Albert Einstein Quotes In Telugu • ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సూక్తులు

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu, Einstein Famous Quotations Telugu

Best Albert Einstein Quotes In Telugu, Einstien Motivational Sayings In Telugu With Best Images And Biography.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలుగు కోట్స్, ( ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సూక్తులు )

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కొటేషన్స్ తెలుగులో, ఐన్‌స్టీన్ సూక్తులు బెస్ట్ ఇమేజెస్.

Albert Einstein Quotes In Telugu - Images

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Quotes In Telugu

Albert Einstein Telugu Quotations - Text

మీరు చేసిన పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనకా ఓ అవకాశం దాగి ఉంటుంది.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే.. శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఓటమి ఎరుగని వ్యక్తికన్నా, విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

మనం చేసిన పని అద్భుతంగా ఉండాలంటే దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

తమను ఇబ్బంది పెట్టిన వారిపై బలహీనులు పగను పెంచుకుంటారు, బలవంతులు క్షమించగలుగుతారు, తెలివైన వారు వేటినీ పట్టించుకోకుండా మసలుకోగలుగుతారు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారిని చూసి శత్రువు కూడా తలదించుకుంటాడు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

వ్యతిరేక స్వభావం గల  మనుషులకు దూరంగా ఉంటే మనకొచ్చే సమస్యలూ చాలా వరకూ తగ్గుతాయి.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఉన్నత వ్యక్తిత్వం ఉంటే, శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు.
- ఐన్‌స్టీన్‌

ఓటమి ఎరుగని వ్యక్తికన్నా, విలువలతో జీవించే వ్యక్తి మిన్న..
- ఐన్‌స్టీన్‌

చేసే పని అద్భుతంగా ఉండాలంటే, ముందు దానిని ప్రేమించడం నేర్చుకోవాలి.
- ఐన్‌స్టీన్‌

నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో, అప్పుడే మన పతనం మొదలవుతున్నట్లు లెక్క.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ప్రకృతికి దగ్గరగా ఉంటే, జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి. సంతోషమయమైన జీవితం గడపాలంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలే కాని, మనుషులను, వస్తువులను లక్ష్యంగా పెట్టుకోకూడదు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మేధావే. కానీ, మీరు ఒక చేపను అది చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి దాని తెలివితేటలను నిర్ణయిస్తే, అది తన జీవితం అంతా కూడా మూర్ఖుడిగానే ఉండిపోతుంది.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

నాకు సహాయం చెయ్యడానికి రానివారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే, వారివల్లనే స్వంతంగా పనిచేయటం నేర్చుకోగలిగాను.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

జీవితంలో మనం నేర్చుకున్న ప్రతీది ఎదో ఒక రోజు ఉపయోగపడుతుంది. 
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

జీవితం అనేది సైకిల్ మీద ప్రయాణం లాంటిది. మీ తప్పిపోకుండా ఉండటానికి మీరు దానిని నడుపుతూ ఉండాలి.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

తెలివైన వారు సమస్యలను పరిష్కరిస్తారు, మేధావులు అసలు సమస్యలు రాకుండా ఆపుతారు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గురించి తెలుగులో

ఐన్‌స్టీన్ 1879 వ సంవత్సరం మార్చి 14వ తేదీన జర్మనీలో ఒక యూదుల కుటుంబంలో జన్మించారు. ఈయన నాన్నగారు ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసేవారు. ఐన్‌స్టీన్ పుట్టినప్పుడు ఈయన తల భాగం కొంచెం పెద్దగా ఉండేది, దాంతో ఈయనకు ఏదైనా వ్యాధి ఉందేమో అని ఆయన తల్లిదండ్రులు భయపడ్డారు. కానీ కొంత కాలానికి అది మామూలుగా మారింది.

అలాగే ఐన్‌స్టీన్ కు మూడేళ్ళ వయస్సు వచ్చేసరికి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. చాలా నెమ్మదిగా ఉండే వారు, ఐన్‌స్టీన్  చిన్నప్పుడు వాళ్ళ నాన్న గారు దిక్సూచి ని ఇచ్చారు, దానిని చూసి ఐన్‌స్టీన్ ఎంతగానో ఆశ్చర్యపోయేవాడు, దానిని ఏవైపు తిప్పిన సరే ఆ కంపాస్ లోని సూచీ ఎప్పుడూ ఒకే వైపు ఎలా తిరుగుతుందని ఆసక్తిగా  గమనించేవాడు. అంటే, కంటికి కనిపించని ఫోర్స్ ఏది దానిని పనిచేయిస్తుందని అనుకున్నాడు.

