్రూస్‌లీ

ఆటంకాలెదురయ్యే కొద్దీ, మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చెయ్యాలనే పట్టుదలను పొందాలి.
- బ్రూస్‌లీ

విజయం అంతిమ లక్ష్యమూ కాదు, ఓటమి శాశ్వతమూ కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఉండగలగడమే మన గొప్పతనం.
- బ్రూస్‌లీ

ఓటమి అనేది ఒక ఆలోచన, వాస్తవంగా అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు.
- బ్రూస్‌లీ

అనవసరపు ఆలోచనలను బుర్రలో నుండి ఖాళీ చేయించు, ఒక రూపు, ఆకారం లేకుండా ఉండు. నీరులా..
- బ్రూస్‌లీ

ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే, నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు.
- బ్రూస్‌లీ

స్వాధీనం అనేది ఏదైనా, మనస్సులోనే మొదలవుతుంది.
- బ్రూస్‌లీ

పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ, నేను అవకాశాలను సృష్టించుకుంటాను.
- బ్రూస్‌లీ

10,000 కిక్‌లను ఒకసారి ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడను, కానీ ఒక కిక్‌ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను  భయపడతా..!
- బ్రూస్‌లీ

ఒక మనిషి ఎంత నిజాయితీ పరుడో అతని ఆనందాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
- బ్రూస్‌లీ

సూత్రాలకు కట్టుబడి ఉండకుండా, వాటిని పాటించండి.
- బ్రూస్‌లీ

దేనిగురించైతే నీవు ఆలోచిస్తావో.. దానినే సాధిస్తావు.
- బ్రూస్‌లీ

ముందు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకో, తర్వాత దాన్ని సాధించడం కోసం  కృషి చెయ్యి.
- బ్రూస్‌లీ

జ్ఞానం మీకు శక్తిని ఇస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది.
- బ్రూస్‌లీ

బ్రూస్లీ గురించి తెలుగులో

బ్రూస్ లీ 1940 నవంబర్ 27వ తేదీన అమెరికా లోని  శాన్ ఫ్రాన్సిస్కొ లో జన్మించాడు. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలం తరువాత ఆయన కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్ కి వచ్చేశారు. బ్రూస్ లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు ఆయన బ్రూస్ లీ ని కూడా అప్పుడప్పుడు షూటింగ్ కి తీసుకెళ్లేవారు. దాంతో బ్రూస్ లీ చిన్న వయసులోనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. అలా నటనతో పాటు బ్రూస్లీ డాన్స్ కూడా నేర్చుకున్నాడు.

అప్పట్లో అమెరికాలోని హాంకాంగ్ లో మాఫియా గ్యాంగ్  లు పాలించేవి. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్ లీ కి పద్నాలుగేళ్ళ ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్ లీ తో గొడవపడి బ్రూస్ లీ ని గట్టిగ కొట్టారు. ఆ సంఘటననే బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్ నేర్చుకునేలా చేసింది. తనను తాను రక్షించుకోవడం కోసం బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు.

అప్పట్లో కుంగ్ ఫు లో నెంబర్ వన్ అయిన ఇప్ మాన్ ఆయన దగ్గర కుంగ్ ఫు నేర్చుకున్నాడు, స్కూల్లో మరోసారి ఆ గ్యాంగ్ దాడికి దిగారు. కానీ, ఇప్పుడు బ్రూస్లీ ఇంతకు ముందులా కాదు.  ఈసారి గొడవలో ఒకరి పళ్ళు ఊడిపోయేలా, మరొకరి చేయి విరిగిపోయేలా చితకొట్టాడు. ఇలా చేసినందుకు బ్రూస్లీ ని ఇంకోసారి గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీస్ లు బ్రూస్ లీ తండ్రిని హెచ్చరించారు.

అయితే ఈ మాఫియా గ్యాంగ్ నుండి దూరంగా ఉంచడం కోసం ఆయన తల్లిదండ్రులు 18 ఏళ్ల వయసున్నా బ్రూస్ లీ ని  కాలిఫోర్నియాలోని తన స్నేహితులు ఇంటికి పంపేశారు. మళ్లీ పుట్టిన చోటికే వచ్చాడు బ్రూస్లీ. మొదట ఒక రెస్టారెంట్లో వెయిటర్ గా పనిచేశాడు, కొంతకాలం తరువాత యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ లో ఫిలాసఫీ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు.

ఆ మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్లీ క్రేజ్ పెరిగిపోయింది,  ఎంతో మంది స్నేహితులు బ్రూస్లీ దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు, అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే 1963లో 'Jun  Fan Gung Fu'  అనే మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేసాడు. కొంతకాలం తర్వాత తన కాలేజీ స్నేహితురాలు అయినటువంటి 'లిండా లీ క్యాడ్‌వెల్' అనే ఆమెను ప్రేమించి 1964లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. (క్రెడిట్స్ ; తెలుగుబడి)

Post a Comment

Previous Post Next Post