Best Real Life Quotes in Telugu Text [ Inspirational ]

Real Life Quotes in Telugu Text

Best Real Quotes ( Sookthulu ) Manchi Matalu In Telugu, Motivational Real Life Quotations Text Format In Telugu, Telugu Quotations Text [ మంచి మాటలు, తెలుగు సూక్తులు]


మీరు ఇప్పుడు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు కోసం

మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇప్పుడే  కష్టపడాలి

మంచి ఫలితాలు ఉచితంగా రావు

మీరు గెలిచినంత వరకు మీ కథను ఎవరూ పట్టించుకోరు

రువాత బాధపడటం కంటే ఇప్పుడే ప్రయత్నించడం మంచిది

 

నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృథా చేయవద్దు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే

 

Real Life Quotes in Telugu Text
Real Life Quotes in Telugu Text

మీ కలలను చెప్పవద్దు చేసి చూపించండి

విజయవంతమైన ప్రయాణంలో పోరాటం ఒక భాగం

హార్డ్ వర్క్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు

మీరు కష్టపడనంతవరకు కలలు సాధ్యం కావు

సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు   -స్వామి వివేకానంద.

బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుందంతే.

గమ్యాన్ని చేరడానికి రెండు మార్గాలు ఒకటి స్వశక్తి రెండోది పట్టుదల  -అబ్దుల్ కలం

ఓటమి గురించి భయపడటం మొదలుపెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే  -సిసిరో. 

గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, అనందంగా జీవించడం    -మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

నీతులు బోధించడం కాదు ఆచరించి చూపాలి  -స్వామి వివేకానంద

అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికి నిలబడవు  -ఎమర్సన్

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలితమైనదే, కృషితో తో మనం సంపాదించుకునేదే శాశ్వతం  -గాంధీజీ 

అందం ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది  -అబ్దుల్ కలం

నీ ఏడుపు విని అమ్మ ఆనందించే క్షణం ఏదైనా ఉందంటే...  అది నువ్వు పుట్టిన క్షణం మాత్రమే 

పని చేసిన ప్రతిసారి సత్పలితాలు రాకపోవచ్చు, కానీ అస్సలు  ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు  -లింకన్ 


* Famous True Life Quotes In Telugu Text *


మనం ఆనందంగా ఉండటానికి అత్యంత సులువైన మార్గం ఇతరుల్ని ఆనందంగా జీవించేలా చేయడమే  -స్వామి వివేకానంద 

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది  -గాంధీజీ 

నువ్వు నిద్ర లేచినా  లేవకపోయినా సూర్యోదం మాత్రం ఖాయం  

ఈరోజు చెయ్యాల్సిన పని రేపటికి వాయిదా వేసేవారు లక్షాన్ని సులభంగా సాధించలేరు  -జాన్ డ్రైడెన్

 

విజయమే జీవితం కాదు ఓడిపోవడమంటే అన్ని కోల్పోవడమూ  కాదు గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం  -జార్జ్ బెర్నార్డ్ షా 

 

Famous True Life Quotes In Telugu Text

గమ్యాన్ని చేరేందుకు చాల దారులుంటాయి సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు  -ఎమర్సన్ 

ఉన్నత లక్షాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే  -సర్వేపల్లి రాధాకృష్ణన్  

విద్య నీడ లాంటిది దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు  -షేక్స్పియర్

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి  -మోక్షగుండం విష్వెశ్వరయ్య 

అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు అందరికీ సమానమే 

నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వేయి క్షణాలను తప్పించుకోవచ్చు 

గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు  -జాన్ డ్రైడెన్ 

మంచి స్వభావమే మనిషికి అలంకారం 

ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు  -షేక్ స్పియర్

ప్రయత్నం చేసి ఓడిపో  కానీ ప్రయత్నం చెయ్యడంలో ఓడిపోవద్దు  -రవీంద్రనాథ్ ఠాగూర్ 

సమస్యలు లేకుండా చెయ్యమని ప్రార్థించడం కన్నా  వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడగడం మిన్న  -మదర్ థెరిసా 

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం, ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది  -సర్వేపల్లి రాధాకృష్ణన్ 

శ్రమించడం అలవాటు చేసుకుంటే గెలవడం అలవాటవుతుంది 

చెడ్డ వారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది  -రమణ మహర్షి 

ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు పోరాడు, ఓటమి నీ కాళ్ళ దగ్గరా గెలుపు నీ కాళ్ళ ముందర నిలిచిపోతాయి. 