ఆ దిక్సూచి కారణంగానే అతనికి చిన్న వయసు నుండి ఫిజిక్స్ పై ఇంట్రెస్ట్ పుట్టింది, ఈయన స్కూల్లో ఉన్న సమయంలో కూడా కేవలం ఫిజిక్స్ మరియు మాథ్స్ మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. దాంతో మిగిలిన సబ్జెక్టులలో మార్కులు తక్కువగా రావడంతో ఐన్‌స్టీన్ ఒక అవేరేజ్ స్టూడెంట్ గానే ఉండేవారు.

తర్వాత స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ లో తన కాలేజీ చదువు కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తే అందులో ఫెయిలయ్యారు. కానీ ఫిజిక్స్ మరియు మాథ్స్ లో మర్క్స్ ఎక్కువ రావడంతో చదువుకోవడనికి ప్రిన్సిపాల్ అనుమతించారు. అయితే ఐన్‌స్టీన్ క్లాస్ లకు ఎక్కువగా హాజరయ్యేవారు కాదు.  ఆయన తనకు తానే స్వయంగా చదువు నేర్చుకునేవారు.

చదువు పూర్తయిన తరువాత రెండు సంవత్సరాల పాటు తన టీచింగ్ ఉద్యోగం కోసం ఎంతగానో వెతికారు, ఆ సమయంలోనే ఆయన జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. చదువైతే పూర్తయ్యింది కానీ, ఉద్యోగం దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఇదే సమయంలో ఐన్‌స్టీన్  నాన్నగారి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కొంతకాలానికి ఐన్‌స్టీన్ నాన్నగారు అనారోగ్యం కారణంగా చనిపోయారు.

ఒక పక్క ఉద్యోగం లేదు మరొక పక్క కుటుంబ బాధ్యత ఆయన జీవితం దుర్భరంగా మారింది. కొంతకాలానికి ఐన్‌స్టీన్ స్నేహితుడి నాన్నగారు ఒక ఆయన ఐన్‌స్టీన్ కి స్విస్ పేటెంట్ ఆఫీసులో ఒక చిన్న క్లారిటీ ఉద్యోగం ఇప్పించారు,

తర్వాత 'మిలేవా మరిక్' అనే ఆవిడతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 1903లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకు కొత్తగా దొరికిన ఉద్యోగంలో తన పని మూడు గంటల్లో వేగంగా పూర్తి చేసి మిగిలిన సమయంలో ఏవేవో ఆలోచిస్తూ ఊహల్లో ఉండేవారు ఐన్‌స్టీన్.

ఆ విధంగా పెటెంట్ ఆఫీసులో పని చేస్తూనే ఖాళీ సమయంలో 4 సైంటిఫిక్ పేపర్స్ రిలీజ్ చేశారు, కాంతి, అణువుల ఉనికి మోస్ట్ ఫేమస్ ఈక్వషన్ అయినటువంటి  E=mc2, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ నాలుగింటి మీద ఆయన విడుదల చేసిన ఆ సైన్టిఫిక్ పేపర్స్ మొట్టమొదటిసారిగా ప్రచురించబడ్డాయి.

ఆ పేపర్స్ చుసిన తర్వాత మొత్తం ఫిజిక్స్ కమ్యూనిటీ అంత కూడా నివ్వెరపోయింది. కానీ ఆయన చెప్పిన థియరీలు ఫిజిక్స్ రంగులో ఉండే వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు అంత కష్టంగా ఉండేవి. ఆలా 4 సంవత్సరాల పాటు ఆ థియరీలు ఎవరికీ అర్థం కాక ఆ పేపర్లను ఎవరూ పట్టించుకునే వారు కాదు. దాంతో ఐన్‌స్టీన్ చాల నిరుత్సాహానికి గురయ్యారు. 

కానీ చివరికి మ్యాక్స్ ప్లాంక్  అనే ఒక 'ఫిసిస్సిస్ట్' ఆ పేపర్లను చూసి దాని లో మేటర్ ఉందని గుర్తించారు, ఆయన ఐన్‌స్టీన్ ని ఎంకరేజ్ చేశారు. అలా మాక్స్ ప్లాంక్  సహాయంతో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ఒక్కొక్క థియరీ కన్ఫర్మ్ అవుతూ వచ్చాయి. ఈ థియరీలు అన్నీ కూడా ఫిజిక్స్ మొత్తన్ని మార్చేశాయి. దాంతో ఒక్కసారిగా ఐన్‌స్టీన్ పేరు మారుమోగిపోయింది. ఆ నాలుగు సైంటిఫిక్ పేపర్స్ విడుదలైనటువంటి 1905 వ సంవత్సరాన్ని ఐన్‌స్టీన్ మిరాకిల్ ఇయర్ గా పిలుస్తారు.

