Singotam Village, Sri Lakshmi Narasimha Swamy Temple History

Singotam Village, Sri Lakshmi Narasimha Swamy Temple History

History of Sri Lakshmi Narasimha Swamy Temple, Singavatnam (Singotam Village)

శ్లో || హరిహర రూపం, త్రిలోకేశం భక్తానాం ఆర్తినాశకం |

త్రిపుండ్రోర్ధ్వ పుండ్ర ధరం దేవం తం నమామి నృసింహేశ॥

పృథ్వింతర స్థితో దేవో సాలగ్రామ విగ్రహో   ప్రబో|

హలధాటిన్ బహిష్కృ తో  దేవో తం నమామి నృసింహకం

సింగవట్న శ్రీ  లక్ష్మి నరసింహ్మ స్వామి  వారి ఆలయ చరిత్ర

Singotam Temple History In Telugu

సింగవట్న గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఎంతో ప్రాశస్త్యమైన చరిత్ర ఉన్నది. రమారమి ఇప్పటికి ఒక వెయ్యేళ్ళ క్రితం సురభి వంశస్థులు జటప్రోలు సంస్థానాన్ని ఎలుతున్న రోజులవి అప్పటి జటప్రోలు సంస్థానాదీశుడు రాజ సింగమనాయుడు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని శాసన చరిత్ర చెబుతోంది. సింగమనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి దైవాజ్ఞయే ప్రభల కారణమని స్థల చరిత్ర ద్వార అవగతమవుతున్నది.

            సింగవట్న గ్రామాన స్వామి వారు వెలసిన తీరు ఒక అద్భుత ఘట్టం ఇప్పటికిది సుమారు గడిచిన వెయ్యేళ్ళ క్రితం మాట ఆనాడు గ్రామానికి చెందిన ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో నాగలితో సాగు చేస్తుండగ ఆయనకు పొలంలో తరచు ఒక శిల అడ్డు తగులుతు ఇబ్బంది కలిగించేది. ఈ విదామైన ఆటంకం ఆ రైతుకు చాల ఏళ్ళే కోనసాగింది. తన స్వామియేనని ఆ రైతు గుర్తించ లేక పొయ్యాడు. పైగ అతను ఆ శిల గురించి అంత పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఎదో ఒక విధంగా తన పని తాను పూర్తి గావించుకొంటు కాలం గడుపుతున్నాడు. 

ఈ క్రమంలో శిల రూపంలో ఉన్న తనను ఇక రైతు గుర్తించడని భావించిన స్వామి వారు నాటి ప్రభువైన రాజ  సింగమనాయుడికి మరియు బ్రాహ్మణ అగ్రహర పెద్దయిన ఓరుగంటి నర్సయ్య దీక్షితులు గారికి ఒకే సమయంలో లీల మాత్రముగా స్వప్న దర్శనం ప్రసాదించి తను శిల రూపంలో ఉన్న చోటును తెలిపి, ఆ రైతు తనను గుర్తించక పోవాటాన్ని వివరించి తనను వెంటనే అక్కడి నుండి వెలికి తీసి తనకు ఆలయం నిర్మించమని చెప్పి స్వామి వారు అంతర్థానమైనారు. వెంటనే కల చెదిరి నిద్ర నుండి మెలుకోన్న రాజు అప్పటికప్పుడు తన సైన్యంతో బయలుదేరి కాగడాల సాయంతో వెతికించి ఆ రైతు వ్యవసాయ క్షేత్రంలో శిలా రూపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ్మ స్వామి వారిని గుర్తించి అక్కడి నుండి వెంటనే వెలికి తీయించాడు. పిమ్మట రాజు వేగిరంగా గుడిని నిర్మించి ఓరు గంటి వంశస్థులైన బ్రహ్మణులచే అందు స్వామి వారిని ప్రతిష్టింప చేయించారు. ఆ సమయంలో స్వామి వారికి ఒక చిన్న గుడిని కూడా నిర్మించారు. 

ఆ నాటి గుడి నేటికి స్వామి వారి గర్భగుడిలో ఉన్నది. అనంతర కాలాన రాణి రత్నమాంబ కాలంలో స్వామి వారి ఆలయ నిర్మాణ పూర్తి స్థాయిలో పరిపూర్ణం గావించబడింది. సింగవట్నం శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వారిని శ్రీ వారు అని మనసార సంబోదించడం ఆనందపారవశ్యంతో మనసులను పులకింప చేస్తుంది. స్వామి ఆలయం చెంతనే మనోహరమైన కోనేరు కలదు.

singotam Koneru (gundam)

దీనిని శ్రీ వారి కోనేరు అని పిలుస్తారు. సమీపంలోనే ఒక పెద్ద తటాకం కూడ ఉన్నది. దీనిని శ్రీ వారి మహా సముద్రంగా వ్యవహరిస్తారు.

 శ్రీ స్వామి వారి ఆలయానికి సుమారు ఒక కి॥మీ॥ దూరంలో గల గుట్టపై లక్ష్మి దేవి అమ్మవారు కొలువైవున్నారు. అమ్మవారు వెలసిన ఈ గుట్టను రత్న లక్ష్మీ దేవి గుట్ట అని పిలుస్తారు.

Singotam gutta

Singotam gutta

అ గుట్ట రత్నగిరి అన్న పేరుతో లెస్సగా వాసికెక్కింది. సింగవట్నం వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించిన పిదప విధిగా అమ్మవారిని దర్శించుకోని వెళతారు.

Singotam shiva templa

ఇక్కడ శివ కేశవులకు బేదం లేదు. అందుకసరుగా ఆలయంలో శివలింగం, ఆంజనేయ స్వామి మరియు వినాయక స్వామి వార్ల విగ్రహాలు ప్రతిష్టింపబడి వున్నవి.

Singotam cheruvu

Singotam cheruvu

Singotam cheruvu

Singotam jatara


Singotam jatara

Singotam Temple

Post a Comment

Previous Post Next Post

ADS

ADS