కాలం కంటే విలువైనది ఏదీ లేదు, దాని దుర్వినియోగం చెయ్యకూడదు  -రామకృష్ణ పరమహంస

ధైరం లేకపోతే ఏ రంగంలోనూ విజయం సాధించలేము  -స్వామి వివేకానంద 

విద్య అంటే మనలో సమాచారం నింపేది కాదు, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేది  -రవీంద్రనాథ్ ఠాగూర్ 

మీరు చేసే పని అద్భుతంగా ఉండాలంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి  -ఐన్స్టీన్ 

కోరికలు మితంగా ఉంటే, బాధలూ తక్కువగానే ఉంటాయి  -రమణ మహర్షి 

ఓడిపోతామేమోనన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది  -ఎమర్సన్ 

సత్యం భగవంతుడి కన్నా గొప్పది  -మహాత్మా గాందీజీ 

గొప్పతనం సంపద వాళ్ళ రాదు మంచి ప్రవర్తనతో వస్తుంది  -గాంధీజీ 

ఉన్నదాంతో తృప్తి పడడమే గొప్ప సంపద

నేర్చుకునేందుకు వయస్సు అడ్డు కాదు 

శ్రమించేవారికి మంచే జరుగుతుంది 

మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో ఉండాలి  -మదర్ థెరిసా 

ఒంటరిగా కన్నా కలసికట్టుగా గొప్ప పనులు సాధించవచ్చు  -హెలెన్ కెల్లర్ 

 

* Quotes About Life In Telugu Text *


అశాంతి, ఆందోళనతో విందు ఆరగించే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టెముక్క తినడం మేలు  

ఆలోచనలతో మార్పు రాదు ఆచరణ మొదలు పెట్టినప్పుడే అది సాధ్యం అవుతుంది  -నెల్సన్ మండేలా 

చెడు అలవాట్లు క్రమంగా తగ్గించుకుంటే కొంతకాలానికి చెడ్డవాడైనా మంచి వాడిగా మారాల్సిందే 

ప్రతిభ ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది  -సిమర్స్ 

పుస్తకాలకన్నా అనుభవ జ్ఞానమే గొప్పది

జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం చేయడమే అది లేని జీవితం ఉండదు

Quotes About Life In Telugu Text

తెలిసిన వ్యక్తి ప్రతి విషయాన్నీ తెలుసు కోవాలనుకుంటాడు  -జాన్సన్ 

చెడు వార్త త్వరగా వ్యాపిస్తుంది 

ప్రతి మనిషికి ఒక లక్ష్యమంటూ ఉండాలి అది లేకపోతే జీవితం వ్యర్థం  -మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

మనసుంటే మార్గం ఉంటుంది  

మంచి పనులు అలవాటు కావాలంటే తరచూ చేస్తుండాలి 

కఠోరమైన శ్రమ చేస్తూ పట్టుదలతో ముందుకెళితేనే అనుకున్నది సాధించగలం  -నెల్సన్ మండేలా 

వ్యక్తి విలువ పెరిగేది మంచి పనులతోనే కానీ వయస్సు తో కాదు 

అప్పు లేకపోతే ముప్పు లేనట్టే 

నిజం చెబితే ఎప్పుడూ భయపడాల్సిన పని ఉండదు 

చదవడం తెలిస్తే ప్రతి వ్యక్తి ఓ పుస్తకమే 

అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది, సుగుణం హృదయాన్ని మెప్పిస్తుంది  -రామకృష్ణ పరమహంస 

కోరికలు తక్కువున్నవాడే నిజమైన ధనవంతుడు

పుస్తకాలలో ఉన్న జ్ఞానం, ఇతరుల దగ్గర దాచిన డబ్బు ఈ రెండు అవసరానికి ఉపయోగపడవు. 

ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఏ దారిన వెళ్లినా ఒక్కటే.

బడిలో పాఠం బతుకుతెరువు చూపుతుంది, జీవిత పాఠం బతకడం నేర్పుతుంది  

ఇష్టంగా  చేసే పని సులువుగా ఉంటుంది 

మంచితనమే పెట్టుబడి ఎప్పటికి లాభాలనే పంచుతుంది 

తప్పు చేశానని చింతించి తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే ఆ పశ్చాత్తాపానికి విలువేముంది 

ఆగ్రహం వివేకశూన్యతతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది

ఉన్నతమైన ఆలోచనలే గొప్ప వారిగా తయారుచేస్తాయి 

తప్పు ఎన్నటికీ ఒప్పు కాదు 

పేదరికం కష్టతరమైనదే కానీ అప్పు అంతకన్నా భయంకరమైనది 

తొందరపాటుతో ఇతరులపై అభాండాలు వేయకూడదు 

ఇతరుల గెలుపుని చూసి అసూయ పడనివారే అందరి కంటే ఆనందంగా జీవిస్తారు 

అగ్రగామిగా  నిలవాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి  -ఎడ్వర్డ్ 

అస్సలు లేకపోవడం కంటే కొంతైనా ఉండటం నయం

కొన్ని సమయాల్లో మౌనమే మేలు

కార్య సాధకులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ఆచరణలోకి దిగుతారు 

జీవితాన్ని సంపదతో కొలిచేవారు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు  -మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

జారవిడుచుకున్న అవకాశం  రాకపోవచ్చు

చేసిన తప్పులు ఎప్పటికైనా బయట పడతాయి   -డ్రైడెన్ 

కాలమే అన్ని గాయాలకీ మందు 

వ్యర్థమైన మాటలు వెయ్యి చెప్పడం కన్నా శాంతిని ప్రసాదించే ఒక మంచి వచనం చాలు   -గౌతమ బుద్ధుడు 

మర్యాద ఇవ్వడం వలన ఎవరూ ఏమీ నష్టపోరు

అత్యాశ లేని వారు అసంతృప్తికి గురికారు 

చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు

మంచితనమే హుందాతనానికి నిదర్శనం   -టెన్నిసన్ 

గొప్ప విజయాలు సాధించాలంటే శ్రమ కూడా ఎక్కువే చేయాలి  -నెపోలియన్ 

నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు,  నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు 

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. 

కోపం చేతల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. 

ఓటమి ఎన్నో విషయాల్ని నేర్పుతుంది. 

పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు శత్రువులూ లేరు. మన మాట, మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం. 


* Motivational Quotes In Telugu Text *


తమకు తాము గొప్ప అనుకునే వారు అభివృద్ధి చెందలేరు

గెలవాలంటే అన్ని సవాళ్ళనూ ఎదుర్కోవాలి, ఇష్టమైన వాటిని మాత్రమే ఎదుర్కోవాలంటే కుదరదు 

మన జీవితమే మనకు ఉపాద్యాయుడు అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది  -బ్రూస్ లీ

Motivational Quotes In Telugu Text

బాధ్యత తెలియనివారికి పనులు అప్పగించకు, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు 

చదువుకి క్రమశిక్షణ తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుంటుంది  -సర్వేపల్లి  రాధాకృష్ణన్ 

చెడు మార్గంలో వచ్చిన సంపాదన వలన మాంచితనం దూరమవుతుంది 

చేసిన పొరపాటుకు చింతించే బదులు మళ్లి చేయకుండా జాగ్రత్త  పడటం ఉత్తమం.