అలాగే ఇంటర్నేషనల్ మీటింగ్లలో లెక్చర్స్ ఇవ్వడానికి ఆహ్వానాలు వచ్చేవి, ఎన్నో యూనివర్సిటీలు ఆయనకు మంచి మంచి ఉన్నతమైన స్థానాల్లో ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఆలా ఐన్‌స్టీన్ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరారు, అలా ఐన్‌స్టీన్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు తన థియరీలను డెవలప్ చేయడం కోసం ఎక్కువగా సమయం గడుపుతూ ఉండేవారు.

అలా 1915లో తన పరిశోధనలన్నింటులోను ప్రముఖమైనటువంటి 'జనరల్ థియరీ అఫ్ రిలేటివిటీ' ని పూర్తిచేశారు. ఒక్కసారిగా ఆయన గొప్పతనంపెరిగిపోవడంతో ఎక్కువగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడవలసి వచ్చేది, దాంతో ఆయన కుటుంబాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. 

ఒకానొక సమయంలో అయితే తన భార్య మెలీవతో ఒక కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకున్నారు. ఆ కాంట్రాక్ట్ లో కొన్ని కండిషన్స్ ఉండేవి, అవి ఏంటంటే మేలివ మూడు పూటలా భోజనం రెడీ చేసి నా రూం కి తీసుకురావాలి.  ఆయన రూమ్ ని బట్టలను ప్రతి రోజూ శుభ్రం చేయాలి. ఆయనతో వ్యక్తిగత సంబంధాలను తగ్గించుకోవాలి. ఐన్స్టీన్ చెప్పిన వెంటనే ఆమె ఆయన రూమ్ నుండి మాట్లాడకుండా వెళ్లి పోవాలి, ఇలా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు.

ఈ కండిషన్స్ కు ఒప్పుకుంటేనే వాళ్ళ కలిసుండటం జరుగుతుందని ఒప్పందం కొంతకాలం ఎలా గడిచింది గానీ తరువాత భార్యాభర్తల మధ్య గొడవ మొదలైయ్యాయి, దాంతో వాళ్ళిద్దరూ 1919లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఐన్‌స్టీన్ తనకు భవిష్యత్తులో నోబెల్ బహుమతి వస్తుందని ఆ బహుమతి ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని తన భార్య ఇచ్చేస్తానని మాటిచ్చారు అంటే తను భవిష్యత్తులో నోబెల్ ప్రైజ్ వస్తుందని ఎంతో నమ్మకంతో ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒప్పందానికి ఆమె కూడా ఒప్పుకుంది.

విడాకులు తీసుకున్న అదే సంవత్సరం తన చిన్ననాటి స్నేహితురాలు మరియు బంధు అయినటువంటి ఎల్సా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు  ఐన్‌స్టీన్ ఆ తర్వాత కూడా మాస్, ఎనర్జీ, టైం, స్పీడ్ వంటి వాటికి సంబంధించి ఎన్నో సైంటిఫిక్ థియరీస్ ని ప్రతిపాదించారు. అవి భౌతిక శాస్త్రంలో ఊహించని మార్పులు తీసుకు వచ్చాయి. 

ఐన్‌స్టీన్ నమ్మినట్లుగానే ఆయనకి నోబెల్ బహుమతి దక్కింది. కానీ అది బాగా ఫేమస్ అయినటువంటి 'ఈ ఈక్వల్ టు ఎం సి స్క్వేర్' కాదు ఆయన ప్రతిపాదించిన 'ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్' గాను ఆయనకు 1921వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది చెప్పినట్లుగానే నోబెల్ ప్రైస్ ద్వారా వచ్చిన డబ్బుని తన మొదటి భార్య ఇచ్చేశారు ఐన్‌స్టీన్. 

