500+ Sukthulu In Telugu, తెలుగు సూక్తులు

Sukthulu In Telugu, తెలుగు సూక్తులు

Telugu Sukthulu, Best Sukthulu, Manchi Matalu In Telugu

Sukthulu In Telugu, Small Sukthulu In Telugu, Manchi Matalu And Neethi Sukthulu In Telugu. Real Life, Motivational, Inspirational Telugu Sukthulu. True Words, Great People Sayings In Telugu Text. Best 500+ Telugu Sukthulu.

తెలుగు సూక్తులు, నీతి వాక్యాలు

సూక్తులు మంచి మాటలు తెలుగులో, 500 కు పైగా తెలుగు నీతి సూక్తులు. తెలుగు సూక్తులు టెక్స్ట్. మంచి సూక్తులు, నీతి వాక్యాలు, విద్యార్థుల కోసం నీతి సూక్తులు తెలుగులో, స్పూర్తినిచ్చే మాటలు, తెలుగు గొప్ప మాటలు, తెలుగు నీతి వాక్యాలు.

ఇమేజెస్ ( Images ) కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి 👉 Telugu Sukthulu Best Images

Sukthulu In Telugu


చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది

విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే... గమ్యం కాదు

మనిషికి అసలైన సిరిసంపదలు... సంతోషం, తృప్తి

విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాలు

మండిన కొవ్వొత్తి లాగే... గడిచిన కాలమూ తిరిగిరాదు.

ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు 

మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ.. ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేం

గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి.. ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి

ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పు గుర్తు చేసుకో.. ఇక ఎప్పటికీ ఆ తప్పు పునరావృతం కాదు

గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు. అవి లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు

కింద పడ్డానని ఆగిపోకు.. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే

ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించు

నీ కోసం.. చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా.. కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న

ముఖం మీద చిరునవ్వు లేకపోతే, అందమైన దుస్తులు వేసుకున్నా.. ముస్తాబు పూర్తి కానట్లే

హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే.. హృదయాన్నే అనుసరించండి

విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు

కోపం మాటల్లో ఉండాలి. మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు. మనసులోనూ ఉండాలి

కుటుంబం కోసం త్యాగం చేసే వాడు ఉన్నతుడైతే, దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడవుతాడు

ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే!

మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా.. అది గెలుపే అవుతుంది

ఆత్మవిశ్వాసం మనిషికి అసలైన ఆభరణం

హార్డ్ వర్క్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు

మీరు కష్టపడనంతవరకు కలలు సాధ్యం కావు

సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు 

బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుందంతే.

గమ్యాన్ని చేరడానికి రెండు మార్గాలు ఒకటి స్వశక్తి రెండోది పట్టుదల

ఓటమి గురించి భయపడటం మొదలుపెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే

గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, అనందంగా జీవించడం   

నీతులు బోధించడం కాదు ఆచరించి చూపాలి

అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికి నిలబడవు 

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలితమైనదే, కృషితో తో మనం సంపాదించుకునేదే శాశ్వతం 

అందం ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది 

నీ ఏడుపు విని అమ్మ ఆనందించే క్షణం ఏదైనా ఉందంటే...  అది నువ్వు పుట్టిన క్షణం మాత్రమే 

పని చేసిన ప్రతిసారి సత్పలితాలు రాకపోవచ్చు, కానీ అస్సలు  ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు

మనుషుల్ని గాయపరచడం ఎంత తప్పో, మనసుల్ని గాయపరచడమూ అంతే తప్పు

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు

నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు.. ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు

భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం, వివేకంతో మాత్రమే అది సాధ్యం

గొప్ప పనులు చెయ్యడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడమే

ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్యపుస్తకం

మనిషి తన చేతలతోనే గొప్పవాడు అవుతాడుగానీ జన్మతః కాదు

మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది

అదృష్టం కావాలంటే ఎదురుచూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి

విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు.. నిన్ను నువ్వు గెలవడం

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి...

చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం

ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలోఆత్మీయత ఉంటుంది

చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు

ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు

ప్రయత్నం చేసి ఓడిపో  కానీ ప్రయత్నం చెయ్యడంలో ఓడిపోవద్దు 

సమస్యలు లేకుండా చెయ్యమని ప్రార్థించడం కన్నా  వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడగడం మిన్న 

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం, ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది

శ్రమించడం అలవాటు చేసుకుంటే గెలవడం అలవాటవుతుంది 

చెడ్డ వారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది

ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు పోరాడు, ఓటమి నీ కాళ్ళ దగ్గరా గెలుపు నీ కాళ్ళ ముందర నిలిచిపోతాయి. 

కాలం కంటే విలువైనది ఏదీ లేదు, దాని దుర్వినియోగం చెయ్యకూడదు

ధైరం లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేము 

విద్య అంటే మనలో సమాచారం నింపేది కాదు, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేది 

మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి 

కోరికలు మితంగా ఉంటే, బాధలూ తక్కువగానే ఉంటాయి  

ఓడిపోతామేమోనన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది 

సత్యం భగవంతుడి కన్నా గొప్పది

గొప్పతనం సంపద వాళ్ళ రాదు మంచి ప్రవర్తనతో వస్తుంది 

ఉన్నదాంతో తృప్తి పడడమే గొప్ప సంపద

నేర్చుకునేందుకు వయస్సు అడ్డు కాదు 

శ్రమించేవారికి మంచే జరుగుతుంది 

మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి 

ఒంటరిగా కన్నా కలసికట్టుగా గొప్ప పనులు సాధించవచ్చు  

అశాంతి, ఆందోళనతో విందు ఆరగించే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టెముక్క తినడం మేలు  

ఆలోచనలతో మార్పు రాదు ఆచరణ మొదలు పెట్టినప్పుడే అది సాధ్యం అవుతుంది

చెడు అలవాట్లు క్రమంగా తగ్గించుకుంటే కొంతకాలానికి చెడ్డవాడైనా మంచి వాడిగా మారాల్సిందే 

ప్రతిభ ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది

పుస్తకాలకన్నా అనుభవ జ్ఞానమే గొప్పది

జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం చేయడమే అది లేని జీవితం ఉండదు

తెలిసిన వ్యక్తి ప్రతి విషయాన్నీ తెలుసు కోవాలనుకుంటాడు  

నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృథా చేయవద్దు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే

మీ కలలను చెప్పవద్దు చేసి చూపించండి

విజయవంతమైన ప్రయాణంలో పోరాటం ఒక భాగం

కన్నీటి చుక్క కారిస్తే కాదు.. చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు

గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు

లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే.. నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది

ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే

ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ.. మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను, శత్రువులను  సంపాదించి పెడుతుంది

మనకు ఒకరు సేవ చేసేకంటే.. మనం ఇతరులకు సేవ చేయడమే ఉన్నతమైంది

కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు, అయితే ఎప్పుడో కానీ సరైన కారణం ఉండదు

మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు

చేసిన తప్పులు ఎప్పటికైనా బయట పడతాయి  

కాలమే అన్ని గాయాలకీ మందు 

కష్టపడే వారికి తప్పకుండా ఫలితం వష్తుంది 

వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకొనే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు 

మనకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మనం వృథా చేసిన కాలమే 

ఎవరి తప్పులు వారు తెలుసుకోవడంలో తప్పులేదు 

తప్పులు చేస్తున్న వాళ్ళు తమనెవరు గమనించడం లేదనుకుంటారు

నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి అప్పుని తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగలనిచ్చినా మళ్ళీ వృద్ధి చెందుతాయి 

ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం పొందబోతున్నావన్న మాటే, అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది.

మనం ఆనందంగా ఉండటానికి అత్యంత సులువైన మార్గం ఇతరుల్ని ఆనందంగా జీవించేలా చేయడమే  

వ్యర్థమైన మాటలు వెయ్యి చెప్పడం కన్నా శాంతిని ప్రసాదించే ఒక మంచి వచనం చాలు 

మర్యాద ఇవ్వడం వలన ఎవరూ ఏమీ నష్టపోరు

అత్యాశ లేని వారు అసంతృప్తికి గురికారు 

చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు

మంచితనమే హుందాతనానికి నిదర్శనం  

గొప్ప విజయాలు సాధించాలంటే శ్రమ కూడా ఎక్కువే చేయాలి

నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు,  నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు 

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. 

కోపం చేతల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. 

ఓటమి ఎన్నో విషయాల్ని నేర్పుతుంది. 

పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు శత్రువులూ లేరు. మన మాట, మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం. 

తమకు తాము గొప్ప అనుకునే వారు అభివృద్ధి చెందలేరు

గెలవాలంటే అన్ని సవాళ్ళనూ ఎదుర్కోవాలి, ఇష్టమైన వాటిని మాత్రమే ఎదుర్కోవాలంటే కుదరదు 

మన జీవితమే మనకు ఉపాద్యాయుడు అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది 

బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు 

చదువుకి క్రమశిక్షణ తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుంటుంది  

చెడు మార్గంలో వచ్చిన సంపాదన వలన మాంచితనం దూరమవుతుంది 

చేసిన పొరపాటుకు చింతించే బదులు మళ్లి చేయకుండా జాగ్రత్త  పడటం ఉత్తమం.

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది

నువ్వు నిద్ర లేచినా  లేవకపోయినా సూర్యోదం మాత్రం ఖాయం  

ఈరోజు చెయ్యాల్సిన పని రేపటికి వాయిదా వేసేవారు లక్షాన్ని సులభంగా సాధించలేరు

విజయమే జీవితం కాదు ఓడిపోవడమంటే అన్ని కోల్పోవడమూ  కాదు గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం 

గమ్యాన్ని చేరేందుకు చాల దారులుంటాయి సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు 

ఉన్నత లక్షాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే 

విద్య నీడ లాంటిది దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి

అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు అందరికీ సమానమే 

నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు 

గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు

మంచి స్వభావమే మనిషికి అలంకారం 

మీరు గెలిచినంత వరకు మీ కథను ఎవరూ పట్టించుకోరు

తరువాత బాధపడటం కంటే ఇప్పుడే ప్రయత్నించడం మంచిది

ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం  వేసుకుంటాం గానీ వీధంతా తివాచీ పరచం కదా. 

కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇవ్వవు

లోపాలు లేని వ్యక్తులంటూ ఉండరు

నీ గొప్పతనాన్ని నోటితో చెప్పి చులకన కావద్దు. చేతులతో చూపి మన్నన పొందు

ఒక పురుషుడు చదువుకుంటే అతడు మాత్రమే చదువుకుంటాడు ఒక మహిళ చదువుకుంటే ఒక తరం మొత్తం చదువుకుంటుంది

ఇతరులు సాధ్యం కాదన్న దాన్ని చేయగలిగిన సందర్భమే నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం 

మన పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు లాయరులా వాదిస్తాం. ఎదుటివారి పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు జడ్జీలా తీర్పు చెబుతాం 

అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు

ఏ పని అంత తేలిక కాదు కానీ అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా ఎంతో కష్టమనిపిస్తుంది 

వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు, అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావలి 

కార్య సాధకుని కల నిద్రలో వచ్చేది కాదు నెరవేరేదాకా నిద్ర పట్టకుండా చేసేది 

మూర్ఖులతో వాదన దుష్టులతో స్నేహం దొంగలతో పరిచయం అసమర్థులతో వ్యాపారం నచ్చని వ్యక్తితో వివాహం చేయకూడని పనులు 

ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కుర్చున్నంత మాత్రాన కాకి గరుడపక్షి కాలేదు 

ఓటమి ఎరుగని వ్యక్తి అనిపించుకోవడం కన్నా విలువలను వదులుకొని వ్యక్తి అనిపించుకోవడం మేలు

అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.

ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగాల అపాయాన్ని కూడా అంచనా వేయాలి 

మనల్ని తీర్చి దిద్దేది మన ఆలోచనలే 

పనులు అత్యుత్యమంగ జరగాలంటే ఎవరికీ వారే చేసుకోవాలి

ఎదుటివారిని సంతోషపెట్టే ప్రయత్నంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది 

