Telugu Quotations Text • తెలుగు కొటేషన్స్ [ 2000+ ]

2000+ Telugu Quotations -Best Quotes In Telugu Text

Best Telugu Quotes, All Quotations In Telugu Text

Telugu Quotations, Best Telugu Quotes, All Telugu Quotations, Manchi Matalu, Sukthulu, Motivational, Inspirational, Life, Love, Friendship, Sad, Failure, Success, Courage And Many More Telugu Quotations, Great People Sayings In Telugu.

తెలుగు కోట్స్ ( తెలుగు కొటేషన్స్ )

మంచి తెలుగు కొటేషన్స్, జీవిత సత్యాల గురించి గొప్ప వ్యక్తులు చెప్పిన గొప్ప కొటేషన్స్ తెలుగులో. ఈ మంచి మాటలు మనకు స్ఫూర్తినిస్తాయి. మీకోసం 2000 కు పైగా కొటేషన్స్ తెలుగులో.

గౌతమ బుద్ధుడు, శ్రీశ్రీ, చేగువేరా, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, గాంధీజీ, స్వామి వివేకానంద, స్టీవ్‌ జాబ్స్‌, సిసిరో, ఎమర్సన్‌, అరిస్టాటిల్‌, జార్జ్‌ బెర్నార్డ్‌ షా, నెల్సన్‌ మండేలా, రామకృష్ణ పరమహంస, ఆస్కార్‌ వైల్డ్‌, జాన్‌ డ్రైడెన్‌, చాణక్యుడు, రూజ్‌వెల్ట్‌, రమణ మహర్షి, మదర్‌ థెరెసా, బ్రూస్‌ లీ,  ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లీ చాప్లిన్, బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌, షేక్‌స్పియర్‌, అబ్దుల్‌ కలాం, టెన్నిసన్‌,  మార్క్‌ ట్వైన్‌, కన్‌ఫ్యూషియస్‌, ఒ.ఎ.బటిస్టా, వినోబాభావే, కబీర్‌, అబ్రహాం లింకన్‌, ప్లేటో, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, హెన్రీ ఫోర్డ్‌, చార్లెస్‌ డార్విన్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, హెలెన్‌ కెల్లర్‌, కాళిదాసు, ఎలోన్ మస్క్, వారెన్‌ బఫెట్‌, రూసో,  నెపోలియన్‌, సరోజినీ నాయుడు, అంబేడ్కర్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, కార్ల్ మార్క్స్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, వేమన, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆది శంకరాచార్యులు, భగవద్గీత, బైబిల్, భగత్‌సింగ్‌, లెనిన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మరియు ఇతర గొప్ప వ్యక్తులు చెప్పిన, మంచి మాటలు, సూక్తులు, కొటేషన్స్ తెలుగులో.

Telugu Quotations Text, All Quotes In Telugu - Best Telugu Quotations

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు
- చేగువేరా

ఏదీ దానంతట అది మన దగ్గరకు రాదు, శోధించి సాధించాల్సిందే
- శ్రీశ్రీ

యుద్ధంలో వెయ్యి మందిని సంహరించేవాడి కన్నా తన మనస్సును తాను జయించగలిగినవాడే నిజమైన వీరుడు
- గౌతమ బుద్ధుడు

సంతృప్తి లేకపోవడమే దుఃఖాలన్నింటికీ కారణం
- గౌతమ బుద్ధుడు

మనకు ఉన్న సంపదతో సంతృప్తి పడటం ఉత్తమం, మనకున్న జ్ఞానం సరిపోతుందనుకోవడం అజ్ఞానం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే నిజమైన సహనం
- గాంధీజీ

ప్రేమ, నిజాయతీ, పవిత్రతలతో ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు
- స్వామి వివేకానంద

జ్ఞానం వంశపారంపర్యంగా వచ్చేది కాదు, దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే
- స్టీవ్‌ జాబ్స్‌

బాధే మనల్ని బలవంతులం అయ్యేలా చేస్తుంది, వైఫల్యమే విజయానికి కావాల్సిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది
- సిసిరో

ఇతరులను ఆనందంగా ఉంచడంలోనే మనకు అసలైన ఆనందం దొరుకుతుంది
- ఎమర్సన్‌

జీవితంలో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు, అందుకు మన ప్రయత్నమే ముఖ్యం
- అరిస్టాటిల్‌

గెలుపు అందరికీ దొరకదుగానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది.
- సిసిరో

విజయమే జీవితం కాదు, ఓడిపోవడమంటే అన్నీ కోల్పోవడమూ కాదు, గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం
- జార్జ్‌ బెర్నార్డ్‌ షా

తనని తాను చిన్నబుచ్చుకోవడం అన్నింటికంటే పెద్ద బలహీనత
- స్వామి వివేకానంద

ధైర్యవంతుడంటే భయం తెలియని వాడు కాదు, భయాన్ని జయించినవాడు
- నెల్సన్‌ మండేలా

మనల్ని మనం చదువుకున్నప్పుడు మన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది
- అరిస్టాటిల్‌

పరిస్థితుల్ని శాంతియుతంగా ఎదుర్కోవడం వల్ల మనోబలం పెరుగుతుంది
- గాంధీజీ

నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్లకన్నా కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న
- రామకృష్ణ పరమహంస

మనం సంతోషంగా ఉండాలంటే ఆశించడం, శాసించడం మానేయాలి
- ఆస్కార్‌ వైల్డ్‌

మనం ఇష్టపడింది దొరకనప్పుడు, మనకు దొరికిన దాన్నే ఇష్టపడాలి
- రామకృష్ణ పరమహంస

వెలిగే దీపమే ఇతర దీపాలనూ వెలిగించగలదు, నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకూ నేర్పగలరు
- ఠాగూర్‌

ఒక పనిని చేసే ముందే బాగా ఆలోచించాలి,  ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఆ పని సరిగ్గా చేయాలి  
- ఎమర్సన్‌

గెలవగలనన్న నమ్మకం ఉన్నవాడే గెలుస్తాడు
- జాన్‌ డ్రైడెన్‌

బలహీనులు ఎప్పటికీ ఇతరుల్ని క్షమించలేరు, ఎందుకంటే క్షమ బలవంతుల లక్షణం.
- గాంధీజీ

సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పులు మనిషికి నిజమైన బంధువులు 
- చాణక్యుడు

నీలోని బలాబలాలేంటో ముందు తేల్చుకో, ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు ఆ అంచనా తప్పనిసరి.
- రూజ్‌వెల్ట్‌

శారీరక సౌందర్యం కన్నా హృదయ సౌందర్యం గొప్పది
- రమణ మహర్షి

అందమైనది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది, మంచిగా ఉన్న వారు ఎప్పుడూ అందాన్ని పొందుతారు.
- గౌతమ బుద్ధుడు

ప్రశ్నించనిదే జవాబు దొరకదు... ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
- లింకన్‌

గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి
- సిసిరో

 ఏ పనినైనా నిండు ప్రేమతో చేసి చూడండి, అది మన జీవితాన్నిఅత్యంత సంతోషకరం చేస్తుంది.
- మదర్‌ థెరెసా

జీవితం దాని గమనంలో మనకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
- బ్రూస్‌లీ

నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే మన పతనం మొదలవుతున్నట్లు లెక్క
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఏకాగ్రత, ఆలోచనల ద్వారానే నైపుణ్యం వస్తుంది
- ఎమర్సన్‌

అసలైన సంపద ధైర్యమే, దాన్ని కోల్పోతే అన్నీ పోగొట్టుకుంటాం
- ఫ్రాంక్లిన్‌

మంచి పని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది
- స్వామి వివేకానంద

కర్తవ్యంలేనివారికి హక్కులుండవు, హక్కులన్నీ కర్తవ్య నిర్వహణ నుంచే ఆవిర్భవిస్తాయి
- గాంధీజీ

ఇచ్చే బహుమతి కన్నా ఇచ్చే విధానంలోనే గొప్పతనం ఉంది
- సిసిరో

ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారక తప్పదన్నది గుర్తుంచుకున్నప్పుడు ఒత్తిడి నుంచి తప్పక దూరం అవుతాం
- గౌతమ బుద్ధుడు

ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యంకాదు, ఓర్పు
- షేక్‌స్పియర్‌

మన బలహీనతల్ని తెలుసుకోవడమే మన బలం
- గాంధీజీ

క్షమించడం వల్ల గతం మారకపోవచ్చుగానీ భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది
- చాణక్యుడు

ఆలోచనల్ని నిశ్చలంగా ఉంచుకోలేకపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం
- గాంధీజీ

నిర్లక్ష్యమే నీ నిజమైన శత్రువు
- రమణ మహర్షి

ఓటమి ఎరుగని వ్యక్తికన్నా, విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు
- ఐన్‌స్టీన్‌

గెలుపు నీడలాంటిది, వెలుగువైపు మన అడుగులు పడినప్పుడు దానంతట అదే మన వెంట వస్తుంది.
- అబ్దుల్‌ కలాం

ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది
- ఎమర్సన్‌

గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం, అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగడం వివేకవంతుల లక్షణం
- ఫ్రాంక్లిన్‌

మనకు చదవడం తెలియాలేగానీ ప్రతి మనిషీ ఓ పుస్తకమే
- చాణక్యుడు

మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది
- స్వామి వివేకానంద

మంచితనమే హుందాతనానికి నిదర్శనం
- టెన్నిసన్‌

చేదు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడటం, జీవితంలో వచ్చే మార్పునకు భయపడటం సరికాదు
- మార్క్‌ ట్వైన్‌

డబ్బుతో కొనే వస్తువుల్ని కొనడం మంచిదేగానీ, దానితో కొనలేని వస్తువుల్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు
- షేక్‌స్పియర్‌

పొగిడితే చిన్నగా నవ్వి వదిలేసేవాడు, తిడితే మౌనంగా ఉండేవాడు ఉత్తముడు
- గాంధీజీ

స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు, ఇతరులపై ఆధారపడిన వాడు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటాడు
-  కన్‌ఫ్యూషియస్‌

రోజూ కొన్ని క్షణాలు పిల్లలతో గడపడం అనేదే తండ్రి తన పిల్లలకు ఇవ్వగల అతి ఉత్తమమైన వారసత్వం
- ఒ.ఎ.బటిస్టా

ఇతరుల గురించి మంచిగా మాట్లాడితే నీ గురించి మంచిగా మాట్లాడుకున్నట్టే 
- స్వామి వివేకానంద

స్వర్గం అంటే మరింకేం కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండే వారి మనసు
- రామకృష్ణ పరమహంస

మౌనానికి ఉన్న శక్తి మహత్తరమైనది, దాని నుంచే గొప్ప ఆలోచనలు, నిర్ణయాలు పుడతాయి
- మదర్‌ థెరెసా

గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి
- వినోబాభావే

మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వమే, దాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే
- స్వామి వివేకానంద

అన్నింటికన్నా గొప్ప వరం ఆనందంగా ఉండగలగడమే
- కబీర్‌

మనం ఇష్టంగా చేసే పనికి, సమయం లేకపోవడం అంటూ ఉండదు
- అబ్రహాం లింకన్‌

మనకు ఒక్క సమస్యా లేదంటే మనం జీవితంలో ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం
- ప్లేటో

ఉత్తమ వ్యక్తి ఆలోచనలు ఎప్పుడూ వృథాకావు
-గాంధీజీ

నేను సత్యాన్ని తప్ప మరొకటి పలకలేను, ఎవరినో సంతృప్తి పరచడం కోసం నా విధి నిర్వహణలో వెన్ను చూపలేను
- సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

