Moral Stories In Telugu For Kids : నీతి కథ

గ్రామంలో టీచర్ తెచ్చిన మార్పు

శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్‌ శేఖర్‌. కొద్దికాలంలోనే పిల్లల్ని గ్రామ వరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివి తేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటి వద్ద వుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పడూ టి.వి. చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టివి. చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

టి.వి. చూడటం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టి.వి. చూస్తే చదువులో వెనకబడి పోతారని, ఇంటివద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్చు రాలేదు.

పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారు చేసుకున్నాడు శేఖర్‌. ,
ముందుగా పిల్లల్ని టివి. నుండి దృష్టి మళ్ళించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్‌.

సాయంత్రం వరకూ బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకో క్రొత్త రకం ఆట ఆడించాడు. నేర్చించాడు. క్రమేపి సిల్లలు శేఖర్‌కి చేరువయ్యారు. టివి. చూడటం తగ్గించారు. శేఖర్‌ కోరుకున్నది కూడా అదే. పిల్లల్సి ఆటల నుండి శేఖర్‌ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు.

సాహస గాథలూ, రాజులు, దొంగలు, నీతికథలు... ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్‌ కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల్ని పున్తకాలను వారికి అందుబాటులో వుంచాడు.

వారిలో పఠనానక్తిని పెంచాడు. స్కూల్లో వున్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రనుంలో పిల్లలు పూర్తిగా టివిని మర్చిపోయారు. శేఖర్‌ ఆనందించాడు. ఇదే సమయంలో కథలనుండి వారి దృష్టిని పాఠ్య పుస్తకాలపై మళ్ళించాడు.

అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటివద్ద చదువుకోవడం ప్రారంభించారు.
పిల్లల్లో వచ్చిన మార్చును చూసి గ్రామస్తులు శేఖర్‌ని అభినందించారు. ఓ సభ ఏర్చాటు చేసి శేఖర్‌ను సన్మానించారు.

సభలో శేఖర్‌ వంతు మాట్లాడటం వచ్చింది. 'మీరందిన్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు', అనడంతో అందరూ మీరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్త కంఠంతో. 

చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్చిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వున్నాయి. అందరూ తవ్చకుండా రావాలి. నేటినుండే ఆరంభించుకుదాం అని శేఖర్‌ ముగించాడు.

గ్రామస్తులు శేఖర్‌ కిచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్‌ కల నేరవేరింది. గ్రామస్తులలో,  పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్‌ సంతోషించాడు. 

తెలుగు కొటేషన్స్

Post a Comment

Previous Post Next Post

ADS