Life Quotes In Telugu, Best Telugu Quotations On Life Images
Best Life Quotes In Telugu, Telugu Quotations Heart Touching Life Quotes In Telugu with Images, Motivational Quotes on life In Telugu, Inspirational life-changing Heart Touching life Quotes In Telugu. True, Real Life Good Emotional Telugu Life Quotes Best Images.
లైఫ్ కోట్స్ తెలుగులో, ( జీవితం గురించి సూక్తులు )
లైఫ్ కొటేషన్స్ తెలుగు. జీవితం అనేది ఒక అద్భుతం, ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తన లైఫ్ లో కష్టాలు, ఆనందాలు, కోపం, బాధ సహజం. అన్ని భావోద్వేగములు అనుభవించడమే జీవితము.
లైఫ్ గురించి తెలుసుకోవడానికి, మరియు ఇబ్బందులలో మనకు స్ఫూర్తినిచ్చే కొందరు గొప్ప మహానుభావులు చెప్పిన లైఫ్ కొటేషన్స్ తెలుగులో. ఈ కొటేషన్స్ మనను చాల మోటివేట్ చేస్తాయి అంతే కాకుండ మనం ఎంచుకున్న జీవిత లక్ష్యం లో కొన్ని సార్లు ఆటంకాలెదురైనప్పుడు, మనం మల్లి మన లక్ష్యం వైపు నడిపించే, మంచి సూక్తులు, మంచి మాటలు తెలుగులో Best Life Quotes Telugu.
Telugu Quotes On Life, Best Life Quotations In Telugu - Images
లైఫ్ కి ఒక లక్ష్యం అంటూ ఏది లేదు. అంటే నేను దీని కోసమే పుట్టాను, నేను ఇది చేయాలి, లేదా ఎదో ఒకటి సాదించాలి అని ఏమి ఉండదు. ఈ పోటీ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపు కోసం, డబ్బు కచ్చితమైన అవసరం కాబట్టి, ధనం సంపాదించడానికి నేను ఈ పని చేయాలి, అని లక్ష్యాన్ని మనమే పేట్టుకుంటాము.
పరిస్థితుల ప్రభావం మరియు డబ్బు ఉన్నప్పటికీ, లేనప్పటికీ ప్రతి వ్యక్తి లైఫ్ లో మంచి, చెడు సంఘటనలు జరుగుతుంటాయి. చెడు సమయాల్లో ఎలా వ్యవహరించాలి, మంచి సమయాల్లో ఎలా ఉండాలి అని జీవితంలో జరిగే సంఘటనలను కాస్త ముందు చూపు ఉన్నట్లయితే, మనకు ఎక్కువ చెడు జరగకపోవడానికి వీలుంది.
అంతేగాక కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లు అస్సలు జరగవు, జీవితాన్ని కచ్చితంగా ఇదే జరుగుతుందని అంచనా వేయలేరు. మన లైఫ్ కి పర్పస్ ఏమి ఉండదు., సకలకోటి జీవరాశులలో మనం ఒక జీవులమే కదా!. ఇతర జీవులతో పోలిస్తే 'మనకు కమ్యూనికేషన్ ఉంది, స్వంతంగా ఆలోచింతే విధానము కాస్త ఎక్కువగా ఉంది మరియు మనకంటూ కొన్ని చట్టాలు, సంప్రదాయాలు ఆస్తులు మనము కనుగొన్నాం, టెక్నాలజీ అభివృద్ధి చేసుకున్నాం, వాహనాలు, కరెంట్, ఫోన్ మొదలగునవి. ఇవన్నీ తీసేస్తే మనకు కూడా ఇతర జీవులలాగానే.
ఇప్పుడు వాస్తవిక ప్రపంచానికోస్తే, మనిషి జీవితం చాల రకాలుగా వుంది, అటు మంచిలోనూ, చెడులోనూ, మనిషి అభివృద్ధి చెందేకొద్దీ, తన భావోద్వేగాలు ఎక్కువవ్వడమే కాక, కొత్త భావోద్వేగాలు, భవనాలు వస్తున్నాయి. ఒకరికి నచ్చింది, ఇంకొకరికి నచ్చదు, కొందరు నమ్మింది, మరికొందరు నమ్మరు, ఇంకా హత్యలు, దొంగతనాలు చెప్పనక్కర్లేదు.
నేటి కాలంలో నాలుగు రోజులు మనశాంతిగా బ్రతకడమంటే మామూలు విషయం కాదు, ఆలా అయ్యింది పరిస్థితి, జాబ్స్, చదువులు, పెళ్లిళ్లు, చావులు, రాజకీయాలు, టీవీలు, జీతాలు, బిల్లులు, అప్పులు, ఇలా మొదలగు సమస్యలు, పనుల వల్ల, మన జీవితం కాస్త బిజీగా కాకుండా పూర్తి బిజీగా అయిపోయింది. ఎవ్వరు ఒకేలా ఉండరు, మనకు ఆనందమొచ్చినప్పుడు ఇతరులకు కష్టాలుంటాయి, మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇతరులలో సంతోషం చోటు చేసుకుంటుంది, మొత్తానికి ఎవడి గోల వాడిదే.
ఇతరుల గురించి ప్రక్కన పెడితే, మనం బ్రతుకుతున్నది మనకోసం మరియు మన ఫామిలీ కోసం, కాస్త మంచి చెడు జరిగినప్పుడు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, తప్ప మనను దాదాపు ఎవ్వరు పట్టించుకోరు.
నేటి సమయంలో కష్టాలు, బాధలు రావడం చాల సహజం, ఇవి లేకుండా లైఫ్ లేదు. ప్రతి మనిషికి ఒక లక్షమంటూ ఉండాలి, దాని కోసం కష్టపడాలి మరియు సాధించాలి. అప్పటి వరకూ మనను ఈ సమాజంలో ఎవరూ పట్టించుకోరు. మనం కల కన్నది మనం సాధించినప్పుడు వచ్చే ఆనందమే వేరు అది తెలుసుకోవాలంటే సాధించక తప్పదు.
లక్ష్యంలో విఫలమైనా ఫర్వాలేదు కానీ లక్ష్య సాధనలో ఎప్పుడు విఫలం కాకూడదు, విఫలం అయినప్పుడు నీదగ్గర ఓడిపోయినందుకు కారణం లేకపోతె నీవు నిజంగా గెలిచినట్టే.
ప్రతి జీవికి, మనిషికి జీవితం ఒకేసారి వస్తుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మోసాలు, దొంగతనాలు, హత్యలు ఎక్కువయ్యాయి. మనం అందరిలా కాకుండా నిజాయితీగా, ధర్మాంగ బ్రతుకుదాం, చనిపోయేటప్పుడు "మనవల్ల ఎవ్వరికి హాని జరగలేదు, ఎవ్వరిని మోసం చేయలేదు, నిజాయితీగా బ్రతికాను" అని తెలిస్తే అంతకన్నా గొప్ప జీవితము లేదు.