కష్టపడే వారికి తప్పకుండా ఫలితం వష్తుంది 

వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు, నిరంతరం నేర్చుకొనే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు    -రవీంద్రనాథ్ ఠాగూర్ 

మనకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మనం వృథా చేసిన కాలమే 

ఎవరి తప్పులు వారు తెలుసుకోవడంలో తప్పులేదు 

తప్పులు చేస్తున్న వాళ్ళు తమనెవరు గమనించడం లేదనుకుంటారు

నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి అప్పుని తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగలనిచ్చినా మళ్ళీ వృద్ధి చెందుతాయి 

ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం పొందబోతున్నావన్న మాటే, అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది.   -అంబేడ్కర్ 

ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం  వేసుకుంటాం గానీ వీధంతా తివాచీ పరచం కదా. 

కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాల్ని ఇవ్వవు  -రామకృష్ణ పరమహంస 

లోపాలు లేని వ్యక్తులంటూ ఉండరు - Nobody Is Perfect

నీ గొప్పతనాన్ని నోటితో చెప్పి చులకన కావద్దు. చేతులతో చూపి మన్నన పొందు

ఒక పురుషుడు చదువుకుంటే అతడు మాత్రమే చదువుకుంటాడు ఒక మహిళ చదువుకుంటే ఒక తరం మొత్తం చదువుకుంటుంది

ఇతరులు సాధ్యం కాదన్న దాన్ని చేయగలిగిన సందర్భమే నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం 

మన పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు లాయరులా వాదిస్తాం. ఎదుటివారి పొరపాట్ల గురించి మాట్లాడేటప్పుడు జడ్జీలా తీర్పు చెబుతాం 

అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు

ఏ పని అంత తేలిక కాదు కానీ అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా ఎంతో కష్టమనిపిస్తుంది 

వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు, అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావలి 

కార్య సాధకుని కల నిద్రలో వచ్చేది కాదు నెరవేరేదాకా నిద్ర పట్టకుండా చేసేది 

మూర్ఖులతో వాదన దుష్టులతో స్నేహం దొంగలతో పరిచయం అసమర్థులతో వ్యాపారం నచ్చని వ్యక్తితో వివాహం చేయకూడని పనులు 

ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు శిఖరం మీద కుర్చున్నంత మాత్రాన కాకి గరుడపక్షి కాలేదు 

ఓటమి ఎరుగని వ్యక్తి అనిపించుకోవడం కన్నా విలువలను వదులుకొని వ్యక్తి అనిపించుకోవడం మేలు

అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.

ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగాల అపాయాన్ని కూడా అంచనా వేయాలి 

మనల్ని తీర్చి దిద్దేది మన ఆలోచనలే  -స్వామి వివేకానంద 

పనులు అత్యుత్యమంగ జరగాలంటే ఎవరికీ వారే చేసుకోవాలి - If You Want A Thing Well Done, Do It Your Self

ఎదుటివారిని సంతోషపెట్టే ప్రయత్నంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది 

మంచి అలవాట్లు మానడం చాల సులువు చెడు అలవాట్లు మనడమే మహాకష్టం

విలువలతో బతికినవారే జీవితంలో అసలైన విజేతలు   -రమణ మహర్షి 

అబద్దాలు చెప్పేవాడు నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు - A Liar Is Not Believed When He Speaks The Truth

మీలో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధించగలరు  -అబ్రహం లింకన్ 

Books And Friends Should Be Few But Good 

గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం సొంతమవుతుంది   -అరిస్టాటిల్ 

ఒక అబద్దం వలన మరిన్ని అబద్దాలు మాట్లాడాల్సి వస్తుంది - One Lie Makes Many

అశ్రద్ధ ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది  -స్వామి వివేకానంద 