ద్వేషంతో రగిలిపోయే మనిషి రోగితో సమానం
- ఫ్రాంక్లిన్‌

మన ఆలోచనల్ని  ఆదర్శాలతో నింపుకోవాలి, ఎప్పుడూ వాటినే స్మరించాలి, అప్పుడే అద్భుతాలు సాధించగలం
- స్వామి వివేకానంద

మనం ఒక రోజు అబద్ధం ఆడితే అది మనల్ని రేపూ అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తీసుకొస్తుంది
- శ్రీశ్రీ

సంతోషమంటే ఆరోగ్యంగా ఉండటం, చేదు జ్ఞాపకాలను మరిచిపోవడమే
- ఎమర్సన్‌

ఒత్తిడిలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం, కోపంలో సమాధానమివ్వడం.. చేయకూడని పనులు
- కబీర్‌

సహనం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు
- బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌

లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించగల వ్యూహ నైపుణ్యమూ ఉండాలి
- అబ్దుల్‌ కలాం

అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలవంతుడు వేరొకరు ఉండరు
- మదర్‌ థెరెసా

ఓటమి గురువు లాంటిది, ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో నేర్పుతుంది
- ప్లేటో

ఎదురుదెబ్బ తగిలినప్పుడు నిరాశ పడకూడదు, జీవితం మనకేదో నేర్పేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించాలి
- హెన్రీ ఫోర్డ్‌

మంచి ఆలోచనలు, ఆశలే గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి
- టెన్నిసన్‌

క్షమించడం వల్ల గతం మారిపోక పోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక మారుతుంది నీకు అనుకూలంగా
- ఫ్రాంక్లిన్‌

సత్యమనేది మహావృక్షం లాంటిది, దానికి మనం నీళ్లు పోసి పెంచితే అది ఎన్నో పూలు, పండ్లు మనకు ఇస్తుంది
- గాంధీజీ

మీకు సంతోషాన్ని కలిగించేది మీరున్న స్థానం కాదు, మీ స్వభావం
- ఎమర్సన్‌

సాధ్యంకానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదు
- స్టీవ్‌ జాబ్స్‌

మంచి కోసం చేసే ప్రయత్నంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది
- చార్లెస్‌ డార్విన్‌

జీవితం అంటేనే మనల్ని మనం నిర్మించుకోవడం, అది ఎలాగన్నది మన చేతుల్లోనే ఉంటుంది
- మార్టిన్‌ లూథర్‌ కింగ్‌

మీ ప్రవర్తనతో ఇతరులు మిమ్మల్ని అంగీకరించేలా చేయండి
- గాంధీజీ

ఎదురు గాలిలో గాలిపటం పైకి లేచినట్లే, విమర్శలు మనలో సాధించాలన్న తపనను పైకి లేచేలా చేస్తాయి
- మార్క్‌ ట్వైన్‌

మనిషి పతనానికి కారణం భయమే
- స్వామి వివేకానంద

మనం చేసిన పని అద్భుతంగా ఉండాలంటే దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి
- ఐన్‌స్టీన్‌

ఏదీ తనంతట తాను మన దరికి చేరదు, శోధించి సాధించాలి
- శ్రీశ్రీ

లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఓటమికి చేరువైనట్లే
- అరిస్టాటిల్‌

అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం
- చానింగ్‌

ఓటమిని అంగీకరించటంలో ఏ మాత్రం తప్పులేదు, అలా అంగీకరించటాన్నే గెలుపుతో సమానంగా భావించాలి
- గాంధీజీ

మనలో నిజాయతీ ఉన్నప్పుడు అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది
- ఆల్‌ఫ్రెడ్‌ టెన్నిసన్‌

మనల్ని శక్తిమంతులుగా మార్చేది మన ఏకాగ్రతే
- రూజ్‌వెల్డ్‌

ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్లాలి
- హెలెన్‌ కెల్లర్‌

తమను ఇబ్బంది పెట్టిన వారిపై బలహీనులు పగను పెంచుకుంటారు, బలవంతులు క్షమించగలుగుతారు, తెలివైన వారు వేటినీ పట్టించుకోకుండా మసలుకోగలుగుతారు
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే
- గాంధీజీ

ఏం సాధించాలన్నా ముందు మనకు కావాల్సింది మానసిక, శారీరక ఆరోగ్యం
- కాళిదాసు

విజయం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు, విలువలున్న వ్యక్తిగా ఎదగడమూ ముఖ్యమే
- అబ్దుల్‌ కలాం

అపనమ్మకంతో పని మొదలుపెట్టవద్దు, ఎందుకంటే మనపై మనకున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు.
-షేక్స్‌పియర్‌

ఒక వస్తువు మన దగ్గర లేదు అనే భావన మనలోకి రాకుండా చేసుకోవడమే స్వీయ నియంత్రణ
- జార్జ్‌ బెర్నార్డ్‌ షా

చెడును ఎత్తి చూపడం కాదు, దాని స్థానంలో మంచిని తెప్పించగలగడమే సంస్కరణ
- రాజా రామ్మోహన్‌రాయ్‌

అవకాశం నీ తలుపు తట్టనప్పుడు ఆ పరిస్థితిని నువ్వే కల్పించుకోవాలి
- మార్క్‌ ట్వైన్‌

అందరికీ రెండు రకాల విద్య అవసరం, ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండోది ఎలా జీవించాలో నేర్పేది
- నెల్సన్‌ మండేలా

ఓటమి చేదుగానే ఉండొచ్చుగానీ ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం మాత్రం చాలా అమూల్యమైనది, భవిష్యత్తులో అదే మనకు విజయాన్నందించేది
- అబ్రహాం లింకన్‌

ఎవరూ చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావం
- ఎమర్సన్‌

శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి
- చాణక్యుడు

తమలోని చెడ్డ లక్షణాలతో పోరాడి గెలిచేవారు జీవితంలో ఎప్పటికీ విజేతలే
- ఎపిక్టేటస్‌

నీకు అవసరం లేకపోయినా అన్నీ కొంటూ పోతే అవసరం అయిన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది
- వారెన్‌ బఫెట్‌

గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు
- రూజ్‌వెల్డ్‌

మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు, అది నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది
- బ్రూస్‌లీ

తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాకపోవడమే ఉత్తమం
- రామకృష్ణ పరమహంస

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి
- గాంధీజీ

మన తీరు మన ఎదుగుదలకు మూలం, మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది
- నెల్సన్‌ మండేలా

ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలదు
- మదర్‌ థెరెసా

తన మీద తనకు విశ్వాసం ఉన్న వారు బలవంతులు, సందేహాలతో సతమతమయ్యే వారు బలహీనులు
- స్వామి వివేకానంద

అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు
- గాంధీజీ

తీరిక లేకుండా మంచి పనుల్లో నిమగ్నమై ఉండేవారు నిత్యం సంతోషంగా ఉంటారు
- ఫ్రాంక్లిన్‌

అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం
- రూసో

సమయాన్ని సరిగా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి
- ఎమర్సన్‌

ఏం కోల్పోయినా ఫర్వాలేదుగానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు, ఎందుకంటే అదొక్కటి ఉంటే కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చు
- స్వామి వివేకానంద

ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో అక్కడ మనిషి పతనమూ ప్రారంభం అవుతుంది
- రామకృష్ణ పరమహంస

జీవితంలో అవకాశం ఒక్కసారే రాదు, చేజారిన అవకాశం గురించి ఆలోచించకుండా కొత్త అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ఎదుగుదల ఆధారపడుతుంది
- మార్టిన్‌ లూథర్‌ కింగ్‌

మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే, కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేం
- అబ్దుల్‌ కలాం

నడవకుండా కూర్చుంటే గమ్యం దరిచేరదు, అలాగే ప్రణాళిక లేకుండా పని చేస్తే ఫలితం ఉండదు
- రూజ్‌వెల్డ్‌

మనిషి పతనానికి అతి ముఖ్యమైన కారణం సోమరితనమే
- అబ్రహాం లింకన్‌

ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారిని చూసి శత్రువు కూడా తలదించుకుంటాడు
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

సంతృప్తిగలవాడు నిత్య సంపన్నుడు, అత్యాశాపరుడు ఎప్పటికీ పేదవాడు
- రామకృష్ణ పరమహంస

డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చుచేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల  మన వ్యక్తిత్వం దెబ్బ తింటుంది.
- గాంధీజీ

మంచి అలవాట్లున్న వ్యక్తికి విలువ పెరుగుతూ వెళుతుంది, దురలవాట్లున్న వారికి విలువ దిగజారుతూ ఉంటుంది
- కబీర్‌

శ్రద్ధగలవాడు మాత్రమే విద్యల్లో నేర్పు పొందగలడు
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

వ్యతిరేక స్వభావం గల  మనుషులకు దూరంగా ఉంటే మనకొచ్చే సమస్యలూ చాలా వరకూ తగ్గుతాయి
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

జీవితం నీకు విజయాలనందించదు కేవలం అవకాశాలనిస్తుంది, అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లో ఉంటుంది
- అబ్దుల్‌ కలాం

సోమరితనం మనిషి పతనానికి కారణం, దాన్ని విడిచి ప్రతి విషయాన్నీ సమగ్రంగా నేర్చుకోవాలనుకునేవారు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటారు
- రామకృష్ణ పరమహంస

ఓర్పును అలవరుచుకోవడం మొదట కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత దాని ఫలితాలు గొప్పగా ఉంటాయి
- కన్‌ఫ్యూషియస్‌

జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు, ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి మనం కలత చెందాల్సిన అవసరం రాదు
- రమణ మహర్షి

కష్టం వచ్చిందని బాధపడకు, ఎందుకంటే అది మనలో సహనం, పట్టుదలల్ని పెంచుతుంది
- గాంధీజీ

మన శక్తి సామర్థ్యాల్ని పెంపొందించుకునేందుకే ఎప్పుడూ ప్రయత్నించాలి తప్ప ఈ విషయంలో సంతృప్తి చెందకూడదు
- అబ్రహాం లింకన్‌

ఏళ్ల తరబడి నీటిలో ఉన్నా రాయి మెత్తబడదు, అలాగే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు
- స్వామి వివేకానంద

అన్ని సంపదల కన్నా సంతృప్తి ఉత్తమమైనది 
- బుద్ధుడు

గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం వర్తమానాన్ని వ్యర్థం చేస్తాయి
- కన్‌ఫ్యూషియస్‌

తాత్కాలికంగా వచ్చే కష్టాలు భవిష్యత్తులో మన మంచి కోసమే అని తలచే వారు ఎప్పుడూ బాధపడరు.
- కబీర్‌

విశ్వాసం పోగొట్టుకోవడమే అన్నింటికన్నా పెద్ద నష్టం
- అబ్రహాం లింకన్‌

మనిషి విలువ మాటల్ని బట్టి కాక, చేతల్ని బట్టి  నిర్ణయమవుతుంది
- నెల్సన్‌ మండేలా

సంతృప్తే సంపద, ఆరోగ్యమే ఆనందం, ఇవి రెండూ ఉన్న వారు ఎప్పుడూ ధనవంతులే
- ఫ్రాంక్లిన్‌

బద్ధకమే ప్రధమ శత్రువు, దాన్ని దరి చేరనివ్వ కూడదు
- గాంధీజీ

ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడం ఉత్తమం
- స్వామి వివేకానంద