మంచి అలవాట్లు మానడం చాల సులువు చెడు అలవాట్లు మనడమే మహాకష్టం

విలువలతో బతికినవారే జీవితంలో అసలైన విజేతలు 

అబద్దాలు చెప్పేవాడు నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు

మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు 

గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం సొంతమవుతుంది  

ఒక అబద్దం వలన మరిన్ని అబద్దాలు మాట్లాడాల్సి వస్తుంది

అశ్రద్ధ ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది 

ఇతరుల దుఃఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు 

మాటల్ని బట్టి కాదు,  పనిని చూసి మనుషులను అంచనా వేయాలి 

అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ 

మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు 

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా చేసేయగలం

బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ, కాలేజీలో చేరిన తరువాత తెలిసింది స్కూల్ విలువ, ఉద్యోగానికి వెళ్లిన తరువాత తెలిసింది చదువు విలువ, పదవీ  విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ, మరణానికి దగ్గరవుతున్నపుడు తెలిసింది జీవితం విలువ, ఏదైనా మన చేతిలో ఉన్నపుడు తెలియదు దాని అసలు విలువ.

ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు అది ఒక అడుగు మాత్రమే కానీ గమ్యం కాదు

గొప్పదనం అనేది చెప్పే మాటలతో రాదు చేసే పనుల నుంచి వస్తుంది

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది  

ఏ పొరపాటు చెయ్యట్లేదంటే కొత్తగా ఏది ప్రయత్నించట్లేదన్నమాట 

తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది కానీ ఆకలి బాధను అజ్ఞాన బాధను ఎవరికీ వారే తగ్గించుకోవాలి 

నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వెంటో తెలుస్తుంది, ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది

అవివేకమంటే ఈసారి ఫలితం మరోలా ఉంటుందనే ఆశతో చేసిన తప్పునే మళ్ళీ  మళ్ళీ చేస్తుండటం 

తెలివిపరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ గురువులతోనూ యజమానితోనూ మనకు ప్రియమైనవారితోనూ వాగ్వాదానికి దిగకూడదు

మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేథస్సు కాదు హృదయం 

కంప్యూటర్లు మనిషిలాగా ఆలోచిస్తే వచ్చే  ప్రమాదమేమీ లేదు మనిషి కంప్యూటరులాగా ఆలోచిస్తేనే ప్రమాదం 

మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయం సాధించలేరు

ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి 

సంతృప్తి ని మించిన సంపద ఉండదు

తనను తాను జయించుకున్న వ్యక్తి అన్నిటినీ జయిస్తాడు

ఎవరు అన్ని వేళలా తెలివిగా ఉండరు 

సమయం అదా చేసినవాడు అన్ని అదా చేసినట్టే 

మంచి పనులు అలవాటు కావాలంటే తరచూ చేస్తుండాలి 

కఠోరమైన శ్రమ చేస్తూ పట్టుదలతో ముందుకెళితేనే అనుకున్నది సాధించగలం 

వ్యక్తి విలువ పెరిగేది మంచి పనులతోనే కానీ వయస్సు తో కాదు 

అప్పు లేకపోతే ముప్పు లేనట్టే 

నిజం చెబితే ఎప్పుడూ భయపడాల్సిన పని ఉండదు 

చదవడం తెలిస్తే ప్రతి వ్యక్తి ఓ పుస్తకమే 

అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, సుగుణం హృదయాన్ని మెప్పిస్తుంది 

కోరికలు తక్కువున్నవాడే నిజమైన ధనవంతుడు

పుస్తకాలలో ఉన్న జ్ఞానం, ఇతరుల దగ్గర దాచిన డబ్బు ఈ రెండు అవసరానికి ఉపయోగపడవు. 

ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఏ దారిన వెళ్లినా ఒక్కటే.

బడిలో పాఠం బతుకుతెరువు చూపుతుంది, జీవిత పాఠం బతకడం నేర్పుతుంది  

ఇష్టంగా  చేసే పని సులువుగా ఉంటుంది 

మంచితనమే పెట్టుబడి ఎప్పటికి లాభాలనే పంచుతుంది 

తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే ఆ పశ్చాత్తాపానికి విలువేముంది 

