Robert Kiyosaki Quotations In Telugu
Robert Kiyosaki Quotes In Telugu, Robert Kiyosaki is an American businessman and author. He was born on April 8, 1947. Kiyosaki is the founder of Rich Global LLC and Rich Dad Company.
రాబర్ట్ కియోసాకి సూక్తులు
రాబర్ట్ కియోసాకి ఒక అమెరికన్ వ్యాపారవేత్త మరియు రచయిత. ఇతను ఏప్రిల్ 8, 1947 లో జన్మించాడు. కియోసాకి రిచ్ గ్లోబల్ LLC మరియు రిచ్ డాడ్ కంపెనీ స్థాపకుడు.
కియోసాకి 26 కంటే ఎక్కువ పుస్తకాల రచయిత, అంతర్జాతీయ స్వీయ-ప్రచురితమైన వ్యక్తిగత ఆర్థిక 'రిచ్ డాడ్ పూర్ డాడ్' సిరీస్ పుస్తకాలు 51 భాషల్లోకి అనువదించబడ్డాయి, మరియు ప్రపంచవ్యాప్తంగా 41 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి.
Robert Kiyosaki Quotes In Telugu - Images
Robert Kiyosaki Quotes In Telugu - Text
"నేను దీనిని కొనలేను అనకండి". అది పేదవాడి వైఖరి.
"నేను దానిని ఎలా కొనగలను". అని ప్రశ్నించుకోండి.
- రాబర్ట్ కియోసాకి
మన ఖర్చులను తగ్గించుకోవడం కన్నా, మన ఆదాయం పెంచుకోవడం అనేది ముఖ్యం.
అలాగే మన కలల్ని చంపుకోవడం కన్నా, మన ఆత్మస్తైర్యాన్ని పెంచుకోవడం ముఖ్యం.
- రాబర్ట్ కియోసాకి
మీరు ఓటములను వద్దు అనుకుంటే,
విజయాలను కూడా వద్దనుకున్నట్టే.
- రాబర్ట్ కియోసాకి
చిన్నగా మొదలుపెట్టండి. పెద్దగా ఆలోచించండి.
- రాబర్ట్ కియోసాకి
మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆస్తి మన మెదడు.
దానికి సరిగ్గా శిక్షణ ఇస్తే మనం ఊహించనంత సంపదను సృష్టించగలదు.
- రాబర్ట్ కియోసాకి
డబ్బు అనేది నిజంగా కేవలం ఒక ఐడియా మాత్రమే
- రాబర్ట్ కియోసాకి
ధనవంతుడికి పేదవాడికి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా..
వాళ్ళు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అని...
- రాబర్ట్ కియోసాకి
కొన్నిసార్లు మీరు గెలుస్తారు.
కొన్నిసార్లు మీరు నేర్చుకుంటారు.
- రాబర్ట్ కియోసాకి
నైపుణ్యాలు మాత్రమే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి,
సిద్ధాంతాలు కాదు.
- రాబర్ట్ కియోసాకి
ధనవంతులు వాళ్ళ డబ్బును ముందు పెట్టుబడి పెడతారు.
మిగిలింది ఖర్చు చేస్తారు.
కానీ, పేదవాళ్ళు ముందు ఖర్చు పెడతారు.
మిగిలింది పెట్టుబడి పెడతారు.
- రాబర్ట్ కియోసాకి
ప్రతి సమస్య లోపల ఒక అవకాశం ఉంది.
- రాబర్ట్ కియోసాకి
కొన్నిసార్లు, మీ జీవిత ప్రారంభంలో మీకు సరైనదిగా అనిపించింది, మీ జీవితం చివరలో మీకు సరైనదిగా అనిపించకపోవచ్చు.
- రాబర్ట్ కియోసాకి
Tags:
Great People