Chilipi Prashnalu In Telugu With Answers, చిలిపి ప్రశ్నలు

చిలిపి ప్రశ్నలు

Chilipi Prashnalu in Telugu with Answers

Chilipi Prashnalu, Silly Questions, Logic Questions, Funny Questions in Telugu With Answers To Ask friends, boys, girls. Best funny questions in Telugu, and make fun with your friends and families.

చిలిపి ప్రశ్నలు, జవాబులు

తెలుగు లాజిక్ ప్రశ్నలు, తమాషా ప్రశ్నలు, పజిల్ ప్రశ్నలు, తెలివైన వారికి చిక్కు ప్రశ్న, చిలిపి ప్రశ్నలు కొంటె సమాధానాలు, ఫన్నీ ప్రశ్నలు, పొడుపు ప్రశ్నలు జవాబులు, చిన్న ప్రశ్నలు, తమాషా ప్రశ్నలు వెరైటీ సమాధానాలు, తెలుగు లాజిక్ ప్రశ్నలు, ఫన్నీ ప్రశ్నలు, మెదడుకు మేత ప్రశ్నలు

1) ఆగకుండా 60 నిముషాలు పరిగెత్తితే ఏమౌతుంది ?
జవాబు: గంట అవుతుంది

2) మన టైం బాగుండాలంటే ఎం చేయాలి ?
జవాబు: 'వాచ్' శుభ్రం చేసుకోవాలి 

3) ఫస్ట్ రాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయలి ?
జవాబు: పెన్నుతో

4) వీసా అడగని దేశం ?
జవాబు: సందేశం

5) గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది ఎలా చెప్పగలం ?
జవాబు: నోటితో 

6) డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు ?
జవాబు: ఎవరు చేసారో తెలియకూడదని 

7) కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు ?
జవాబు: గుడికి 

8) అందరు భయపడే బడి ? 
జవాబు: చేతబడి 

9) ఆఫ్రికా గిరిజనులు అరపండు ఎలా తింటారు?
జవాబు: ఒలుచుకొని

10) ఒక ఇంట్లో బోలెడు డబ్బు, నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ లేరు. అయినా అతను ఆ ఇంటిని దోచుకోలేదు ఎందుకు?
జవాబు: అది తన ఇల్లే కాబట్టి

11) మనిషి కాళ్ళు ఎంతపొడవు ఉండాలి?
జవాబు: నేలకు అందేంత

12) కిందకి వస్తుంది కానీ పైకి వెళ్ళదు ఏమిటి ?
జవాబు: వాన  

13) 3 పిల్లులు 3 ఎలుకలను 3 నిమిషాల్లో చంపితే, 100 ఎలుకలను చంపడానికి 100 పిల్లులకు ఎంత సమయం పడుతుంది?
జవాబు: '3 నిముషాలు' 

14) మీరు ఒక రేసులో పరిగెడుతున్నారు, అయితే రేసులో మీరు రెండవ నంబర్ వాడిని దాటారు, అప్పుడు మీరు ఏ స్థానంలోకి వస్తారు?
జవాబు: రెండో స్థానం ( ఎందుకంటే దాటింది రెండో వాడిని మొదటి స్థానం వాడిని కాదు )

15) ప్రపంచాన్ని తక్కువ ధరలో చూడటం ఎలా ?
జవాబు: అట్లాస్ కొనుక్కొని 

16) పశువులు గడ్డెందుకు మేస్తాయి ?
జవాబు: నోరుంది కాబట్టి 

17) చింటూ 8 డేస్ నిద్రపోకుండా ఉన్న ఆరోగ్యంగానే ఉన్నాడు ఎలా ?
జవాబు: రాత్రిపూట పడుకుని

18) ఒక ఖాళీ డబ్బాలో ఎన్నిపెన్నులు పెట్టగలం ?
జవాబు: ఒక్కటే: ఎందుకంటే, ఒక పెన్ను పెట్టగానే అది ఖాళీగా ఉండదుగా 

19) జూ అధికారి నూతన దంపతులను ఎలా ఆశీర్వదిస్తాడు?
జవాబు: "చిలకా గోరింకల్లా " వుండండి

20) జర్నలిస్టుకి దేవుడు ప్రత్యక్షం అయితే.....?
జవాబు: ఇంటర్వ్యూ చేస్తాడు

21) తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!

22) మీ చేతిలో 1 కిలో ఇనుము, మరో చేతిలో 1 కిలో పత్తి ఉంటే, వీటిలో ఏది ఎక్కువ బరువు ఉంటుంది?
జవాబు: రెండూ సమానంగా ఉంటాయి. ( ఎందుకంటే రెండూ 1 కిలో కదా) 

23) ఎవరైనా సినిమా హీరో కావాలంటే ఎం చేయాలి ? 
జవాబు: సినిమా తీసుకోవాలి 

24) చిలక జోశ్యం ఎలా చెబుతుంది ?
జవాబు: ముక్కుతో కార్డు తీసి 

25) మీ జేబులో 10 చాక్లెట్లు ఉన్నాయి, మీరు మీ జేబులో నుండి రెండు చాక్లెట్లు తీసుకున్నారు, అయితే మీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి?
జవాబు: 10, ( ఎందుకంటే తీసుకున్న చాక్లెట్లు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయిగా ) 

26) రాముడు మరియు సీత మధ్యలో ఏముంది?
జవాబు: మరియు 

27) చలికాలంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

28) డ్రైవర్ లేని బస్ ?
జవాబు: సిలబస్

29) రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు. ఎలా ?
జవాబు:రసం తీసి

30) ఒక వ్యక్తి విమానం లోంచి పారాషూట్ లేకుండా కిందికి దూకిన ఏమి కాలేదు ఎలా ?
జవాబు: విమానం ల్యాండ్ అయి ఉంది

31) మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఎక్కడ గుండు కొట్టించుకుంటారు ?
జవాబు: తలమీద

32) దూరపు కొండలు నునువుగా ఎందుకు కనిపిస్తాయి ?
జవాబు: చూస్తాం కాబట్టి 

33) ఒక ఎత్తయిన చెట్టుపై నుండి కోడిపుంజు గుడ్డు పెడితే కింద పడి పగులుతుందా, లేదా ?
జవాబు: కోడిపుంజు గుడ్డు పెట్టదు 

34) దోమ తన పిల్లని సర్కస్ గుడారంలోకి వెళ్ళద్దని చెప్పింది. ఎందుకు?
జవాబు: అందరూ చప్పట్లు కొడతారు కాబట్టి

35) బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది

36) గుడికెళ్ళి బొట్టు దేనికి పెట్టుకుంటారు ?
జవాబు: నుదిటికి 

37) గుర్రానికి ముందు ఏనుగుకి వెనకాల ఉండేది ఏమిటి ?
జవాబు: 'గు' అక్షరం 

Post a Comment

Previous Post Next Post