ఆగ్రహం వివేకశూన్యతతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది

ఉన్నతమైన ఆలోచనలే గొప్ప వారిగా తయారుచేస్తాయి 

తప్పు ఎన్నటికీ ఒప్పు కాదు 

పేదరికం కష్టతరమైనదే కానీ అప్పు అంతకన్నా భయంకరమైనది 

తొందరపాటుతో ఇతరులపై అభాండాలు వేయకూడదు 

ఇతరుల గెలుపుని చూసి అసూయ పడనివారే అందరి కంటే ఆనందంగా జీవిస్తారు 

అగ్రగామిగా  నిలవాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి 

అస్సలు లేకపోవడం కంటే కొంతైనా ఉండటం నయం

ఆశయం లేని జీవితం దీపం లేని ఇళ్లు వంటిది 

ఆదర్శవంతమైన జీవితానికి ఉత్తమ గ్రంథాలు ఉత్తమ మిత్రులు ఎంతో అవసరం

ఏ పనైనా ప్రేమతో చేసి చుడండి అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది

జీవితంలో బాధపడవలసిన విషయం ఏది లేదు దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం 

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది 

కాలాన్ని వృథా చేయవద్దు ఆ తరువాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది 

తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే అడగకపోతే ఆ అజ్ఞానం జీవితాంతం మనలోనే ఉండిపోతుంది 

జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది 

జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం గానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే 

జీవితం అంటేనే పోరాటం అది ఎప్పుడు ధర్మం వైపునే ఉండాలి 

జీవితానికి కొలమానం డబ్బుకాదు సంతృప్తి సంతోషం 

మన జీవిత లక్ష్యం ఆనందం కాదు దానికి తగిన అర్హత సంపాదించుకోవడం 

శ్రమలో ఉన్న ఆనందాన్ని గుర్తించిన వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు 

బంగారంలో ప్రతి సన్నని తీగకూ విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణమూ విలువైనదే 

జీవితం నిరాడంబరంగా లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి 

జీవితంలో ఆనందం సంతృప్తి విజయం అనేవి మనం ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి

ఎదో ఒక పనిలో నిరంతరం నిమగ్నమైన వారి జీవితంలో కన్నీళ్ళకు చోటులేదు 

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు 

జీవితాన్ని సులభతరం చేసేది సంతోషమే 

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య 

మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతోకొంత నేర్చుకో గలిగితే మన జీవితం ధన్యమే 

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్నే నాశనం చేస్తుంది

మన జీవితాన్ని ఎదుటివారి జీవితంతో పోల్చుకుంటే మిగిలేది అశాంతే 

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది

ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది 

వివేకవంతులు గ్రంథాలతో పాటు జీవితాన్నీ అధ్యయనం చేస్తారు 

మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో

ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయానికి దారులు

అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి

సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లూ వాటంతటవే వస్తాయి.

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు, మీ అభివృద్ధికి అవే ఆటంకాలు

విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు

ఆనందం వస్తువుల్లో లేదు, అది మనసులో ఉంది

శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే

సమస్యకు పరిష్కారం, ప్రశ్నకు సమాధానం, దుఃఖం తర్వాత సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం కచ్చితంగా ఉంటుంది

మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే.. విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి.

నీ పని నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇతరుల పని ఇంకా కష్టంగా ఉంటుంది అని నీకు తెలియనప్పుడు!

మనసు ఆనందంగా ఉంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది

సూర్యుణ్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది

ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడుమనకు మనమే మార్గదర్శకులుగా మారతాం

సంకల్పబలం ఉన్నవారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోగలరు.

నాణేలు శబ్దం చేస్తాయి. కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి.

ఇతరుల మెదళ్లనూ పనిచేయించ గలవాడే నిజమైన మేధావి

శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే

మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం

పొగిడితే మందహాసం చేసి..తిడితే మౌనం వహించేవాడే ఉత్తముడు

పదే పదే ప్రార్థించడం కన్నా.. పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు.

పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది

పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి

మందలో ఒకరిలా ఉండకు.. వందలో ఒకరిలా ఉండేందుకు ప్రయత్నించు

కొన్ని సమయాల్లో మౌనమే మేలు

కార్య సాధకులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ఆచరణలోకి దిగుతారు 

జీవితాన్ని సంపదతో కొలిచేవారు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు  

జారవిడుచుకున్న అవకాశం  రాకపోవచ్చు

మీరు ఇప్పుడు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు కోసం

మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇప్పుడే  కష్టపడాలి

మంచి ఫలితాలు ఉచితంగా రావు

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికి ఆనందంగా ఉండలేడు

పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు ప్రతి మొక్కా మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి

జీవితంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అందుకు మన ప్రయత్నమే ముఖ్యం

మనకు ఒక్క సమస్యా లేదంటే మనం జీవితంలో ఎప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్థం 

ఎదురుదెబ్బ తగిలినప్పుడు నిరాశ పడకూడదు జీవితం మనకేదో నేర్పేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించాలి

జీవితం అంటేనే మనల్ని మనం నిర్మించుకోవడం అది ఎలాగన్నది మన చేతుల్లోనే ఉంటుంది

తమలోని చెడ్డ లక్షణాలతో పోరాడి గెలిచేవారు జీవితంలో ఎప్పటికి విజేతలే 

జీవితంలో అవకాశం ఒక్కసారే రాదు చేజారిన అవకాశం గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది

జీవితం నీకు విజయాలనందించదు అవకాశాలనిస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది

ఆశను ఎప్పుడూ వదలకు జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే

ఆత్మవిశ్వసం నిగ్రహం జ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి 

జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది 

అసలు పనిచేయకుండా బద్ధకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు

ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు

అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు

ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి.

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు

ఇతరుల మెదళ్లనూ పనిచేయించగలవాడే మేధావి

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు

మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీని వల్ల ఫలితమేంటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలుపెట్టొద్ధు...

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి, సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి

మీరు చేసిన పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి

దూరపు కొండలు నునుపు 

చిరునవ్వును  మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు 

అపజయాలు తప్పులు కావు ...  అవి భవిష్యత్తుకి పాఠాలు  

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు  ప్రయత్నించనిదే విజయము దక్కదు

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు 

మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు

జీవితంలో ప్రతిరోజూ  క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది  

డబ్బు లేని వాడు కాదు పేదవాడు జీవితంలో ఒక ఆశయం అంటూ  లేనివాడే నిజమైన పేదవాడు 

చెడు వార్త త్వరగా వ్యాపిస్తుంది 

ప్రతి మనిషికి ఒక లక్ష్యమంటూ ఉండాలి అది లేకపోతే జీవితం వ్యర్థం

మనసుంటే మార్గం ఉంటుంది  

అవసరమైతేనే మాట్లాడు.. లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు

నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.

భయం నీకు చేరువవుతుంటే, దానిపై యుద్ధం ప్రకటించు

దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు.

ఒక అమ్మ.. వందమంది ఉపాధ్యాయులతో సమానం

అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు

మానవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది పుస్తకమే

తన తప్పునకు ప్రతివారూ పెట్టుకొనే అందమైన పేరు.. అనుభవం.

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుకా ఓ అవకాశం దాగి ఉంటుంది

ఇతరుల్ని ఓడించడం సులువే కానీ వారి మనసులను గెలవడం కష్టం

నీది కాదని తెలిసిన దాన్ని కూడా నీదనుకోవడం నిజంగా నేరం

చదవదగిన గ్రంథమెప్పుడూ కొనదగిందే

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం

అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. కానీ మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది

స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి

తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు

మంచి దేశాన్ని నిర్మించాలంటే, ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి

శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం.

ఎదుటి వారిపై అసూయ పడుతున్నామంటే అది మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి

దృఢమైన మనసున్న వారికి అంధకారంలోనూ కాంతిరేఖ కనిపిస్తుంది

ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డు లేని పడవలాంటి వాడు

దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసును ఎవరూ పాడు చేయలేరు

ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు

అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది

విజయం.. మేధావిని వినయవంతుణ్ని చేస్తుంది, అవివేకిని అహంభావిగా మారుస్తుంది

వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాదిగా మారాలి

మంచి పనులకు పునాది క్రమశిక్షణే, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది

చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి. అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి

జీవితంలో విజయం సాదించడమనేది సంపాదించినా డబ్బుని బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి 

జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు 

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే... మనలోనూ అది పెరుగుతుంది

కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతం అవుతుంది

ప్రవర్తన అనేది తెల్లకాగితం లాంటిది.. ఒక్కసారి దాని మీద మరక పడితే, మళ్లీ తెలుపు కావడం కష్టం

ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం

ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు

చరిత్ర చదవడమే కాదు.. సృష్టించాలి

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం.. కృషితో మనం సంపాదించుకొనేదే శాశ్వతం

విజ్ఞానమనేది చెప్పే సమాధానంలోనే కాదు...అడిగే పశ్నలోనూ ఉంటుంది

వినడంలో మనిషి తొందర పడాలి. మాట్లాడటంలో కాదు.

మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్ధు. ఎందుకంటే మీరు రెండోసారి ఓడిపోవచ్చు.

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు

ఇతరులపై గెలిచినవాడు బలవంతుడు. తనను తాను గెలిచిన వాడు శక్తిమంతుడు

వేరేవారి తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు.

ఉత్సాహంతో శ్రమించాలి. అలసటను ఆనందంగా అనుభవించాలి

అందరూ గొప్పసేవలు చేయలేకపోవచ్ఛు కానీ చేసేది చిన్న సేవే అయినా గొప్పగా ఉండాలి

 ప్రపంచం మారాలని  కోరుకోవడం కాదు.. ముందు మనం మారాలి

తల్లి మేలు కోరని చెడ్డ కుమారుడు ఉండవచ్చు. కానీ కుమారుడి మేలు కోరని చెడ్డ తల్లి ఉండదు

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు

ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారిపోక తప్పదు

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు

ఓర్పు లేని మనిషి. నూనె లేని  దీపంలాంటి వాడు

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ కనబరచాలి

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు. మీ అభివృద్ధికి అవే ఆటంకాలు

ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు, దాన్ని జయించిన వాడు

తక్కువ సంపాదించే వారి కన్నా.. తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి

అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు..ఒక్క నిజాన్ని తప్ప

ఇతరుల దు:ఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు

పదునైన ఆయుధం కంటే క్షణ కాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం

ఎంత ఎక్కువకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం

కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి.

అన్నదానం ఆకలిని తీరిస్తే.. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి

అందం అనేది నడవడికలో ఉంటుంది.. ఆడంబరాల్లో కాదు

మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు

మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ అదుపులో ఉంచుకొని మాట్లాడు

కొద్దిపాటి నిర్లక్ష్యమే కొండంత సమస్యకు దారి తీస్తుంది

ఘన విజయాలు సాధించడానికి అంకిత భావంతో పనిచేయండి

మనిషి ఎంత గొప్పవాడైతే..అంత కఠినమైన పరీక్షలు దాటాల్సి ఉంటుంది

నీ విజయాన్ని అడ్డుకునేది వేరెవరో కాదు.. నీలోని ప్రతికూల ఆలోచనలే

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి

మూర్ఖుడి చేతిలో పుస్తకం.. అంధుడి చేతిలో అద్దం లాంటిది.

గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి

వేలాది వ్యర్థమైన మాటల కన్నా... శాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే  

మనస్ఫూర్తిగా పనిచేయనివారు.. జీవితంలో విజయాన్ని సాధించలేరు

మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే

గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది

మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది

మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు.

కోరికలు మితంగా ఉంటే.. బాధలూ పరిమితంగానే ఉంటాయి

శాంతంగా ఉండే వారి మనసు స్వర్గంలాంటిది

భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి

ప్రతి మనిషికీ మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి ఉండదు

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయం దక్కదు

మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి

వినడానికి కటువుగా ఉన్నా.. మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి

ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్లదు  

మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే!

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతారు

ఆశ, ధైర్యం ఎప్పటికీ కోల్పోవద్దు, మీ ముందున్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే విజయం మిమ్మల్ని వరిస్తుంది  

పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ... మనం అవకాశాలను సృష్టించుకోవాలి

సాయం చేస్తే మరిచిపో.. సాయం పొందితే గుర్తుంచుకో

కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు

మొదటి విజయం సాధించిన తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. రెండో ప్రయత్నంలో ఓడిపోతే.. నీ గెలుపు గాలివాటంగా వచ్చిందనుకుంటారు.

విజయం అంటే.. నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడం!

స్తుతించే వారి కంటే.. కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా మంచిని పొందగలం.

