మానవత్వపు దొంగ మరియు క్రూరమైన బాటసారి

మానవత్వపు దొంగ మరియు క్రూరమైన బాటసారి

ఒకసారి ఓ వ్యక్తి అడవిలో ప్రయాణిస్తున్నాడు. దార్లో ముగ్గురు దొంగలు అతడి మీద పడి, అతడి వద్ద వున్నవన్నీ దోచుకున్నారు. దొంగల్లో ఒకతను ఇలా అన్నాడు వీడ్ని ప్రాణాలతో వదిలేయడం మంచిది కాదు. రేపెప్పుడైనా మనల్ని గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగించవచ్చు. అందకే వీడ్ని చంపేస్తే సరిపోతుంది, అని బాటసారిని చాకుతో పొడవబోయాడు.

రెండవ దొంగ అతడి ఆపాడు. మన పని దోచుకోవడమే కానీ చంపడం కాదు. అనవనరంగా వీడ్ని చంపిన పాపం మనకెందుకు? గుర్తుపట్టి ప్రభుత్వానికి అప్పగిస్తారని భయపడి అందర్ని చంపుతూ పోవడమేనా మన పని. 

ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. మనం ఈ అడవి నుండి బయట పడేలోగా వీడు మనల్ని పట్టించుకోకుండా వుంటే చాలు. అందుకని వీడి కాళ్ళు చేతులు కట్టిపడేద్దాం అన్నాడు. మొదటి దొంగ సరేనన్నాడు. ఇద్దరూ కల్సి అతడ్ని కట్టి పడేశారు.

మూడన దొంగకు అది కూడా నచ్చలేదు. మిగిలిన ఇద్దరితో కలిసి వెళ్చినట్టే వెళ్ళి మళ్లి వెనక్కి వచ్చాడు. బాటసారిని చూచి “అయ్యో. నిన్నంతగా హింసించాము. సరే.. నీ కట్లు విప్పేస్తాను. నీ ఇంటికి త్వరగా క్షేమంగా వెళ్లిపోవచ్చు" అని కట్లు విప్పాడు.

అంతటితో ఆగకుండా 'ఈ అడవిలో ఇంకా దోంగలుండవచ్చు. నీ, వద్ద దోచుకునేటిందుకు ఏమీ లేవు ఆ కోపంలో నిన్ను చంపినా చంపవచ్చు. అందుకని జనం తిరిగే రహదారికి వెళ్లినరకూ నేనూ. నీతోనే నస్తాను. పదా, బయల్దేరు అన్నాడు',

బాటసారి దొంగ మంచితనానికి ఆశ్చర్యపోయాడు, ఇద్దరూ కొంతసేపటికి రహదారి చేరుకున్నారు. అప్పడు బాటసారి దొంగతో అన్నాడు. “అయ్యా. మీరెంతో మంచివారిలా గున్నారు. మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని ఇలా పోనివ్వలేను. దయచేసి నా ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్ళండి” అంటూ ప్రాధేయపడి బలవంతంగా తనింటికి తీసుకెళ్ళాడు.

దొంగ పాపం భోజనం చేస్తుండగా బాటసారి వెనకనుండి ఓ దుడ్డు కర్రతో తలమీద గట్టిగా బాదాడు. దొంగ తలసట్టుకుని “అబ్బా” అని క్రిందపడిపోగానే ఇరుగు పొరుగు వారిని కేకేసి దొంగను వారికి అప్పగించాడు బాటసారి.

దానవుల్లో మానవత్వం వున్నట్లే మానవుల్లో కూడా బాటసారి లాంటి దానవులు కూడా వుంటారు.

తెలుగు కొటేషన్స్

Post a Comment

Previous Post Next Post

ADS