ఇతరుల దుఃఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు  -అరిష్టాటిల్ 

మాటల్ని బట్టి కాదు,  పనిని చూసి మనుషులను అంచనా వేయాలి  -అబ్రహం లింకన్ 

అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయకూడదు  -స్వామి వివేకానంద 

అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ 

మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు  -మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా చేసేయగలం  -గాంధీజీ 

బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ, కాలేజీలో చేరిన తరువాత తెలిసింది స్కూల్ విలువ, ఉద్యోగానికి వెళ్లిన తరువాత తెలిసింది చదువు విలువ, పదవీ  విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ, మరణానికి దగ్గరవుతున్నపుడు తెలిసింది జీవితం విలువ, ఏదైనా మన చేతిలో ఉన్నపుడు తెలియదు దాని అసలు విలువ.

ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు అది ఒక అడుగు మాత్రమే కానీ గమ్యం కాదు  -అబ్దుల్ కలాం 

గొప్పదనం అనేది చెప్పే మాటలతో రాదు చేసే పనుల నుంచి వస్తుంది  -సర్వేపల్లి రాధాకృష్ణన్ 

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది  -రమణ మహర్షి 

ఏ పొరపాటు చెయ్యట్లేదంటే కొత్తగా ఏది ప్రయత్నించట్లేదన్నమాట 

తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది కానీ ఆకలి బాధను అజ్ఞాన బాధను ఎవరికీ వారే తగ్గించుకోవాలి 

నువ్వు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వెంటో తెలుస్తుంది, ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది

అవివేకమంటే ఈసారి ఫలితం మరోలా ఉంటుందనే ఆశతో చేసిన తప్పునే మళ్ళీ  మళ్ళీ చేస్తుండటం 

తెలివిపరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ గురువులతోనూ యజమానితోనూ మనకు ప్రియమైనవారితోనూ వాగ్వాదానికి దిగకూడదు

మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేథస్సు కాదు హృదయం 

కంప్యూటర్లు మనిషిలాగా ఆలోచిస్తే వచ్చే  ప్రమాదమేమీ లేదు మనిషి కంప్యూటరులాగా ఆలోచిస్తేనే ప్రమాదం 

మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయం సాధించలేరు  -అబ్దుల్ కలాం

ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి 

సంతృప్తి ని మించిన సంపద ఉండదు  -సోక్రటీస్ 

తనను తాను జయించుకున్న వ్యక్తి అన్నిటినీ జయిస్తాడు   -సిసిరో 

ఎవరు అన్ని వేళలా తెలివిగా ఉండరు - No Man Is Wise At All Times

సమయం అదా చేసినవాడు అన్ని అదా చేసినట్టే - Who Gains Time He Gains Everything

దూరపు కొండలు నునుపు 

చిరునవ్వును  మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు   -ప్లేటో

అపజయాలు తప్పులు కావు ...  అవి భవిష్యత్తుకి పాఠాలు   -అబ్దుల్ కలాం

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు  ప్రయత్నించనిదే విజయము దక్కదు


* Inspirational Life Quotes In Telugu Text *


భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు  -చెగువేరా

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది   -బ్రుస్లీ 

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు  -బ్రూస్ లీ 

మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు  -అబ్దుల్ కలాం 

జీవితంలో ప్రతిరోజూ  క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి  -రావీంద్రనాథ్ ఠాగూర్ 

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది  -కలాం 

డబ్బు లేని వాడు కాదు పేదవాడు జీవితంలో ఒక ఆశయం అంటూ  లేనివాడే నిజమైన పేదవాడు  -వివేకానంద 

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికి ఆనందంగా ఉండలేడు  -ప్లేటో 

పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు ప్రతి మొక్కా మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి  -ప్లేటో 

జీవితంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అందుకు మన ప్రయత్నమే ముఖ్యం  -అరిష్టారిల్ 

Inspirational Life Quotes In Telugu Text

మనకు ఒక్క సమస్యా లేదంటే మనం జీవితంలో ఎప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్థం  -ప్లేటో 

