Funny Moral Stories In Telugu

తెలివైన దొంగ

తెలివైన దొంగ: తెలివి ఒకరి సొత్తు కాదు

ఓ గ్రామంలో ఒక జమీందారు వుండేవాడు. అతడి పేరు రామరాజు అతడి భార్యపేరు రాజమ్మ. రామరాజుకు పెద్ద ఇల్లుంది. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ, చెట్లతోనూ ఎంతో అందంగా వుండేది. అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తూండేవారు.

ఒకరోజు ఒకతను వచ్చి తాను అనాధనని, నా అన్నవారు ఎవరూ లేరని, తనకేదైనా పని ఇప్పించండని తనకి జీత మివ్వకపోయినా పర్వాలేదు, అన్నంపెడితే చాలని రామరాజు, రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు. వారిద్దరూ దయ తలచి పనిలో పెట్టుకున్నారు.

అతడు రామరాజు వద్ద తన పేరు 'చెట్టు' అని, రాజమ్మ వద్ద 'నీరు' అని చెప్పాడు. ఓ రోజు అతను జమిందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. ఆమె పరుగు పరుగున వెళ్ళి భయంగా తన భర్తతో “ఏవండీ! నీరు డబ్బు దొంగిలిస్తున్నా'డండి అని చెప్పింది.

అప్పుడు రామరాజు “నీకేమైనా పిచ్చా.! నీరు డబ్బు దొంగిలించడమేమిటి నీరుకి చేతులున్నాయా? కాళ్లున్నాయా? నీకంతా పిచ్చి కాకపోతే” అని బయటకు నడిచాడు. అప్పుడు.

రాజమ్మ. “అదేనండి... మనింట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగిలించి పారిపోతున్నాడండి వాడ్ని పట్టుకోండి” అని అన్నది. అప్పడు రామరాజు తెల్లబోయి 'ఉరే రంగా. భీముడు..." అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు.

అప్పుడా కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు. అప్పడు రామరాజు కూలీలను “ఆ చెట్టును కాదురా.! డబ్బు దొంగిలించుకుపోతున్న వ్యక్తిని పట్టుకోండిరా..” అనే లోపల ఆ దొంగ తప్పించుకు పారిపోయాడు. "తెలివి ఒకరి సొత్తు కాదు".

తెలుగు కొటేషన్స్

1 Comments

  1. As a general rule, however, never wager more than you can to|you possibly 카지노 사이트 can} afford to lose. As we now have already established, the only approach to get probably the most out of a video poker game is to make use of a mathematically derived strategy. There are quantity of} ways to develop such and so they all depend upon sort of|the sort of} real cash video poker game may be} taking part in} and its corresponding guidelines.

    ReplyDelete
Previous Post Next Post

ADS