సింగోటం జాతర 2022: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

singotam temple సింగోటం

Singotam Jatara: 'Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam' - 2022

క్షేత్రపరిచయము:

తెలంగాణ ప్రాంతంలో సింగవట్నం (సింగోటం) రెండవ యాదగిరి గుట్టగా పేరు గాంచినది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు లక్ష్మీదేవి అమ్మవారి సమేతంగా మారుమూల ప్రాంతమైన మహబూబ్‌నగర్‌ జిల్లా (ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా) కొల్లాపూర్ మండలంలో సింగవట్నం గ్రామంలో కొలువుదీరి యున్నారు. 

శ్రీ స్వామి వారిని ఇక్కడి భక్త జనులు 'శ్రీవారు' అని సంబోధిస్తారు. ఈ గ్రామ వాసులకు శ్రీలక్షీనరసింహ్మస్వామి ఆరాధ్యదైవం. ఈ పల్లెవాసులకే కాదు ఈ పరిసర ప్రాంతాల వారందరికి శ్రీవారు ఇల్లువేల్పు. 

స్వామి వారిని దర్శించుకొనడానికి ఈ ప్రాంత వాసులకేకాక ఈ జిల్లా (మహబూబ్‌నగర్‌) నలుమూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్త కోటి తరలి వస్తారు. 

ఇరుగు పొరుగు జిల్లాలైన నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, వనపర్తి, మెదక్‌ మరియు రాయలసీమలోనికర్నూల్ జిల్లాతో పాటు సమీప రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

వీరంతా మరీ ముఖ్యంగాప్రతీ సంవత్సరం జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో తండోప తండాలుగా తరలి వచ్చి ఉత్సవంలో పాల్గొంటారు.  

భక్తులు తమ తమ కోరికలతో ఇక్కడకు వచ్చి వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. అలాగే ఇక్కడకు చేరుకున్న భక్తుల్లో చాలా మంటి తమ తమ మొక్కులో భాగంగా తల నీలాలను సహితం స్వామి వారి సన్నిధిలో సమర్చించుకుంటారు.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు - 2022 సింగోటం

సింగవట్నం (సింగోటం) గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు. తేదీ 15-01-2022 శనివారం నుండి  21-01-2022 శుక్రవారం వరకు.

బ్రహ్మోత్సవముల కార్యక్రమ వివరములు:

* తేదీ: 15-01-2022 (శనివారం)

స్వస్తిశ్రీ ప్లవ నామ సం॥ర పుష్య మాస శుద్ధ త్రయోదశి శనివారం భానోర్మకార రాశి ప్రవేశం ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పర్వదినం. 

* తేదీ: 16-01-2022 (ఆదివారం) - శఖటోత్సవం - పల్లకి సేవ

స్వస్తిశ్రీ ప్లవ నామ సం॥ర పుష్య మాస శుద్ధ చతుర్దశి ఆదివారము పంచాహ్నిక దీక్షా ప్రారంభః ప్రాతఃకాలే అభిషేక మహోత్సవము, బ్రహ్మోత్సవ సంకల్పము, గణపతి పుణ్యాహవాచన, ఋత్విక్‌వరణము, అఖండస్థాపన, నవగ్రహ, వాస్తు, సర్వతోభద్ర, అంకూరారోపణ, ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ అగ్నిపత్రిష్టాపనాది కార్యక్రమములు జరుగును.

సాయంత్రం: మోహినీ అలంకరణ (అశ్వవాహన సేవ)

రాత్రి : 8-00 గంటలకు కళ్యాణమహోత్సవము (గజవాహన సేవ)

* తేదీ: 17-01-2022 (సోమవారం)

ప్రాతఃకాలే  దీక్షాహవనము, లక్ష్మీగణపతి హోమతర్పణం, సతీసమేత ఆదిత్యాది నవగ్రహ, ఆంజనేయ, వాస్తు, సర్వతోభద్ర హవనములు.

రాత్రి : 7-00 గంటలకు ప్రభోత్సవము (సింహవాహన సేవ)

* తేదీ: 18-01-2022 (మంగళవారం) - రథోత్సవము (తేరు)

దీక్షాహవనము, రథాంగ హవనము, లక్ష్మీనరసింహ, గాయిత్రీ హవనము, రుద్రహవనము, సాయంత్రం సుదర్శనసేవ, మహా బలిహరణం.

సింగోటం జాతర

సాయంత్రం 4-00 గంటలకు: రథోత్సవము (తేరు)

* తేదీ: 19-01-2022 (బుధవారం) - తెప్పోత్సవము

స్వామి వారి అభిషేకోత్సవము, నిత్యహోమము, గణపతి నవగ్రహ సర్వతో భద్రహవనములు,

ఉదయం: 10-00 గంటలకు రత్న లక్ష్మీ అమ్మవారి అభిషేకోత్సవము

రాత్రి: 7:00 గంటలకు స్వామి వారి పుష్కరిణిలో

గురుడవాహనసేవ - జంటసేవలు, అనంతరం పారువేట పద్యపఠనం, మంగళహారతి

* తేది: 20-01-2022 (గురువారం)

దీక్షాహవనము, స్వామి మూలమంత్ర హవనము, తీర్ధావళి (శేషవాహనసేవ) బలిహరణం, పూర్ణాహూతి, వసంతోత్సవము, సాయంత్రం (డోలోత్సవము చప్పరపుసేవ) పుష్పోత్సవము, బ్రాహ్మణ మహదాశీర్వచనము, వేదస్వస్తి జరుగను.

* తేది 21-01-2022 (శుక్రవారం)

శ్రీవారి సముద్రములో స్వామి వారి హంసవాహన సేవ సాయంత్రం 6.00 గం॥లకు

తెలుగు కొటేషన్స్

Post a Comment

Previous Post Next Post

ADS