ఎదురుదెబ్బ తగిలినప్పుడు నిరాశ పడకూడదు జీవితం మనకేదో నేర్పేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించాలి  -హేన్రి ఫోర్డ్ 

జీవితం అంటేనే మనల్ని మనం నిర్మించుకోవడం అది ఎలాగన్నది మన చేతుల్లోనే ఉంటుంది  -మార్టిన్ 

తమలోని చెడ్డ లక్షణాలతో పోరాడి గెలిచేవారు జీవితంలో ఎప్పటికి విజేతలే 

జీవితంలో అవకాశం ఒక్కసారే రాదు చేజారిన అవకాశం గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది  -మార్టిన్ 

జీవితం నీకు విజయాలనందించదు అవకాశాలనిస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది  -కలాం 

ఆశను ఎప్పుడూ వదలకు జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే  -ప్రాంక్లిన్ 

ఆత్మవిశ్వసం నిగ్రహం జ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి 

జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది 

జీవితంలో విజయం సాదించడమనేది సంపాదించినా డబ్బుని బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి 

జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు  -బుద్ధుడు

జీవితంలో వైఫల్యాలు భాగమని బావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకో గలుగుతాం  -కలాం 

జీవితంలో సత్ప్రవర్తన క్రమశిక్షణ నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే 

నీతిగా సంపాదించడం నియమంగా బతకడమే నిజమైన ఉత్తమమైన జీవితం 

ఆశయం లేని జీవితం దీపం లేని ఇళ్లు వంటిది 

ఆదర్శవంతమైన జీవితానికి ఉత్తమ గ్రంథాలు ఉత్తమ మిత్రులు ఎంతో అవసరం  -గాంధీజీ 

ఏ పనైనా ప్రేమతో చేసి చుడండి అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది  -మదర్ తెరిసా 

జీవితంలో బాధపడవలసిన విషయం ఏది లేదు దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం 

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది 

కాలాన్ని వృథా చేయవద్దు ఆ తరువాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది 

తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే అడగకపోతే ఆ అజ్ఞానం జీవితాంతం మనలోనే ఉండిపోతుంది 

Inspirational Life Quotes In Telugu Text

జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు చిరకాలం నిలిచిపోతుంది 

జీవితంలో ధనం పోగొట్టుకుంటే కొంత కోల్పోతాం గానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే 

జీవితం అంటేనే పోరాటం అది ఎప్పుడు ధర్మం వైపునే ఉండాలి 

జీవితానికి కొలమానం డబ్బుకాదు సంతృప్తి సంతోషం 

మన జీవిత లక్ష్యం ఆనందం కాదు దానికి తగిన అర్హత సంపాదించుకోవడం 

శ్రమలో ఉన్న ఆనందాన్ని గుర్తించిన వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు 

బంగారంలో ప్రతి సన్నని తీగకూ విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణమూ విలువైనదే 

జీవితం నిరాడంబరంగా లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి 

జీవితంలో ఆనందం సంతృప్తి విజయం అనేవి మనం ఎంపిక చేసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి

ఎదో ఒక పనిలో నిరంతరం నిమగ్నమైన వారి జీవితంలో కన్నీళ్ళకు చోటులేదు 

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు 

జీవితాన్ని సులభతరం చేసేది సంతోషమే 

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య 

మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతోకొంత నేర్చుకో గలిగితే మన జీవితం ధన్యమే 

ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్నే నాశనం చేస్తుంది

మన జీవితాన్ని ఎదుటివారి జీవితంతో పోల్చుకుంటే మిగిలేది అశాంతే 

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది

ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది 

వివేకవంతులు గ్రంథాలతో పాటు జీవితాన్నీ అధ్యయనం చేస్తారు 

మనం జీవించడానికి సంపాదించాలి కానీ సంపాదనే జీవితం కాకూడదు

 

Life Quotes In Telugu • జీవితం కోట్స్ [ Best Images ]

Post a Comment

Previous Post Next Post