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు

మండిన కొవ్వొత్తి మనది కానట్లే... గడచిన కాలమూ తిరిగిరాదు

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు..హృదయంలో ఉంటుంది.

ప్రయత్నం చేసి ఓడిపో..  కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు

బయట కనిపించే మురికి గుంతల కన్నా.. మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం

పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మనిషి మంచిదనం మాత్రం నాలుగుదిక్కులకూ వ్యాపిస్తుంది.

మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే!

జీవితంలో... ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో.. కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో.. ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనకా ఓ అవకాశం దాగి ఉంటుంది.

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న

నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే.. శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు.

నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం

నువ్వు రోజూ అబద్ధం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది

మనస్ఫూర్తిగా పనిచేయలేనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.

నీవు సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే... నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి

మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది, అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి

ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి

విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది.

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది.

ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో..  దానికి నువ్వే నాంది పలకాలి

ఒప్పుకొనే ధైర్యముంటే, తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే

అపజయాలను ఖాతరు చేయకండి. వెయ్యిసార్లు విఫలమైనా మరోసారి విజయం కోసం ప్రయత్నించాలి

తప్పును సరిదిద్దకపోతే అది మరింత ఆపదను తెచ్చిపెడుతుంది

ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని

దుఃఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం

వెయ్యిసార్లు అపజయం ఎదురైనా గెలవాలనే కాంక్షను వదలొద్దు

దేశ స్వేచ్ఛని కాపాడుకోవడమనేది ప్రతి పౌరుడి బాధ్యత

స్పష్టత లేకుండా మాట్లాడటంకన్నా మౌనమే మిన్న

మనకు పట్టుదల ఉండాలి, అన్నింటికంటే మించి మన మీద మనకు విశ్వాసం ఉండాలి.

జీవితంలో వైఫల్యాలు భాగమని బావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకో గలుగుతాం

జీవితంలో సత్ప్రవర్తన క్రమశిక్షణ నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే 

నీతిగా సంపాదించడం నియమంగా బతకడమే నిజమైన ఉత్తమమైన జీవితం 

శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే

ఏ ప్రాణినీ చంపకూడదు, ఆ ప్రాణిలోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి, దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతి మనిషి మంచివాడే  

చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే  పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు

అపజయాలు తప్పులు కావు... అవి భవిష్యత్తు పాఠాలు

ఏదైనా తనంతట తాను నీ దరిచేరదు.. ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది  

కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే

చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు

ఈ ప్రపంచం బాధ పడేది చెడ్డవారి హింసవల్ల కాదు, మంచివారి మౌనం వల్ల

కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు

ఏ అర్హత మనకుంటే అదే లభిస్తుంది

విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది.

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనమే మిన్న

చేసేది చిన్న పనైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది

వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు

నువ్వు యుద్ధం గెలిచేంత వరకూ ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది

విలువైన మాటలు చెప్పేవాళ్లు దొరకడం మన అదృష్టం, అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం

ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు

సాధించాలనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది

సరిదిద్దకుండా వదిలేసిన తప్పుల్ని మించిన ఆపదలు మరేమీ ఉండవు

అందరినీ నమ్మడం,  ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే

మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.

కష్టాలను చూసి పారిపోయే వారి కంటే.. వాటిని ఎదుర్కొనే వారే విజయం సాధించగలరు.

డబ్బు లేనివాడు కాదు.. జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది 

మనం ఎలా ఆలోచిస్తే...  అలానే ఉంటాం

మన ప్రవర్తనకు మూలం... కోరిక, భావోద్వేగం, జ్ఞానం

ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే

ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపడం కాదు నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు  -రామకృష్ణ పరమహంస

శాంతంగా ఉండటమే గొప్పవారి లక్షణం 

మనసు చెప్పినట్టు మనం వింనడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి.   -బుద్ధుడు 

సహనం చేదుగా ఉన్నా దాని ఫలితాలు తీయగా ఉంటాయి 

కష్టాల్లోనే మనిషి శక్తి యుక్తులు బయటపడతాయి 

పేరు  ప్రఖ్యాతలు గాలిబుడగల్లాంటివి 

వివేకం లేని మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కన్నా ప్రమాదకరం 


Post a Comment

Previous Post Next Post