ఆయుధాలకన్నా కోపం చాలా ప్రమాదకరమైనది
- రమణమహర్షి

ఇతరులతో పోలిక ఎక్కువయ్యేకొద్దీ మనకు దుఃఖమూ పెరుగుతుంది
- రూజ్‌వెల్డ్‌

లక్ష్యం ఏర్పరుచుకోవడమే కాదు, 
దాన్ని తొందరగా చేరుకోవడానికి అవసరమైన వ్యూహమూ ముఖ్యమే
 - అబ్దుల్‌ కలాం

మనం స్వచ్ఛంగా ఉండటమే దైవ గుణం
- శారదా దేవి

జ్ఞానం వల్ల మిత్రులు, వైరం వల్ల శత్రువులు పెరుగుతారు
- కబీర్‌

చెడ్డవారితో సహవాసం, మాట విలువ తెలియని వారితో వాదన ఎప్పటికీ చెయ్యకూడని పనులు
- రాక్‌ఫెల్లర్‌

ఆత్మవిశ్వాసం మనిషికి పెట్టని ఆభరణం
- స్వామి వివేకానంద

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే
- అబ్రహాం లింకన్‌

నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే, అదే నీ విజయానికి మొదటి మెట్టు
- స్వామి వివేకానంద

మంచి పని చేయాలనుకున్నప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి
- గౌతమ బుద్ధుడు

సత్యమే దేవుడి రూపం
- రమణ మహర్షి

ప్రాణికోటిని, తోటి మనుషుల్ని ప్రేమగా చూడలేని వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు
- మార్టిన్‌ లూథర్‌కింగ్‌

ఏ ప్రాణికీ హాని కలిగించకుండా ఉండటమే ఉత్తమమైన ధర్మం
- బుద్ధుడు

మొక్క మొదలును వదిలి కొనలకు నీరు పోయడం ఎంతో, ప్రయత్నం లేకుండా విజయం కోసం పాకులాడటమూ అంతే
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోని కోపం, ద్వేషం.. లాంటి గుణాలే శత్రువులు
- రమణమహర్షి

నమ్మకమైన స్నేహితుడు దైవానికి ప్రతిరూపం
- నెపోలియన్‌

ప్రతిఫలం ఆశించకుండా చేసే మేలు సముద్రం కంటే గొప్పది
- మదర్‌ థెరెసా

వర్షానికి భయపడి పక్షులన్నీ గూటిని వెతుక్కుంటాయి, గద్ద మాత్రం మేఘాల పై వైపు ఎగురుతుంది, విజేత ఆలోచన తీరు అలానే ఉంటుంది
- అబ్దుల్‌ కలాం

సలహా ఎదుటివారిని సంతోషపెట్టేదిగా ఉండకూడదు, వారికి సహకరించేదిగా ఉండాలి
- ఎవర్సన్‌

ఆశను ఎప్పుడూ వదలకు, జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే
- ఫ్రాంక్లిన్‌

ఆశను ఎన్నడూ విడనాడకూడదు, జీవితంలో మనల్ని నిలిపేది అది ఒక్కటే
- హెలెన్‌ కెల్లర్‌

ఆత్మ విశ్వాసం, నిగ్రహం, జ్ఞానం  అనే మూడు అంశాలే జీవితాన్ని  ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి
 - రూజ్‌వెల్డ్‌

తనకు లేని వాటి కోసం విచారించక, తనకు ఉన్నవాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు
- రమణ మహర్షి

విజయం అంతిమ లక్ష్యమూ కాదు, ఓటమే అంతిమమూ కాదు, రెండుసార్లూ ఎంత సమతూకంగా ఉండగలుగుతున్నామన్నదే మనలోని బలానికి నిదర్శనం
- అబ్రహాం లింకన్‌

నాకెప్పుడూ ఓటమి లేదు, ఎందుకంటే చేసే పనిలో వస్తే విజయం వస్తుంది, లేకపోతే ఏ తప్పులు చేయకూడదో తెలిపే పాఠం లభిస్తుంది
- నెల్సన్‌ మండేలా

విజయం సాధించాలనే మీ సంకల్పమే అన్నింటికన్నా ముఖ్యం, అనుక్షణం దీన్ని గుర్తు చేసుకోవడమే విజయ రహస్యం
- బ్రూస్‌లీ

ఉన్నత లక్ష్యాల్ని ఏర్పర్చుకో, అత్యున్నతమైనవి సాధించాలని గాఢంగా కోరుకో
- స్వామి వివేకానంద

జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది
- ఎమర్సన్‌

నైపుణ్యం అనేది ఎప్పుడూ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం, ఏకాగ్రత వల్లే అలవడుతుంది
- బ్రూస్‌లీ

పట్టుదల, క్రమశిక్షణలతో పనిచేస్తే తగిన ఫలితాన్ని సాధిస్తాం
- ఫ్రాంక్లిన్‌

అత్యంత అదృష్టవంతులు ఎవరంటే అభినందించడం తప్ప అసూయపడటం తెలియనివారు
- కన్‌ఫ్యూషియస్‌

గొప్ప ఆరోగ్య రహస్యం ఏమిటంటే ఆనందంగా పనిచేయడమే
- సరోజినీ నాయుడు

అజ్ఞానం అహంకారానికి దారి తీస్తుంది, అహంకారం మనల్ని మరింత అధోగతి పాలు చేస్తుంది
- స్వామి వివేకానంద

ఇతరుల తప్పుల్ని క్షమించడం, మరిచిపోవడం మంచితనానికి నిదర్శనం
- హెన్రీ ఫోర్డ్‌

విజయాన్ని అందించేది మనలోని సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది మన నడవడిక
- రూసో

చెయ్యాలి కాబట్టి చేసే పని కంటే ఇష్టపడి చేసే పని వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది
- రూజ్‌వెల్డ్‌

జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి
- హెన్రీ ఫోర్డ్‌

ఇతరులు చేసే ఏ పని వల్ల మనకు బాధ కలుగుతుందో ఆ పనిని మనం ఎప్పటికీ చేయకూడదు
- హెలెన్‌ కెల్లర్‌

అసంతృప్తికి మూలకారణం ఇతరులతో పోల్చుకోవడమే
- ఎమర్సన్‌

మంచి పని చేయడానికి కావాల్సింది డబ్బు కాదు మంచి మనసు, దృఢ సంకల్పం
- మదర్‌ థెరెసా

కదలని నీరు స్వచ్ఛతను కోల్పోయినట్లే బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది
- ఫ్రాంక్లిన్‌

విజేత వెనక ఉండేది అదృష్టం ఒక్కటే కాదు, కఠిన శ్రమ, అంకిత భావం కూడా
- మార్క్‌ ట్వైన్‌

జీవితంలో సంతృప్తి పడే వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు
- బుద్ధుడు

ఏదైనా విషయం గురించి కలలు  కనడం సులభం,  చాలా కఠినంగా  కష్టపడితేనే దాన్ని సాధించుకోగలం
- నెల్సన్‌ మండేలా

మనల్ని చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ల కన్నా కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న 
- రామకృష్ణ పరమహంస

తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు
- స్వామి వివేకానంద

నీవు సంతోషంగా ఉండు,దాన్ని నలుగురితో పంచుకో,
అదే అసలైన సంతోష రహస్యం
- బుద్ధుడు

పుస్తకం గొప్పతనం అందులో ఉన్న విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ప్రేరణపై ఆధారపడి ఉంటుంది
- గాంధీజీ

అబద్ధం మనలో తప్పించుకునే ధోరణిని పెంచితే, నిజాయతీ మనలో దేన్నైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది
- రూజ్‌వెల్ట్‌

నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే మంచి విద్యార్థులను తయారు చేయగలడు
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

భవిష్యత్తు అంటే... మనకు ఎదురయ్యే కాలంగా కాదు, మనం సృష్టించుకున్న కాలంగా ఉండాలి
- అబ్రహాం లింకన్‌

అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి, ఎందుకంటే అవే భవిష్యత్తులో మనమేం చేయకూడదో తెలిపే పాఠాలు
- అబ్దుల్‌ కలాం

ద్వేషాన్ని పోగొట్టేది ద్వేషం కాదు, ప్రేమ మాత్రమే
- గౌతమ బుద్ధుడు

ఒక రోజు నవ్వకుండా ఉన్నామంటే ఆ రోజంతా వ్యర్థమైనట్లే....
- చార్లీచాప్లిన్‌

లక్ష్యంపై అంకితభావం ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ పనిని ముందుకు నడిపించగలరు
- అంబేడ్కర్‌

చీకట్లో ఉన్నామనుకోవడం కన్నా వెలుతురు కోసం అన్వేషించడం మేలు
- అరిస్టాటిల్‌

బలహీనులం అనే మాటను ఆలోచనల్లోకే రానీయకండి,  ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని మించిన బలం మనలో ఇంకేం ఉండదు
- ఫ్రాంక్లిన్‌

తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే ఆ అజ్ఞానం జీవితాంతం మనలోనే ఉండిపోతుంది
- మార్టిన్‌ లూథర్‌కింగ్‌

తప్పును ఒప్పుకొంటే దాన్ని సగం సరిదిద్దుకున్నట్లే
- వాగ్నర్‌

అహం వల్ల ఏర్పడే అంధకారం, అసలు చీకటి కన్నా భయంకరమైంది
- గాంధీజీ

లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగం
- జవహర్‌లాల్‌ నెహ్రూ

గతం నుంచి ఏ గుణపాఠాన్నీ నేర్చుకోలేని వారు భవిష్యత్తులోనూ కష్టపడాల్సిందే
- షేక్‌స్పియర్‌

ప్రపంచంలో అన్నింటికన్నా కష్టమైన విషయం ఏంటీ అంటే... ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే
- సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌

మంచి పని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది
- ఎమర్సన్‌

దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి
- అంబేడ్కర్‌

ఎంతటి విషమ పరిస్థితులెదురైనా మంచితనం, మానవత్వాలపై నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు
- రామకృష్ణ పరమహంస

విజయం ప్రయాణమేగానీ గమ్యం కాదు
- బ్రూస్‌లీ

బలవంతులకు అదృష్టంపై కన్నా తాము చేస్తున్న పని మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది
- స్వామి వివేకానంద

సంతోషంగా జీవించేందుకు సులభమైన మార్గం నిజాయతీగా ఉండటమే
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

సామాన్యుడు అవకాశం కోసం ఎదురుచూస్తాడు, ఉత్సాహవంతుడు అవకాశం కల్పించుకుంటాడు 
- రూసో

మన ప్రవర్తనే మిత్రుల్ని, శత్రువుల్ని తెచ్చిపెడుతుంది
- ఎమర్సన్‌

మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ కించపరచలేరు
- ఫ్రాంక్లిన్‌

ఓర్పు చేదుగానే ఉంటుందిగానీ  దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది
- రాబర్ట్‌ ఫ్రాస్ట్‌

శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

జీవితంలో వైఫల్యాలూ భాగమని భావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాం.
- అబ్దుల్‌ కలాం

లేని వాటిని గుర్తు తెచ్చుకుని బాధపడటం కంటే ఉన్న వాటిని గుర్తుచేసుకుని ఆనందంగా ఉండగలగడమే తెలివైనవారి లక్షణం
- రామకృష్ణ పరమహంస

ఆటంకాలెదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చెయ్యాలనే పట్టుదలను పొందాలి
- బ్రూస్‌లీ

విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసేవారు ఎన్నడూ ఆ పనిని పూర్తి చేయలేరు
- ఫ్రాంక్లిన్‌

దేన్నీ కొత్తగా ప్రయత్నించని వారే ఏ పొరపాట్లూ చెయ్యరు
- రూజ్‌వెల్డ్‌

ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు, విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు
- కన్‌ఫ్యూషియస్‌

మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది
- హెలెన్‌ కెల్లర్‌

ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపినవాడే నిజమైన బలశాలి
- గాంధీజీ

దానం చేయని ధనం, సంస్కారం లేని చదువు వ్యర్థం
- వేమన

జీవితంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నిజాయతీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే
- స్టీవ్‌ జాబ్స్‌

మనిషికి తృప్తి తనకున్న సంపద విషయంలో ఉండొచ్చుగానీ విజ్ఞానం విషయంలో ఉండకూడదు
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

బాధ్యతగా జీవించినప్పుడే మనం, మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటాం
- రూజ్‌వెల్డ్‌

ఒకరి నుంచి సాయం అందుకున్నప్పటి సంతోషంకన్నా వేరొకరికి సహాయం అందించడంలో ఉన్న తృప్తే మిన్న
- మదర్‌ థెరెసా

విజేత అయిన ప్రతి వ్యక్తి వెనకా కష్టం ఉంటుంది, కష్టం విజయంతోనే ముగుస్తుంది
- బ్రూస్‌లీ

సాధించిన విజయం కన్నా దాని కోసం నిబద్ధతతో చేసే ప్రయత్నం చాలా గొప్పది 
- గౌతమ బుద్ధుడు

పరిస్థితులు ఎలా ఉన్నా మనం మనలా ఉండగలగడమే మన బలం
- నెల్సన్‌ మండేలా

అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు
- మదర్‌ థెరెసా

విజయానికి ఒకే ఒక్క మార్గం మరొక్కసారి ప్రయత్నించడమే
- ఎమర్సన్‌

అసమర్థులకు అడ్డంకులుగా అనిపించేవే సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి
- కన్‌ఫ్యూషియస్‌

పనిలో ప్రతిసారీ సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు
- ఫ్రాంక్లిన్‌

వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం
- ఆస్కార్‌ వైల్డ్‌

ఆందోళన మనిషిని బలహీనుడిని చేస్తుంది
- మార్క్‌ ట్వైన్‌

మన ఆత్మవిశ్వాసానికి కృషి తోడైతే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు
- రూజ్‌వెల్డ్‌

ఎదుటి మనిషినైనా, చేసే పనినైనా ప్రేమతోనే చూడండి, అది మీ జీవితాన్ని అత్యంత సంతోషంగా ఉంచుతుంది 
- మదర్‌ థెరెసా

నువ్వు సాధించగలవు అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే  నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు 
- స్వామి వివేకానంద

మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తుకై శ్రమించు 
- మదర్‌ థెరెసా

నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే 
- అబ్దుల్‌ కలాం

ఆశించడం వల్ల కాకుండాఅర్హత సాధించడం వల్లనే దేన్నయినా పొందగలం
- ఎమర్సన్‌

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది 
- రామకృష్ణ పరమహంస

మనిషి తన చేతలతోనే గొప్పవాడవుతాడు, జన్మతః కాదు 
- చాణక్యుడు

జీవితం సవాళ్లను విసురుతూనే ఉంటుంది, ఎలా తప్పించుకోవాలని అనుకోవడం కన్నా దానిపై ఎలా పైచేయి సాధించాలో ఆలోచిస్తే మనం మరింత బలవంతులం అవుతాం 
- కన్‌ఫ్యూషియస్‌

మనిషి తన చేతలతోనే గొప్పవాడవుతాడు, జన్మతః కాదు 
- చాణక్యుడు

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది 
- రామకృష్ణ పరమహంస

ఉన్నత వ్యక్తిత్వం ఉంటే, శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు 
- ఐన్‌స్టీన్‌

మన బలాబలాల్ని గుర్తించగలగడంపైనే మన విజయాలు ఆధారపడి ఉంటాయి 
- ఫ్రాంక్లిన్‌

విజయానికి తొలి మెట్టు మనపై మనకు విశ్వాసం ఉండటమే 
- స్వామి వివేకానంద

విజయానికి తొలి మెట్టు మనపై మనకు విశ్వాసం ఉండటమే 
- స్వామి వివేకానంద

కష్టాలు మన శత్రువులు కావు, మన బలాబలాల్ని తెలిపే నిజమైన మిత్రులు 
- రూసో

చేసిన తప్పునకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు, ఎదుటివారి తప్పును క్షమించగలిగిన వాడు గొప్పవాడు 
- థామస్‌ జెఫర్సన్‌

ఇతరుల్లోని దోషాల్ని వెతికే కొద్దీ మన మనసు దోషపూరితమవుతుంది 
- మదర్‌ థెరెసా

మాటలు వాదనగా మారినప్పుడు అన్నింటికంటే మౌనమే మిన్న 
- ఎమర్సన్‌

అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం 
- బుద్ధుడు

మన ప్రయత్నం ఆపనంత వరకూ మనం గెలుపు ముంగిట ఉన్నట్లే 
- రూసో

సోమరితనం కష్టాల్ని తెచ్చిపెడితే శ్రమ వాటిని దూరం చేస్తుంది 
- రస్సెల్‌

మన ప్రవర్తనే మనకు మిత్రులు, శత్రువుల్నీ నిర్ణయిస్తుంది 
- రూజ్‌వెల్డ్‌

మనకు చాలా విజ్ఞానం ఉందని గర్వించడం అంతటి అజ్ఞానం మరోటి లేదు 
- ఫ్రాంక్లిన్‌

పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి, విజయం నుంచి వినయాన్ని అలవర్చుకోవాలి 
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

నిరాశ, దురాశ.. రెండూ పతనానికి హేతువులు 
- ఎమర్సన్‌

సాధ్యం కాదన్న భావన మనసులోంచి తొలగడమే విజయపథంలో తొలి అడుగు 
- అబ్దుల్‌ కలాం

సంకల్ప బలం ఉన్నవారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోగలరు 
- నేతాజీ

నీతిగా సంపాదించడం, నియమంగా బతకడమే ఉత్తమమైన జీవితం
- మార్క్‌ ట్వైన్‌

గొప్ప త్యాగాల ద్వారానే గొప్ప పనులు సాధ్యమవుతాయి 
 - ఈస్ట్‌ఉడ్‌

మనిషి పతనానికి కోపమే మొదటి కారణం 
- శారదాదేవి

గొప్ప ఆదర్శాలు మనిషిని గొప్పవాడిని చేస్తాయి 
- వినోబా భావే

ఓర్పుతోపాటు నేర్పు ఉన్న వారికి ఏ పనిలోనైనా విజయం తథ్యం 
- విలియం షేక్‌స్పియర్‌

మనం చేసే పనులు మంచివో, చెడ్డవో ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేవి మన జయాపజయాలే
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ఏ దుఃఖమైనా తాత్కాలికమే, దాన్ని గుర్తించినప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంచుకోగలం
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఇతరులతో పదే పదే మనల్ని పోల్చుకోవడమంటే  అసూయను, అహంకారాన్ని ఆహ్వానించడమే 
- మార్క్‌ ట్వైన్‌

కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి
- అబ్దుల్‌ కలాం

మితిమీరి ఆశపడే వారే ఎక్కువగా మోసాలకు గురవుతుంటారు 
- అరిస్టాటిల్‌

ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు వంటిది 
- బ్రూస్‌లీ

పదునైన ఆయుధంకంటే క్షణ కాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం
- రామకృష్ణ పరమహంస

నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేదు 
- బుద్ధుడు

ఆదర్శవంతమైన జీవితానికి ఉత్తమ గ్రంథాలు, ఉత్తమ మిత్రులు ఎంతో అవసరం
- గాంధీజీ

విలువ కోసం అది లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది
- రస్సెల్‌

గొప్ప విజయానికి అసలు రహస్యం ఆత్మవిశ్వాసమే 
- ఎమర్సన్‌

బంగారం నాణ్యత అగ్నిలో తెలిసినట్లే ఎదుటివారి మంచితనం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది 
- మదర్‌ థెరెసా

ఒకరిని ఓడించడం సులభమేగానీ ఒకరి మనసు గెలవడమే చాలా కష్టం
- అబ్దుల్‌ కలాం

గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు
- స్వామి వివేకానంద

సాధించాలనే తపన... మన లోపాలు, బలహీనతల్ని  అధిగమించేలా చేస్తుంది
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

పరిస్థితుల్ని చూసి పారిపోకూడదు, ఎదురు నిలబడినప్పుడు సమస్య ఏదైనా చిన్నబోతుంది
- బ్రూస్‌లీ

మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటివాళ్ల దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా శత్రువే
- ఓల్టేర్‌

చేదు అనుభవాలకు మందు వాటిని మరిచిపోవడమే
- ఎమర్సన్‌

లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు ఎంతటి కష్టాన్నైనా  స్వీకరించవచ్చు, ఎందుకంటే వచ్చే ప్రతిఫలం అంతే విలువైనది 
- సిసిరో

ఉత్తమంగా మనం జీవించాలనుకుంటే  అందుకు తగ్గ ప్రయత్నమూ చేయాల్సిందే
- మార్టిన్‌ లూథర్‌కింగ్‌

సంజాయిషీలు ఇచ్చుకుంటూ పోతే సమయం వృథా. ఎందుకంటే మీరేంటో తెలిసిన వాళ్లకి అది అవసరం లేదు, తెలియని వాళ్లకి చెప్పనవసరం లేదు
- జార్జ్‌ బెర్నార్డ్‌ షా 

ప్రకృతి, కాలం, సహనం.. ఇవి ఏ గాయాన్నైనా మాన్పగలవు
- ఆది శంకరాచార్యులు

మనలోని అహంకారం చివరికి మనల్ని భగవంతుడి నుంచీ దూరం చేస్తుంది, అందుకే అది దరిచేరకుండా చూసుకోవాలి
- అబ్దుల్‌కలాం

కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మనం చేసే పనులన్నీ గొప్పవే  కాకపోవచ్చు, కానీ వాటన్నింటినీ అత్యంత శ్రద్ధతోనే చేయాలి.
- రూజ్‌వెల్డ్‌

మనిషికి ఆభరణం మంచి వ్యక్తిత్వమే, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ఆభరణాన్ని మనం చేజార్చుకోకూడదు
- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

మన ఆలోచనల్ని ఏ వ్యక్తి దగ్గర నిర్మొహమాటంగా బహిర్గతం చేయగలమో వారే మనకు నిజమైన మిత్రులు
- ఎమర్సన్‌

సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు, నమ్మిన వారిని మోసగించొద్దు
- భర్తృహరి

ఏ పనినైనా ప్రేమతో చేసి చూడండి, అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది
- మదర్‌ థెరెసా

జీవితంలో బాధ పడవలసిన విషయం ఏదీ లేదు, దాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం
- రమణ మహర్షి

పుట్టుకతో ఎవరూ గొప్పవారు కారు, వారు చేసే పనులే వారిని ఉన్నతంగా నిలబెడతాయి
- చాణక్యుడు

మనిషి ఔన్నత్యానికి కొలమానం మేధస్సు కాదు హృదయం
- మదర్‌ థెరెసా

విద్య అనే వృక్షంలో వేళ్లు  చేదుగా అనిపించొచ్చేమోగానీ అది అందించే ఫలాలు మాత్రం చాలా మధురం
- అరిస్టాటిల్‌

సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడం మన వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో కీలకం
- రామకృష్ణ పరమహంస

ఇతరుల్ని జయించడం కంటే తనని తాను జయించడం చాలా కష్టమైన పని
- గౌతమ బుద్ధుడు

నిరంతరం శ్రమించేవారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది
- ఎమర్సన్‌

కోపంతో మాట్లాడటం వల్ల సద్గుణాన్ని కోల్పోతాం, ఆలోచించి మాట్లాడినప్పుడే ప్రత్యేకతతో జీవించగలం
- వివేకానందుడు

సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా ఉండలేడు
- రామకృష్ణ పరమహంస

మౌనం అత్యంత శక్తిమంతమైన ప్రసంగం, అయితే అది ప్రపంచానికి నిదానంగా వినపడుతుంది
- గాంధీజీ

ప్రపంచాన్ని మార్చగల శక్తిమంతమైన ఆయుధం చదువొక్కటే
- నెల్సన్‌ మండేలా

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి
- రామకృష్ణ పరమహంస

ఏడాదికి ఓ చెడు అలవాటు మానితే, కొంత కాలానికి చెడ్డవాడు కూడా మంచివాడిగా మారగలడు
- ఫ్రాంక్లిన్‌

విజయం అంతిమ లక్ష్యమూ కాదు, ఓటమి శాశ్వతమూ కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఉండగలగడమే మన గొప్పతనం
- బ్రూస్‌లీ

తప్పు చేశారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూ పోతే మన చుట్టూ ఎవరూ మిగలరు
- హెలెన్‌ కెల్లర్‌

నిరాడంబరత స్నేహితుల్ని పెంచితే గర్వం శత్రువుల్ని పెంచుతుంది
- ఎమర్సన్‌

ఒకరిని ఎంతకాలమైతే మనం అనుకరిస్తూ ఉంటామో, అంతకాలం మనం సొంత ఆలోచనను కోల్పోతాం
- అబ్రహాం లింకన్‌

పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించడం కన్నా ఆచరిస్తే మంచిది, ఎందుకంటే అమ్మానాన్నలు ఆచరించిందే చిన్నారులు అనుకరిస్తారు కాబట్టి
-బైబిల్‌

ఆశావాది తన శ్రమలో అవకాశాల్ని వెతుక్కుంటాడు, నిరాశావాది తనకొచ్చిన అవకాశాల్లోనూ శ్రమే ఉందనుకుంటాడు
- జాన్సన్‌

పుస్తకం గొప్పదనం అది మనకు అందించే విషయం మీద ఆధారపడి ఉండదు, మనకు అందించే ఆలోచన, ప్రేరణ  మీద ఆధారపడి ఉంటుంది
- గాంధీజీ

నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే...సమయాన్ని వృథా చేయొద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే
- బ్రూస్‌లీ

అణకువ లేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది 
- చాణక్యుడు

ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి
- లింకన్‌

ఇతరుల్ని మాటలతో గాయపరిచి తాము బలవంతులమని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు మానసికంగా అందరికంటే బలహీనులు
- మాథ్యూ ఆర్నాల్డ్‌

గెలవగలనని నమ్మకం లేనివాడు మానసికంగా ఆటకు ముందే ఓడిపోతాడు
- బ్రూస్‌లీ

ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు, మనకి అదంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుందంతే
- చర్చిల్

ఏం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసిన వాడు వివేకవంతుడు
- రామకృష్ణ పరమహంస

నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దు
- భగవద్గీత

విజయం మనల్ని ఊరికే వరించదు, దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, త్యాగం దాగుంటాయి
- పీలే

హృదయంలో నిజాయతీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది
- అబ్దుల్‌ కలాం

తక్కువ సంపాదించేవారికన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక సమస్యలు వస్తాయి
- గాంధీజీ

అధైర్యం ఆవహిస్తోందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంతమాత్రం ఉపేక్షించొద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదటికే మోసం
- చాణక్యుడు

లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే  నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది
- గౌతమ బుద్ధుడు

సరైన కారణాలే దృఢమైన పనులకు దారి తీస్తాయి
- షేక్‌స్పియర్‌

పని ఏదైనా.. అనుభవపూర్వకంగానే అందులో పట్టుసాధిస్తాం
- అరిస్టాటిల్‌

ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పనీ అయోమయంగా అనిపించదు
- ఎపిక్టీటస్‌

ఒకరికొకరు పంచుకోవడంలోనే గొప్ప ఆనందం ఉంది
- గౌతమ బుద్ధుడు

మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

మనిషి... పుట్టుకతో కాదు, చర్యల వల్లే గొప్పవాడవుతాడు
- చాణక్యుడు

భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి
- స్వామి వివేకానంద

నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు
- బుద్ధుడు

ఓటమి ఎరుగని వ్యక్తికన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న
- ఐన్‌స్టీన్‌

పని మొదలుపెడితే ఆపొద్దు, మధ్యలో వదలిపెట్టొద్దు, ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని.
- చాణక్యుడు

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ఆశ దుఃఖానికి కారణం, దాని నుంచి మనం దూరమైతే దుఃఖం మన దరిచేరదు
- గౌతమ బుద్ధుడు

ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీని వల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీమొదలుపెట్టొద్దు
- చాణక్యుడు

చేసే పని అద్భుతంగా ఉండాలంటే ముందు దానిని ప్రేమించడం నేర్చుకోవాలి
- ఐన్‌స్టీన్‌

నువ్వు ఎగరలేక పోతే పరిగెత్తు... పరిగెత్తలేకపోతే నడువు... నడవలేకపోతే ఏదైనా చెయ్యిగానీ ముందుకు వెళ్లడం మాత్రం ఆపకు
- మార్టిన్‌ లూథర్‌కింగ్‌


శిఖరాన్ని ఎక్కేప్పుడు ప్రతి అడుగూ జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే  ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు
- చాణక్యుడు

మనం మాట్లాడే ప్రతి మాటా ప్రేమతో నిండి ఉండాలి
- మదర్‌ థెరెసా

మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం
- స్వామి వివేకానంద

భయంతో పని చేస్తే విజయం సాధించలేం, వివేకంతో చేయడం వల్లే విజయం సొంతమవుతుంది
- సిసిరో

గెలుపు తపన దృఢంగా ఉన్న నిన్ను ఓటమి ఎప్పటికీ తాకలేదు
- అబ్దుల్‌ కలాం

శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి
- చాణక్యుడు

ఓటమి ఎన్నో విషయాల్ని నేర్పే గురువు
- సీవీ రామన్‌

నీతులు బోధించకూడదు, ఆచరణలో చేసి మాత్రమే చూపాలి
- గాంధీజీ

తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు, వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు
- గౌతమ బుద్ధుడు

కోపం తెచ్చుకొనే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు
- స్వామి వివేకానంద

నువ్వు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తీసుకువస్తుంది
- శ్రీశ్రీ

ఉన్నత లక్ష్యాల్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాల్ని దూరం చేసుకోవాల్సిందే
- సిసిరో

స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవారి మనస్సే 
- రామకృష్ణ పరమహంస

మన సుగుణం మనల్ని రాజును చేస్తే, మన మూర్ఖత్వం మనల్ని బానిసల్ని చేస్తుంది
- ఆస్కార్‌ వైల్డ్‌

మనస్ఫూర్తిగా పని చేయనివారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు
- అబ్దుల్‌ కలాం

మాట్లాడే విషయం గురించి పరిజ్ఞానం ఉండాలి, ఏం చెప్పాలనుకుంటున్నామో స్పష్టంగా చెప్పగలగాలి, అప్పుడే ప్రసంగంలో మన ముద్ర ఉంటుంది
- మాథ్యూ ఆర్నాల్డ్‌

ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లే విజేతలుగా నిలుస్తారు.
- రమణ మహర్షి

కాలాన్ని వృథా చేయొద్దు, ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపరుస్తుంది.
- షేక్‌స్పియర్‌

వైఫల్యం ఎదురైందని పయనం ఆపేయకు, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అక్కడి నుంచే  కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టు.
- జేమ్స్‌ బాల్డ్విన్‌

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు.
- అరిస్టాటిల్‌

మనం బలహీనులమని భావిస్తే బలహీనులమే అవుతాం, శక్తిని స్మరిస్తే శక్తిమంతులమవుతాం, అంతా ఆలోచనలోనే ఉంది.
- స్వామి వివేకానంద 

డబ్బు లేకపోవడం కాదు, సద్గుణాలు లేకపోవడమే నిజమైన పేదరికం
- షేక్‌స్పియర్‌

ఇతరులపై ద్వేషంతో రగిలిపోయే మనిషి రోగితో సమానం
- థామస్‌ జఫర్సన్‌

విజేత అవ్వాలంటే ఎవరినో ఓడించాల్సిన అవసరం లేదు, ముందు మనల్ని మనం గెలవాలి
- గౌతమ బుద్ధుడు

నువ్వు ఆచరించగలిగితేనే ఇతరులకు చెప్పు
- గాంధీజీ

మన తప్పులు ఎత్తి చూపేవాళ్లూ మనకు అవసరమే, మన అభివృద్ధికి వాళ్లూ కారకులే 
- బిల్‌గేట్స్‌

తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి పర్యవసానాన్ని తప్పించుకోలేరు
- రామకృష్ణ పరమహంస

ప్రతి వ్యక్తిలోనూమంచీ, చెడూ ఉంటాయి, మనం మంచిని మాత్రమే చూడటం అలవాటు చేసుకోవాలి
- గౌతమ బుద్ధుడు

ఓర్పుతో ఎదురుచూసేవాళ్లకు కోరుకున్నవి దొరుకుతాయి.
- రాబిన్‌

పుట్టుకతోనే జీవితం పూలవనం కాదు, ప్రతి మొక్కా మనమే నాటుకుని దాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చుకోవాలి
- ప్లేటో

అంతరాయాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్పాన్ని మరింత దృఢం చేసుకుంటూ వెళ్లాలి  
- మదర్‌ థెరెసా

మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించాలి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించాలి
- స్వామి వివేకానంద

స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు 
- రూజ్‌వెల్ట్‌

మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.
- ఫ్రాంక్లిన్‌

శత్రువు ఒక్కడైనా ఎక్కువే... మిత్రులు వందమంది ఉన్నా తక్కువే
- స్వామి వివేకానంద

దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు.
- గౌతమబుద్ధుడు

కన్నీటి చుక్క కారిస్తే కాదు.. చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు
-శ్రీశ్రీ

సూర్యుణ్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది
- స్వామి వివేకానంద

ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం
- రామకృష్ణ పరమహంస

సంకల్పబలం ఉన్నవారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోగలరు.
-నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌

నాణేలు శబ్దం చేస్తాయి. కానీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే మన విలువ పెరిగే కొద్దీ హుందాగా ఉండాలి.
-షేక్‌స్పియర్‌

ఇతరుల మెదళ్లనూ పనిచేయించ గలవాడే నిజమైన మేధావి
-సుభాష్‌ చంద్రబోస్‌

శత్రువు నీకన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే
- భగత్‌సింగ్‌

మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం
- డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌

పొగిడితే మందహాసం చేసి..తిడితే మౌనం వహించేవాడే ఉత్తముడు
-మహాత్మా గాంధీ

పదే పదే ప్రార్థించడం కన్నా.. పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న
-మదర్‌ థెరెసా

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు.
-అబ్రహాం లింకన్‌

పూల పరిమళం గాలి వాటుకే వెళుతుంది. మనిషి మంచితనం మాత్రం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది
- చాణక్యుడు

పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి. మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేయాలి
-అబ్దుల్‌ కలాం

మందలో ఒకరిలా ఉండకు.. వందలో ఒకరిలా ఉండేందుకు ప్రయత్నించు
-స్వామి వివేకానంద

ఈ ప్రపంచం బాధ పడేది చెడ్డవారి హింసవల్ల కాదు, మంచివారి మౌనం వల్ల
- నెపోలియన్‌

కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు
-మహాత్మా గాంధీ

ఇతరులపై గెలిచినవాడు బలవంతుడు. తనను తాను గెలిచిన వాడు శక్తిమంతుడు
-బ్రూస్‌లీ

వేరేవారి తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు.
- చాణక్యుడు

ఉత్సాహంతో శ్రమించాలి. అలసటను ఆనందంగా అనుభవించాలి
- స్వామి వివేకానంద

అందరూ గొప్పసేవలు చేయలేకపోవచ్ఛు కానీ చేసేది చిన్న సేవే అయినా గొప్పగా ఉండాలి
- మదర్‌ థెరెసా

 ప్రపంచం మారాలని  కోరుకోవడం కాదు.. ముందు మనం మారాలి
- టాల్‌స్టాయ్‌

తల్లి మేలు కోరని చెడ్డ కుమారుడు ఉండవచ్చు. కానీ కుమారుడి మేలు కోరని చెడ్డ తల్లి ఉండదు
-శంకరాచార్య

సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు. కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు
- బ్రూస్‌లీ

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
-అబ్రహం లింకన్‌

లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే.. నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది
-గౌతమ బుద్ధుడు

ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే
- నెల్సన్‌ మండేలా

ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ.. మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను, శత్రువులను  సంపాదించి పెడుతుంది
- చాణక్యుడు

మనకు ఒకరు సేవ చేసేకంటే.. మనం ఇతరులకు సేవ చేయడమే ఉన్నతమైంది
-మదర్‌ థెరెసా

కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు, అయితే ఎప్పుడో కానీ సరైన కారణం ఉండదు
-బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే.. విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి.

చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయానికి దారులు
- స్వామి వివేకానంద

సమస్యకు పరిష్కారం, ప్రశ్నకు సమాధానం, దుఃఖం తర్వాత సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం కచ్చితంగా ఉంటుంది

మనసు ఆనందంగా ఉంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది
- గౌతమ బుద్ధుడు

ఓర్పు లేని మనిషి. నూనె లేని  దీపంలాంటి వాడు

ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ కనబరచాలి

అసలు పనిచేయకుండా బద్ధకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు
- స్వామి వివేకానంద

ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు
- అంబేడ్కర్‌

అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే విజయ సాధనకు మార్గాలు
- స్వామి వివేకానంద

ప్రతి ఒక్కరిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ అందరిలో మంచే చూడాలి.
- గౌతమ బుద్ధుడు

భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు
- చెగువేరా

ఇతరుల మెదళ్లనూ పనిచేయించగలవాడే మేధావి
- సుభాష్‌ చంద్రబోస్‌

నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు
- అంబేడ్కర్‌

మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
- మహాత్మాగాంధీ

ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీని వల్ల ఫలితమేంటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలుపెట్టొద్ధు...
- చాణక్యుడు

నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది
- బ్రూస్‌లీ

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి, సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

మీరు చేసిన పని అద్భుతంగా ఉండాలి అంటే చేస్తున్న పనిని ప్రేమించాలి
- ఐన్‌స్టీన్‌

అవసరమైతేనే మాట్లాడు.. లేకపోతే మౌనంగా ఉండేందుకు ప్రయత్నించు
- గౌతమ బుద్ధుడు

నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది
- స్వామి వివేకానంద

సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
-మహాత్మా గాంధీ

భయం నీకు చేరువవుతుంటే, దానిపై యుద్ధం ప్రకటించు
- చాణక్య

మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు
- మహాత్మా గాందీ

ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు 
-గౌతమ బుద్ధుడు

మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ.. ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేం
- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి.. ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి
- మహాత్మా గాంధీ

ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పు గుర్తు చేసుకో.. ఇక ఎప్పటికీ ఆ తప్పు పునరావృతం కాదు
- ఆస్కార్‌ వైల్డ్‌

గ్రంథాలయాలు ప్రపంచానికి కిటికీలు. అవి లేని ఊళ్లు అజ్ఞానాంధకార కూపాలు
-చిలకమర్తి లక్ష్మీ నరసింహం

కింద పడ్డానని ఆగిపోకు.. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే
- అబ్దుల్‌ కలాం

ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించు
-మదర్‌ థెరెసా

నీ కోసం.. చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా.. కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న
-రామకృష్ణ పరమహంస

ముఖం మీద చిరునవ్వు లేకపోతే, అందమైన దుస్తులు వేసుకున్నా.. ముస్తాబు పూర్తి కానట్లే
-మహాత్మా గాంధీ

హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే.. హృదయాన్నే అనుసరించండి
- స్వామి వివేకానంద

విధి నిర్వహణను మించిన దేశ సేవ లేదు
-మహాత్మా గాంధీ

కోపం మాటల్లో ఉండాలి. మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు. మనసులోనూ ఉండాలి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

కుటుంబం కోసం త్యాగం చేసే వాడు ఉన్నతుడైతే, దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడవుతాడు
- మహాత్మా గాంధీ

ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే!
-బి.ఆర్‌.అంబేడ్కర్‌

మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా.. అది గెలుపే అవుతుంది
- అబ్దుల్‌ కలాం

ఆత్మవిశ్వాసం మనిషికి అసలైన ఆభరణం
- స్వామి వివేకానంద

ఒక అమ్మ.. వందమంది ఉపాధ్యాయులతో సమానం
-రామకృష్ణ పరమహంస

అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు
- మహాత్మా గాంధీ

మానవుడు సృష్టించిన వాటిలో అత్యద్భుతమైనది పుస్తకమే
- మాక్సింగోర్కీ

తన తప్పునకు ప్రతివారూ పెట్టుకొనే అందమైన పేరు.. అనుభవం.
-ఆస్కార్‌ వైల్డ్‌

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుకా ఓ అవకాశం దాగి ఉంటుంది
- ఐన్‌స్టీన్‌

ఇతరుల్ని ఓడించడం సులువే కానీ వారి మనసులను గెలవడం కష్టం
- అబ్దుల్‌ కలాం

నీది కాదని తెలిసిన దాన్ని కూడా నీదనుకోవడం నిజంగా నేరం
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

చదవదగిన గ్రంథమెప్పుడూ కొనదగిందే
- జాన్‌ రస్కిన్‌

మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. కానీ మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది
- రామకృష్ణ పరమహంస

స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి
- లెనిన్‌

తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు
- గౌతమ బుద్ధుడు

మంచి దేశాన్ని నిర్మించాలంటే, ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య

శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం.
- అబ్రహం లింకన్‌

ఎదుటి వారిపై అసూయ పడుతున్నామంటే అది మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి
- అబ్రహం లింకన్‌

దృఢమైన మనసున్న వారికి అంధకారంలోనూ కాంతిరేఖ కనిపిస్తుంది
- సోక్రటీస్‌

ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డు లేని పడవలాంటి వాడు
- మహాత్మాగాంధీ

దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసును ఎవరూ పాడు చేయలేరు
-స్వామి వివేకానంద

ఆశావాది ఆపదలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు
- అబ్రహం లింకన్‌

అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది
- మదర్‌ థెరిస్సా

విజయం.. మేధావిని వినయవంతుణ్ని చేస్తుంది, అవివేకిని అహంభావిగా మారుస్తుంది
- స్వామి వివేకానంద

వ్యర్థమైన వేల పలుకుల కన్నా, శాంతి, సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు
-గౌతమ బుద్ధుడు

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాదిగా మారాలి
- సాథె

మంచి పనులకు పునాది క్రమశిక్షణే, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది
-సర్వేపల్లి రాధాకృష్ణన్‌

చీకట్లోనే నక్షత్రాలు కనబడతాయి. అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి
- శంకరాచార్యులు

విద్యార్థులు ప్రతి క్షణాన్ని విలువైనదిగా శ్రమిస్తే అనుకున్నది సాధించగలరు
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ అదుపులో ఉంచుకొని మాట్లాడు
- రామకృష్ణ పరమహంస

కొద్దిపాటి నిర్లక్ష్యమే కొండంత సమస్యకు దారి తీస్తుంది
- ఫ్రాంక్లిన్‌

అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే... మనలోనూ అది పెరుగుతుంది
- రామకృష్ణ పరమహంస

కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతం అవుతుంది
-పైథాగరస్‌

ప్రవర్తన అనేది తెల్లకాగితం లాంటిది.. ఒక్కసారి దాని మీద మరక పడితే, మళ్లీ తెలుపు కావడం కష్టం
- ఫ్రాంక్లిన్‌

ఓర్పు చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది
- రూసో

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం
- గాంధీజీ

ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు
- ఎమర్సన్‌

చరిత్ర చదవడమే కాదు.. సృష్టించాలి
-నెహ్రూ

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది
- రామకృష్ణ పరమహంస

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం.. కృషితో మనం సంపాదించుకొనేదే శాశ్వతం
-మహాత్మాగాంధీ

విజ్ఞానమనేది చెప్పే సమాధానంలోనే కాదు...అడిగే పశ్నలోనూ ఉంటుంది
- సర్‌ సి.వి.రామన్‌

వినడంలో మనిషి తొందర పడాలి. మాట్లాడటంలో కాదు.
-జేమ్స్‌ జ్యూడిత్‌

మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్ధు. ఎందుకంటే మీరు రెండోసారి ఓడిపోవచ్చు.
- అబ్దుల్‌ కలాం

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు
-అరిస్టాటిల్‌

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది
-రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో..  దానికి నువ్వే నాంది పలకాలి
-మహాత్మా గాంధీ

ఒప్పుకొనే ధైర్యముంటే, తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే
-బ్రూస్‌లీ

అపజయాలను ఖాతరు చేయకండి. వెయ్యిసార్లు విఫలమైనా మరోసారి విజయం కోసం ప్రయత్నించాలి
- సుభాష్‌ చంద్రబోస్‌

తప్పును సరిదిద్దకపోతే అది మరింత ఆపదను తెచ్చిపెడుతుంది
- స్వామి వివేకానంద

ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని
- చాణక్యుడు

దుఃఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

వెయ్యిసార్లు అపజయం ఎదురైనా గెలవాలనే కాంక్షను వదలొద్దు
- సుభాష్‌ చంద్రబోస్‌

దేశ స్వేచ్ఛని కాపాడుకోవడమనేది ప్రతి పౌరుడి బాధ్యత
- సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

స్పష్టత లేకుండా మాట్లాడటంకన్నా మౌనమే మిన్న
- సోక్రటీస్‌

మనకు పట్టుదల ఉండాలి, అన్నింటికంటే మించి మన మీద మనకు విశ్వాసం ఉండాలి.
- మేరీ క్యూరీ

ఘన విజయాలు సాధించడానికి అంకిత భావంతో పనిచేయండి
- అబ్దుల్‌ కలాం

మనిషి ఎంత గొప్పవాడైతే..అంత కఠినమైన పరీక్షలు దాటాల్సి ఉంటుంది
-స్వామి వివేకానంద

నీ విజయాన్ని అడ్డుకునేది వేరెవరో కాదు.. నీలోని ప్రతికూల ఆలోచనలే
- అబ్దుల్‌కలాం

ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మూర్ఖుడి చేతిలో పుస్తకం.. అంధుడి చేతిలో అద్దం లాంటిది.
-చాణక్యుడు

గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి
- అంబేడ్కర్‌

వేలాది వ్యర్థమైన మాటల కన్నా... శాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు
-గౌతమ బుద్ధుడు

అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే  
- లింకన్‌

మనస్ఫూర్తిగా పనిచేయనివారు.. జీవితంలో విజయాన్ని సాధించలేరు
- అబ్దుల్‌ కలాం

మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే
- స్వామి వివేకానంద

గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది
- మహాత్మా గాంధీ

మితిమీరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది
- అంబేడ్కర్‌

మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు.
- గాంధీజీ

కోరికలు మితంగా ఉంటే.. బాధలూ పరిమితంగానే ఉంటాయి
- రమణ మహర్షి

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయమూ దక్కదు
- అబ్రహం లింకన్‌

మండిన కొవ్వొత్తి మనది కానట్లే... గడచిన కాలమూ తిరిగిరాదు
- అంబేడ్కర్‌

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు. మీ అభివృద్ధికి అవే ఆటంకాలు
-నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌

ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు, దాన్ని జయించిన వాడు
-నెల్సన్‌ మండేలా

తక్కువ సంపాదించే వారి కన్నా.. తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి
- మహాత్మా గాంధీ

అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు..ఒక్క నిజాన్ని తప్ప
- గౌతమ బుద్ధుడు

ఇతరుల దు:ఖాన్ని చూసి సంతోషించే వారు మూర్ఖులు
- అరిస్టాటిల్‌

పదునైన ఆయుధం కంటే క్షణ కాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం
- రామకృష్ణ పరమహంస

ఎంత ఎక్కువకాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
- అంబేడ్కర్‌

కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి.
- అబ్దుల్‌ కలాం

అన్నదానం ఆకలిని తీరిస్తే.. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది
-సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ప్రపంచంలో ఏ మార్పునైతే కోరుకుంటావో.. దానికి నువ్వే నాంది పలకాలి
-మహాత్మాగాంధీ

అందం అనేది నడవడికలో ఉంటుంది.. ఆడంబరాల్లో కాదు
-మహాత్మా గాంధీ

మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు
- గౌతమ బుద్ధుడు

ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు..హృదయంలో ఉంటుంది.
- మహాత్మా గాంధీ

ప్రయత్నం చేసి ఓడిపో..  కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

బయట కనిపించే మురికి గుంతల కన్నా.. మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం
- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మనిషి మంచిదనం మాత్రం నాలుగుదిక్కులకూ వ్యాపిస్తుంది.
- చాణక్యుడు

మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే!
- స్వామి వివేకానంద

జీవితంలో... ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో.. కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడతాడో.. ఎప్పటికీ విడువని నీడలాగా ఆనందం ఆ వ్యక్తిని వెన్నంటే ఉంటుంది
- గౌతమ బుద్ధుడు

మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనకా ఓ అవకాశం దాగి ఉంటుంది.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్

విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది
- అబ్దుల్‌కలాం

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న
- రమణ మహర్షి

నీ వెనక ఏముంది, ముందు ఏముంది అనేది అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.
- స్వామి వివేకానంద

ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే.. శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు.
- ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం
-మదర్‌ థెరిసా

కష్టాలను చూసి పారిపోయే వారి కంటే.. వాటిని ఎదుర్కొనే వారే విజయం సాధించగలరు.
-మహాత్మా గాంధీ

డబ్బు లేనివాడు కాదు.. జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు
-స్వామి వివేకానంద

శత్రువు నీ కన్నా బలవంతుడు అనుకున్న మరుక్షణం నీ పతనం ప్రారంభమైనట్లే
- భగత్‌సింగ్‌

శాంతంగా ఉండే వారి మనసు స్వర్గంలాంటిది
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి
- స్వామి వివేకానంద

ప్రతి మనిషికీ మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి ఉండదు
- మదర్‌ థెరిసా

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు.. ప్రయత్నించనిదే విజయం దక్కదు
- అబ్రహం లింకన్‌

మనసు చెప్పినట్లు వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి
-గౌతమ బుద్ధుడు

వినడానికి కటువుగా ఉన్నా.. మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్లదు  
- భగవద్గీత

మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే!
- స్వామి వివేకానంద

మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతారు
- అరిస్టాటిల్‌

ఆశ, ధైర్యం ఎప్పటికీ కోల్పోవద్దు, మీ ముందున్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే విజయం మిమ్మల్ని వరిస్తుంది  
- సర్‌ సి.వి.రామన్‌

పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ... మనం అవకాశాలను సృష్టించుకోవాలి
-బ్రూస్‌లీ

సాయం చేస్తే మరిచిపో.. సాయం పొందితే గుర్తుంచుకో
- గాంధీజీ

కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
- స్వామి వివేకానంద

మొదటి విజయం సాధించిన తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. రెండో ప్రయత్నంలో ఓడిపోతే.. నీ గెలుపు గాలివాటంగా వచ్చిందనుకుంటారు.
- అబ్దుల్‌ కలాం

విజయం అంటే.. నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడం!
- అబ్దుల్‌ కలాం

స్తుతించే వారి కంటే.. కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా మంచిని పొందగలం.
- మహాత్మా గాంధీ

ఏ ప్రాణినీ చంపకూడదు, ఆ ప్రాణిలోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి, దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతి మనిషి మంచివాడే  
- వేమన

చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు
- జవహర్‌ లాల్‌ నెహ్రూ

అపజయాలు తప్పులు కావు... అవి భవిష్యత్తు పాఠాలు
- అబ్దుల్‌ కలాం

ఏదైనా తనంతట తాను నీ దరిచేరదు.. ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది  
-శ్రీశ్రీ

కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే
- గౌతమ బుద్ధుడు

చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు
- ప్లేటో

కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది 
- రమణ మహర్షి

మనం ఎలా ఆలోచిస్తే...  అలానే ఉంటాం
- గౌతమ బుద్ధుడు

మన ప్రవర్తనకు మూలం... కోరిక, భావోద్వేగం, జ్ఞానం
-ప్లేటో

ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే
- లింకన్‌

చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది
- రమణ మహర్షి

విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే... గమ్యం కాదు
- అబ్దుల్‌ కలాం

మనిషికి అసలైన సిరిసంపదలు... సంతోషం, తృప్తి
- సోక్రటీస్‌

విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాలు
- స్వామి వివేకానంద

మండిన కొవ్వొత్తి లాగే... గడిచిన కాలమూ తిరిగిరాదు.
- అంబేడ్కర్‌

మనుషుల్ని గాయపరచడం ఎంత తప్పో, మనసుల్ని గాయపరచడమూ అంతే తప్పు
- సోక్రటీస్‌

గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు
- లింకన్‌

నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు.. ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు
- గౌతమ బుద్ధుడు

నువ్వు రోజూ అబద్ధం ఆడితే, అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది
- శ్రీశ్రీ

మనస్ఫూర్తిగా పనిచేయలేనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
- అబ్దుల్‌ కలాం

నీవు సంపాదించే దాని కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే... నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు
- అరిస్టాటిల్‌

అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది, అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యాన్నివ్వాలి
- గాంధీజీ

ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి
- స్వామి వివేకానంద

విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది, అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది.
- చాణక్యుడు

కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది.
- అబ్దుల్‌ కలాం

ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు
 - గౌతమ బుద్ధుడు
 
ఏ అర్హత మనకుంటే అదే లభిస్తుంది
- స్వామి వివేకానంద

విజ్ఞానం మనల్ని శక్తిమంతుల్ని చేస్తే, మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలా చేస్తుంది.
- అబ్దుల్‌ కలాం

స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనమే మిన్న
- రమణ మహర్షి

చేసేది చిన్న పనైనా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది
- స్వామి వివేకానంద

వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు
- స్వామి వివేకానంద

నువ్వు యుద్ధం గెలిచేంత వరకూ ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది
- అరిస్టాటిల్‌

విలువైన మాటలు చెప్పేవాళ్లు దొరకడం మన అదృష్టం, అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం
- స్వామి వివేకానంద

ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు
- గాంధీజీ

సాధించాలనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది
- సోక్రటీస్‌

సరిదిద్దకుండా వదిలేసిన తప్పుల్ని మించిన ఆపదలు మరేమీ ఉండవు
- స్వామి వివేకానంద

అందరినీ నమ్మడం,  ఎవ్వరినీ నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే
- అబ్రహాం లింకన్‌

మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.
- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేం, వివేకంతో మాత్రమే అది సాధ్యం
- స్వామి వివేకానంద

గొప్ప పనులు చెయ్యడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడమే
- స్టీవ్‌ జాబ్స్‌

ఉపాధ్యాయుడే విద్యార్థికి విలువైన పాఠ్యపుస్తకం
- గాంధీజీ

మనిషి తన చేతలతోనే గొప్పవాడు అవుతాడుగానీ జన్మతః కాదు
- చాణక్యుడు

మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది
- గాంధీజీ

అదృష్టం కావాలంటే ఎదురుచూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి
- రూజ్‌వెల్ట్‌

విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు.. నిన్ను నువ్వు గెలవడం
- గౌతమ బుద్ధుడు

ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి...
- గాంధీజీ

చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించకుండా జీవించే వ్యక్తిలోఆత్మీయత ఉంటుంది
- రూజ్‌వెల్ట్‌

చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు
- అబ్దుల్‌ కలాం

కష్టాల్ని చూసి పారిపోయేవాడు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు
- ప్లేటో

ఏదీ శాశ్వతం కాదు, ఎంతటి గడ్డు పరిస్థితులైనా మారిపోక తప్పదు
- హెలెన్‌ కెల్లర్‌

చివరి వరకూ పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు
- చేగువేరా

గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి
- వినోబాభావే

అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి
-  మక్సీం గోర్కీ

సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లూ వాటంతటవే వస్తాయి.
- స్వామి వివేకానంద

పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు, మీ అభివృద్ధికి అవే ఆటంకాలు
- సుభాష్‌ చంద్రబోస్‌

విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు
- ఆస్కార్‌ వైల్డ్‌

ఆనందం వస్తువుల్లో లేదు, అది మనసులో ఉంది
- ఎమర్సన్‌

శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే
- గౌతమ బుద్ధుడు

Telugu Quotations - Motivational Quotes In Telugu Text


ప్రయత్నం మానేస్తే మరణించినట్టే! ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే!!

మనిషిలోని ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతే కాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.

అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.

చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.

నీ కలలు నిజం కావాలంటే నీకు ముందుగా కలలు సాధించే ఆశయాలు ఉండాలి.

తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.

జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు.. అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.

జీవితాన్ని మొత్తంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది మళ్లీ తిరిగి రాదు.

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.

అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.

గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.

ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు.

జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే.

జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే.. దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ.. ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.

తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.

మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు.

ఏడ్చనివాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.

అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.

జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.

జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు.. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం.

కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.

చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.

ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు.

నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.

అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.

ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.

నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం.

పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది. చెయ్యకూడదు అనుకునేవారికి సాకు దొరుకుతుంది.

నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే.

చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.

అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైనవాడు వేరొకరు లేరు.

పరిస్థితులు భయస్తులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి.

నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.

చెయ్యగలిగిన వాడు చేస్తాడు. చెయ్యలేని వాడు చెప్తాడు.

ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు. దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు. దాని గురించి పని చేయడం తెలియాలి.

జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు.

ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు.

ఎంత ఆకలితో ఉన్న సింహం గడ్డి తినదు. అలాగే ఎంత పెద్ద కష్టాల సుడిలో మునిగినా ఉత్తముడు నీతి తప్పడు.

ప్రవర్తన అద్దంలాంటిది, ప్రతీ వ్యక్తి ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది.

చేసే పనిని ప్రేమించ గలిగితే ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుతుంది.

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నపుడే వాటి విలువను గుర్తించాలి.

విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.

కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు.

మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.

రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.

నేను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.

నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.

సమాజం ద్వారా మనం ఎలా ఉంటున్నామో తెలుస్తుంది. ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది.

అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.

నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉండవచ్చు కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

జరిగిపోయిన దానిని గురించి చింతించకు. మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది.

మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు. దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి.

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.

హింసా మార్గంలో ఏమీ సాధించలేము, కంటిలోని నలుసును తీసివేయటానికి ముల్లును ఉపయోగిస్తే కన్నే పోతుంది.

నీ లక్షాన్ని చేరుకోవటానికి నీ దారిని నీవే ఏర్పరచుకోవాలి, ఇతరుల సహాయం కొరకు ఆశిస్తే నీకు నిరాశే మిగులుతుంది.

సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది, సంపదలు ఉంది సంస్కారం శూన్యం అయితే బ్రతుకు వ్యర్థంగా మారుతుంది.

గొప్ప లక్షాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం అవ్వటం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవటమే నేరం.

ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని సాధించటంలో ఉన్న ఆనందం వెయ్యి కోరికలను తీర్చుకున్నా లభించదు.

ఒక ధనవంతుడుకి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే.

పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు. బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.

ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.

జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో, వారి వల్లే ఎక్కువ బాధపడతావు.

తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి

తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్ తుది శ్వాస విడుస్తూ ఎడిపిస్తావ్ రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం

నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే. ఒక్కసారి జీవించినా చాలు

పది మందికి మేలు చేసే వాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది వుంటారు

తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు.

సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు

జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది

ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి.

మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే.. అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.

మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.

మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయదగిన పనులు చేయాలి.

మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి. కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో.. మనం ఏం చేశామనేది మాత్రమే.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.

జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే. అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే.

ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోడు.

ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే, విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం.

జీవితం ఒక యుద్దభూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు.

ఎప్పుడూ కింద పడకపోవటం గొప్పకాదు,పడినప్పుడల్లా మళ్లీ పైకి లేవటమే గొప్ప.

ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.

పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు. బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.

ఒక ధనవంతుడుకి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే.

మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయదగిన పనులు చేయాలి.

నేను ఇతరులను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు. నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.

అర్థరహితమైన మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా మంచిది.

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం.

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దీనిలో చాలా మంది విఫలం కావటానికి కారణం, ప్రతీఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించక పోవటమే.

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

నీవు ప్రతీ రోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరోకాదు, నిన్నటి నువ్వే.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోనపుడు నీ అసలైన విజయపు ఆనందాన్ని నీవు పొందుతావు.

మనం చేసే తప్పులన్నింటిలో పెద్ద తప్పు మన స్వంత తప్పులను గ్రహించకుండా ఇతరుల తప్పులను వెతకటమే.

ఉపయోగపడని విజ్ఞానం దీపం ముందు కూర్చొని కళ్ళు మూసుకోవటంతో సమానం.

నాలుక కన్నా చెవులే మంచివి, తాము విన్నవి అవి చెప్పలేవు. కానీ తాను విననిది కూడా నాలుక చెప్పగలదు.

సామర్థ్యం ఉంటే విజయం లభిస్తుంది. నడవడిక ఆ విజయాన్ని నిలబెడుతుంది.

మనం ఆనందంతో నవ్వని రోజు వృధా చేసిన రోజుతో సమానం.

మంచిని ప్రోత్సహించినంత మాత్రాన సమాజంలో మార్పు రాదు. చెడును కూడా నిరోధించాలి.

పొగడ్తలకు లొంగరు అనడమే అన్నింటికన్నా గొప్ప పొగడ్త.

ఆలస్యం చేస్తే సులభమైన పని మరింత కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.

తన ఆశయాలకొరకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.

మన జీవితాన్ని ఆస్వాదించడానికి మనకు ముఖ్యంగా కావలసింది మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.

మన జీవితాశయం జీవితాన్ని గడిపేయటం కాకూడదు, దానిని వృద్ధి చేసుకోవటం అయి ఉండాలి.

ఆశని ఎప్పుడూ కోల్పోవొద్దు. మన ఈ రోజటి ఆశయాలే, మనం ఊహించే రేపటి వాస్తవాలు.

జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది, కానీ దానికి మన మనస్సు అంగీకారం కావాలి.

మీ జీవితం అనేది ఈ ప్రపంచానికి మీరు ఇచ్చే ఒక సందేశం లాంటిది. అది ఇతరులకు స్ఫూర్తిని కలిగించేలా చూసుకోండి.

మీరు కోరుకున్న ప్రతీది భయానికి మరొకవైపు ఉంటుంది.

మీరు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే … సగం పని పూర్తైపోయినట్లే.

ఎడారిలో మంచి నీటిని ఆశించటంలాంటిదే సాధన లేకుండా విజయాన్ని ఆశించటం.

కేవలం ఉహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు, నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.

బద్ధకం, విజయం. రైలు పట్టాల వంటివి ఎన్నటికీ కలవవు.

ఎంత ఉన్నా ఇంకా కావాలని తపించేవాడు నిజమైన పేదవాడు.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి.

రాపిడి లేకుండా వజ్రం ప్రకాశించనట్లే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.

చేసే సంతకం కుడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కొన్నిసార్లు పేరును కూడా..

నీ బాధ్యతను నీవు గ్రహించినపుడు, నీ ఆశయాలను కూడా పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.

స్వతంత్రంగా జీవించే అవకాశాలున్నా బానిసగా బ్రతికే వాడికంటే, స్వతంత్ర భావాలుండే బానిస బ్రతుకు మేలు.

జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు.

జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం

అద్దమే నా మంచి మిత్రుడు.. ఎందుకంటె నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు కనుక -చార్లీ చాప్లిన్

ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి

పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.

మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోహం రెట్టింపవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది.

అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.

ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం.

ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి.. ఆ పని చేయడమే

నిరాశావాది తనకు ఎదురైన.. ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు.

జీవితంలో మనం గెలుపు కంటే.. ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానిని గురించి ఏడవటం మూర్ఖత్వం.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు.

చెయ్యగలిగిన వాడు చేస్తాడు. చెయ్యలేని వాడు చెప్తాడు.

జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు. అందులో ప్రతీవారూ తాము కోరినంత నేర్చుకోవచ్చు.

స్వార్థం, లాభాపేక్షలు  ఎంతటి బలవంతున్నయినా బలహీనం చేయగలవు.

నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.

జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.

తన ఆశయాలకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.

నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినపుడు, నీ ఆశయాలను పూర్తిచేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.

విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.

దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్త కన్నా నింద మేలైనవి.

జీవితం తెలివైన వారికి ఓ ఆశ, అవివేకికి ఒక ఆట, ధనవంతుడికి హాస్యము, పేద వాడికి దుఖఃము.

ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు.. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.

గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి.. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం.

ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

మన ఏ ఊహలైనా నిజం అవుతాయి, ఒకవేళ మనం నిజమైన ఉత్సాహంతో వాటిని చేపట్టి ముందుకు సాగగలిగితే.

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.

ఇనుము వాడుకుంటే తుప్పు పట్టినట్లు, నిశ్చలంగా ఉంటే నీరు స్వచ్ఛత కోల్పోయినట్లు, బద్దకంగా ఉంటే మెదడు నిస్తేజం అవుతుంది.

చీకటి తరువాత వచ్చే వెలుతురు ఆనందాన్ని ఇచ్చినట్టుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయి.

కాలం విలువని గ్రహించని వాడు జీవితపు విలువని అర్థం చేసుకోలేడు.

జీవితం తెలివైన వారికి ఓ ఆశ, అవివేకికి ఒక ఆట, ధనవంతుడికి హాస్యము, పేద వాడికి దుఖఃము.

పదిమందీ మనం చేసే ప్రతీపనిని ప్రశంసించాలని ఆరాటపడటంలో మన అసలు బలహీనత బయటపడుతుంది.

మన అజ్ఞానం గురించి తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం.

అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చగలగాలి.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుగు పంచాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంలా అయినా మారాలి.

ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్షాన్ని అడుగుగా మర్చి విజయాన్ని సాధించవచ్చు.

ఒక్క అడుగు ప్రారంభిస్తేనే వెయ్యి మైళ్ళ ప్రయాణం అయినా పూర్తి అవుతుంది.

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది అదే భవిష్యత్తు.

ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

చేయగలిగే శక్తి ఉన్నవాడికంటే చేయాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చేయగలడు.

శ్రమ ప్రతీ విషయాన్ని తేలిక పరుస్తుంది. సోమరితనం అన్ని పనులను కష్టంగా మారుస్తుంది.

ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది, విషాదం సగం అవుతుంది.

ఏడ్చని వాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడే బలమైన వాడు.

గొప్ప లక్షాన్ని కలిగి ఉండటంలో ఉన్న ఆనందం గొప్ప సంపదలతో వొచ్చే ఆనందానికి సమానం.

జీవితం లో ఎన్ని మైలు రాళ్ళు ఉన్నా.. నిజంగా ఉండవలసినవి పెదవి ఫై చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే

గడ్డి వామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో హేళన చేసారనో, విమర్శించారనో ఉన్నతుల మనస్సు బాధపడదు.

లక్షాన్ని చూసి దాన్ని చేధించేవాడు భయపడడు, భయపడేవాడు లక్షాన్ని ఛేదించలేడు.

“ఓడిపోతున్నా” అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు.

ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో.

ఆత్మ విశ్వసం లేకపోవటం అపజయాలకు ప్రధాన కారణం.

ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది.

సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే.

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.

ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.

ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

సోమరితనానికి మించిన సన్నిహిత శత్రువు లేదు.

నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.

సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు.

పొగడ్త పన్నీరు లాంటిది దాన్ని వాసన చూడాలే తప్ప తాగకూడదు!

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.

మన విద్యా విధానం జీవించటానికి ఏం చేయాలో చెపుతుంది కానీ జీవించటం ఎలా అన్నది మనమే నేర్చుకోవాలి.

నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.

పరిస్థితులు భయస్తులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి.

అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైనవాడు వేరొకరు లేరు.

చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.

నీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే.

నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం.

పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది. చెయ్యకూడదు అనుకునేవారికి సాకు దొరుకుతుంది.

జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో, వారి వల్లే ఎక్కువ బాధపడతావు.

ఆలస్యం అవుతుందని చేపట్టిన పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప కార్యాలు సమయాన్ని ఆశిస్తాయి.

తెలుగు కొటేషన్స్

Post a Comment

Previous Post Next Post