1930 ల కాలంలో ఐన్‌స్టీన్ జర్మనీ లో ఉన్నప్పుడు హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. అయితే హిట్లర్కి యూదులు అంటే ఇష్టం ఉండేది కాదు. ఎన్నో లక్షల మంది యూదులను హిట్లర్ చంపించాడని అన మనందరికీ తెలుసు.  ఐన్‌స్టీన్  కూడా యుడుదే కాబట్టి ఆయనను కూడా చంపాలని ప్రయత్నాలు జరిగేవి. పట్టించిన వారికి ఐదు వేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది హిట్లర్ ప్రభుత్వం. అంతేకాదు ఐన్‌స్టీన్ కి సంబంధించిన ఎన్నో పుస్తకాలను కూడా వాళ్ళ తగులబెట్టేశారు,

దాంతో ఐన్‌స్టీన్ జర్మనీ ని వదిలి అమెరికాకు వెళ్లిపోయి అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత తన జీవితమంతా అమెరికాలోనే గడిపారు, ఇది ఇలా ఉంటే ఇంత మేధావి అయినా కూడా ఐన్‌స్టీన్ కి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉండేది. ఈయనకు ముఖ్యమైన వారి పేర్లు తారీఖు లో కూడా గుర్తుండేవి కాదు, కనీసం ఈయన ఫోన్ నెంబర్ కూడా ఒక్కోసారి మరిచిపోయేవారు.

ఈయనకు తెలివితేటలే కాదు, మంచి మనసు కూడా ఉంది ఈయన ఆటోగ్రాఫ్ కోసం ఎవరైనా వస్తే వాళ్ల దగ్గర నుండి ఒక డాలర్ నుండి 5 వరకు తీసుకుని వారట అంతేకాదు ఈ ఎక్కడైనా స్పీచ్ఇవ్వాలన్నసుమారుగా 1000 డాలర్లు తీసుకునేవారు. కానీ అలా సేకరించిన డబ్బు అంతా కూడా చారిటీలకు డొనేషన్ ఇచ్చేసేవారు. 

ఐన్‌స్టీన్  తన జీవితకాలం మొత్తం మీద సుమారుగా 300 సైంటిఫిక్ పేపర్స్ ని పబ్లిష్ చేశారు ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన థియరీలను అని అర్థం చేసుకొని నిజం అని నిరూపించడానికి ఇప్పటికే ప్రయత్నిస్తున్నరు శాస్త్రవేత్తలు. అంతేకాదు మనిషి తెలివితేటలు కొలవడానికి ఉపయోగపడే IQ స్కోర్ సాధారణ మనిషికి 90 నుండి 110 వరకు ఉంటుంది కానీ ఐన్‌స్టీన్ IQ  స్కోర్ 160కి పైనే ఉండేది 

అప్పట్లో ఇజ్రాయిల్ దేశం మొదటి ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఐన్‌స్టీన్ కి దక్కింది. కానీ ఆయన సింపుల్ గా ఆ పదవిని వద్దనుకున్నారు.  ఆయన ప్రతిపాదించిన థియరీ ల వల్లనే మన ఈరోజు ఉపయోగిస్తున్న 'టివి, జిపిఎస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, రిమోట్ కంట్రోల్, డివిడి ప్లేయర్' ఇవన్నీ సాధ్యమయ్యాయి

స్పేస్ ట్రావెలింగ్ లో కూడా ఐన్‌స్టీన్ థియరీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి 1955 ఏప్రిల్ 17న ఐన్‌స్టీన్ కి abdominal aortic aneurysm కారణంగా అంటే పొట్ట భాగంలో రక్తాన్ని తీసుకువెళ్లే ఒక రక్తనాళం పగిలి రక్తం కారడం మొదలైంది, దానికి సర్జరీ చేస్తే బ్రతుకుతారని డాక్టర్లు చెప్పారు.  కానీ, ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించారు. 

నేను ఎప్పుడు చనిపోవాలో అప్పుడు చనిపోతాను. ఇలా ఆపరేషన్ ద్వారా కృత్రిమంగా పొడిగించిన జీవితంలో సారం ఉండదు. ఈ ప్రపంచంలో నేను చేవలసినది చేశాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవలసిన సమయం కాబట్టి నేను అదే చేస్తాను అన్నారు.

తర్వాతి రోజు అంటే 1955 ఏప్రిల్ 18వ తేదీన డెబ్భై ఆరేళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆ విధంగా మనమంతా ఒక మహా మేధావిని కోల్పోయాము. ఆయన చనిపోయే సమయంలో చివరగా జర్మనీ భాషలో ఏదో చెప్పారట. కానీ, ఆయన దగ్గర ఉన్న నర్స్ కి జర్మనీ భాష రాకపోవడంతో ఆయన ఏం చెప్పారు అనేది రహస్యం గానే మిగిలిపోయింది. (క్రెడిట్స్ ; తెలుగుబడి)

తెలుగు కొటేషన్స్

Post a Comment

Previous Post Next Post