Bheemla Nayak Movie Review in Telugu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమ్లా నాయక్ చాలా ఆలస్యం తర్వాత థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భీమ్లా నాయక్ మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి అధికారిక రీమేక్.
Movie: భీమ్లా నాయక్
Run Time: 2గం 25ని
Release Date: 25 ఫిబ్రవరి 2021న విడుదల
Star Cast: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్
Director: సాగర్ కె చంద్ర
Producer: సూర్యదేవర నాగవంశీ
Music: ఎస్ఎస్ థమన్
Screenplay, Dialogues: త్రివిక్రమ్..
భీమ్లా నాయక్ మూవీ రివ్యూ
భీమ్లా నాయక్ Review: భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్. రిటైర్డ్ ఆర్మీ అధికారి అయిన డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి). డానియల్ శేఖర్ ఒక రోజు రాత్రి కారులో మద్యం సీసాలతో అడవిగుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కుతాడు, మద్యం రవాణా చేసినందుకు డానీని దోషిగా గుర్తించి డ్యూటీలో లో ఉన్న భీమ్లా నాయక్ అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు.
ఈ సంఘటన డేనియల్ శేఖర్ అహాన్ని దెబ్బతీస్తుంది. ఇక్కడ నుండి భీమ్లా నాయక్ మరియు డానీ మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. భీమ్లానాయక్‌ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని అనుకుంటాడు. భీమ్లా నాయక్‌పై డానీ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు.? భీమ్లానాయక్ ఉద్యోగం ఎందుకు పోగొట్టుకున్నాడు? ఒకరినొకరు చంపుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఇందులో భీమ్లా నాయక్ భార్య నిత్యా మీనన్ ఎందుకు జోక్యం చేసుకుంటుంది? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (భీమ్లా నాయక్ రివ్యూ)
Bheemla Nayak సినిమా ప్లస్ పాయింట్లు:
పర్ఫెక్ట్ కాస్టింగ్ (రానా, పవన్ కళ్యాణ్), పంచ్ డైలాగులు, Exellent BGM, రానా మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు.